Tollywood Magazine Telugu November - 2016

Page 1

NOVEMBER 2016 VOL 13 ISSUE 11

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET




బా

హుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందే త్రి భాషా చిత్రం లో నటించనున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో ప్రభాస్ కు జోడీ గా ఏ పోరి నిఎంపిక చేయనున్నారో తెలుసా .............. బాలీవుడ్ భామ పరినీతి చోప్రా . అవును ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ భాషలలో ఆ సినిమా ఉంటుంది కాబట్టి పరినీతి చోప్రా అయితే బాగుంటుందని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు . ఆమేరకు పరినీతి చోప్రా ని కలవడం కథ , కథనాలను వివరించడం కూడా జరిగిపోయిందట . ఇక పరినీతి కూడా మారు మాట మాట్లాడకుండా ప్రభాస్ తో నటించడానికి ఒప్పుకుంది . ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది దానికి తోడూ బాహుబలి ది కంక్లూజన్ కూడా వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి తప్పకుండా ఈ చాన్స్ వదులుకోవద్దు అని అనుకుంటోంది పరినీతి చోప్రా . 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే పూర్తీ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు .




“YOU ARE ALWAYS RESPONSIBLE FOR HOW YOU ACT, NO MATTER HOW YOU FEEL. REMEMBER THAT.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By

: : : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 NOVEMBER 2016

టాలీవుడ్ P 3






మా

స్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 18న గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.

'ఒక్కడొచ్చాడు' టీజర్‌కి 25 లక్షల వ్యూస్‌

సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ ''ఈ చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. 'ఒక్కడొచ్చాడు' టీజర్‌ను ఇటీవల హీరోయిన్‌ కాజల్‌ విడుదల చేశారు. ఒక్కరోజులోనే తెలుగు, తమిళ భాషల్లో ఈ టీజర్‌కు 25 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. టీజర్‌కి అన్నిచోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విశాల్‌ కెరీర్‌లోనే 'ఒక్కడొచ్చాడు' డిఫరెంట్‌ మూవీ అవుతుంది. యాక్షన్‌ వుంటూనే మంచి మెసేజ్‌తో రూపొందుతున్న కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌ది. ఇందులోని పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తియ్యడం జరిగింది. సినిమాకి అవి చాలా పెద్ద హైలైట్‌ అవుతాయి. హిప్‌హాప్‌తమిళ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నవంబర్‌ మొదటి వారంలో ఆడియోను రిలీజ్‌ చేసి, నవంబర్‌ 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'ఒక్కడొచ్చాడు' విశాల్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్‌సినిమా అవుతుంది'' అన్నారు. శాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

వి

4 P టాలీవుడ్

చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.






హేష్ బాబు సోదరి మంజూల అసలు హీరోయిన్ గా పరిచయం కావాల్సి ఉంది అయితే కృష్ణ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం వల్ల ఆ ఆలోచన విరమించుకుంది కానీ ఆమెలో నటించాలన్న కుతూహలం కొద్ది కొన్నేళ్ళ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది కూడా . ఆ తర్వాత మహేష్ తో పోకిరి వంటి సూపర్ హిట్ సినిమాలో భాగస్వామి అయ్యింది . పోకిరి సూపర్ హిట్ కావడంతో మరికొన్ని సినిమాలు నిర్మించింది పాపం కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అయి ఆర్ధికంగా ఇబ్బందులు తేవడంతో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది అయితే మళ్ళీ ఇప్పుడు వెండితెర మీదకు వస్తోంది మంజూల . అయితే ఈసారి నిర్మాతగా కాకుండా దర్శకురాలిగా వస్తోంది . ఆ మేరకు ఓ కథ కూడా రెడీ చేసుకున్న మంజుల సందీప్ హీరోగా ఓ సినిమా చేయనుంది . దర్శకురాలిగా సక్సెస్ అయితే తమ్ముడి ని హీరోగా పెట్టి మంజుల డైరెక్షన్ చేయడం ఖాయం .

టాలీవుడ్ P 5


 ! వ

6 P టాలీవుడ్

రుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా కుక్కల దొంగ గా నటిస్తున్నాడు . ఇటీవల రిలీజ్ అయిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే పోస్టర్ కి మంచి అప్లాజ్ వస్తోంది . కామన్ గా చాలా వరకు ఇంటి ముందు కుక్క ఉంది జాగ్రత్త అని రాసి ఉంటుంది కానీ ఇక్కడ రివర్స్ లో కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే టైటిల్ ని పెట్టారు అక్కడే అటెన్షన్ కొట్టేసారు ఆ చిత్ర యూనిట్ . డిఫరెంట్ మాడ్యులేషన్ తో రాజ్ తరుణ్ తనదైన ముద్ర వేసాడు . వరుస విజయాలు సాధిస్తునట ్డ ంతో అతడి మార్కెట్ కూడా రోజు రోజుకి పెరుగుతోంది . తాజాగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంతో మరో హిట్ కొట్టేలాగే ఉన్నాడు రాజ్ తరుణ్ . ఇప్పటికే ఆ టైటిల్ పట్ల క్రేజ్ ఏర్పడగా రాజ్ తరుణ్ పోస్టర్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి . సినిమా రిలీజ్ అయ్యాక కాని తెలీదు దాని ఫలితం ఎలా ఉంటుందో మరి .


సౌ

 

భాగ్య చిత్ర ప‌తాకంపై తెర‌కెక్కుతున్న చిత్రం `శ్రీ స‌త్య‌సాయి బాబా`. `అమ్మోరు`, `అరుంధ‌తి`, `దేవుళ్`లు వంటి విజువ‌ల్ వండ‌ర్స్‌ని అందించిన కోడి రామ‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శక‌ ‌త్వం వ‌హిస్తున్నారు. `దేవుళ్`లు నిర్మాత‌ క‌రాటం రాంబాబు నిర్మిస్తున్నారు. పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి బాబాపై తెర‌కెక్కిస్తున్న సేవా ధృక్ప‌థ‌ భ‌క్తి చిత్ర‌మిది. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాల్ని అందిస్తున్నారు. జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు సింగిల్ కార్డ్‌లో 14 పాట‌లకు సాహిత్యం అందించ‌డం విశేషం. ఇటీవ‌లే మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. అక్టోబ‌ర్ 14 నుంచి 2వ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ అల్లూమినియం ఫ్యాక్ట‌రీ, సార‌థి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్స్లో ‌ తెర‌కెక్కించారు. తాజా షెడ్యూల్ పూర్త‌యింది. ఈ షెడ్యూల్లో ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. త్య‌సాయిగా మ‌ల‌యాళ న‌టుడు శ్రీ‌జిత్ విజ‌య్ న‌టిస్తున్నారు. స‌త్య‌సాయికి మాతృమూర్తి గా జ‌య‌ప్రద ‌ ‌, తండ్రి పాత్ర‌లో శ‌ర‌త్‌బాబు న‌టిస్తున్నారు. ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌హాస‌న్‌కి మేక‌ప్‌మేన్‌గా ప‌నిచేసిన ర‌మేష్ మెహంతి ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌లే పాట‌ల రికార్డింగ్ పూర్త‌యింది. ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, వందేమాత‌రం శ్రీ‌నివాస్‌, హ‌రిహ‌ర‌న్,‌ బాల ముర‌ళి కృష్ణ,‌ చిత్ర‌, హ‌రిచ‌రణ్ ‌ ‌, విజ‌య్ ప్ర‌కాష్‌, క‌వితా కృష్ణమూ ‌ ర్తి, కైలాస్ గురి, సుఖ్వింద‌ర్ సింగ్, మ‌ల్లాడి బ్ర‌ద‌ర్స్‌, ఆండ్రియా, టిప్పు త‌దిత‌రులు గానాలాప‌న చేశారు. ప్ర‌ఖ్యాత ఛాయాగ్రాహ‌కుడు బి.వాసు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.

స‌

టాలీవుడ్ P 7




       

వి

వాదాస్పద హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం ఆరోపణల తర్వాత నటిస్తున్న చిత్రం ''మిక్చర్ పొట్లం '' . ఎంవి సతీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోదావరి సినీ టోన్ పతాకంపై లయన్ డాకర్ ్ట కలపటపు శ్రీ లక్ష్మీ ప్రసాద్ , డాకర్ ్ట కంటే వీరన్న చౌదరి , లంకలపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . మాధవపెద్ది సురేష్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది . రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో హాట్ భామ శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్ర పోషించింది కాగా మిక్చర్ పొట్లం పై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది . జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన మిక్చర్ పొట్లం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోందని నవంబర్ లో ఆడియో వేడుక నిర్వహించి డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని , తప్పకుండా మిక్చర్ పొట్లం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు దర్శకులు ఎంవి సతీష్ కుమార్.

8 P టాలీవుడ్


 పృ



థ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్స్ట్ ‌ అధినేత కె.కె. రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నిర్మిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్‌ పూర్తయింది. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్డు లా తూ - ''ఈ చిత్రం షూటింగ్‌పూర్తయింది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. వసంత్‌ చేసిన మ్యూజిక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది'' అన్నారు. థ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా సలోని, శృతి సోధి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విసర ్త ణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట,్ల ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్,లే దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

ఈ పృ

టాలీవుడ్ P 9




శ్రీ

తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ తెర‌కెక్కిస్తున్న చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`. ఆర్‌. నారాయ‌ణమూ ‌ ర్తి, జ‌య‌సుధ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మాత‌. చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌కత ‌ ్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా లోకేష‌న్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో.... ర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్డు లా తూ ``చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుగారి ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. అస‌లు దేశంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మైన న‌ల్ల‌ధ‌నానికి మూలమేంటి? ఓ సాధార‌ణ హెడ్ కానిస్టేబుట్ కుటుంబం, న‌ల్ల‌ధ‌నం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది, ఎలా విచ్చిన్న‌మైంది. దానికి ఆ హెడ్ కానిస్టేబుల్ ఏం చేశాడ‌నేదే ఈ సినిమా క‌థ‌. మాన‌వీయ విలువ‌లుపై ఆర్ధిక విలువ‌లు ఎలాంటి ఆధిప‌త్యాన్ని క‌న‌పరుస్తున్నాయి. రాజ‌కీయాల‌ను డ‌బ్బు శాసిస్తుంది. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల నుండి ప్ర‌జలు ‌ ర‌క్షించేదెలా అనే సందేశంతో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం`` అన్నారు. ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్డు లా తూ `` బ్లాక్ మ‌నీ వ‌ల్ల దేశ‌మెంతో వెనుక‌బ‌డిపోతుంది. బ్లాక్ మ‌నీ వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయనే దాన్ని సినిమాలో చూపిస్తున్నాం. అలాగే బ్లాక్‌మ‌నీ స‌మ‌స్య‌ను రూపుమాపి ఓ హెడ్ కానిస్టేబుల్ స‌మాజాన్ని ముందుకు ఎలా న‌డిపాడ‌నేదే చూపిస్తున్నాం. 60 రోజుల పాటు సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. డిసెంబ‌ర్ 15లోపు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రిలో సినిమాను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం`` అన్నారు.

చ‌

10 P టాలీవుడ్

చ‌

ద‌ల‌వాడ తిరుప‌తిరావు మాట్లాడుతూ ``మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మా మ‌నిషి. మా సంస్థ‌లో జ‌య‌సుధ చాలా సినిమాలు చేసింది. ఈ మ‌ధ్య‌నే మేం `బిచ్చ‌గాడు` అనే సినిమా చేశాం. ఆసినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఆ స‌క్సెస్‌తో మా బాధ్య‌త మ‌రింత పెరిగింది`` అని చెప్పారు. కార్య‌క్ర‌మంలో టి.ప్ర‌సన్న‌కుమార్‌, డి.ఎస్‌.రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. నీల్ శ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, త‌నికెళ్ల భ‌ర‌ణి, చ‌ల‌ప‌తిరావు, వెన్నెల కిశోర్‌, వై.విజ‌య,‌ స‌మీర్‌, విజ‌య భాస్క‌ర్‌, విజ‌య్‌, పార్వ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: వందేమాత‌రం శ్రీనివాస్‌, డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీ: కె.సుధాక‌ర్ రెడ్డి, ఎడిట‌ర్‌: మోహ‌న రామారావు, నృత్యాలు: శివ‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ఫైట్స్: స‌తీష్ మాస్ట‌ర్‌, స‌మర ‌ ్ప‌ణ:‌ చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు, నిర్మాత:‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావతి ‌ , క‌థ‌, స్క్రీన్‌ప్,లే మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు.

ఈ సు


 2014

లో వచ్చిన కార్తికేయ చిత్రం సూపర్ హిట్ అయ్యింది . నిఖిల్ - స్వాతి జంటగా నటించిన ఆ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు . కాగా చిన్న చిత్రంగా రిలీజ్ అయిన కార్తికేయ ఘనవిజయం సాధించి పెద్ద చిత్రం అయ్యింది . నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా చందు కు దర్శకుడి గా మంచి ప్రారంభాన్ని ఇచ్చింది . మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేయాలనీ భావిస్తున్నారు నిఖిల్ - చందు మొండేటి . ప్రస్తుతం మేమిద్దరం కమిట్ అయిన చిత్రాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి కార్తికేయ సీక్వెల్ పై ద్రుష్టి పెడతామని ట్వీట్ చేసాడు హీరో నిఖిల్ . విభిన్న కథా చిత్రాలు చేస్తూ రేసులో దూసుకు పోతున్న యంగ్ హీరో నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం చేస్తున్నాడు . ఆ చిత్రం వచ్చే నెల రిలీజ్ కానుంది . ఇక ఇటీవలే చందు ప్రేమమ్ తో మంచి సక్సెస్ అందుకున్నాడు . మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి చేసే కార్తికేయ 2 తో మరో సంచలన విజయం అందుకోవడం ఖాయం .

టాలీవుడ్ P 11


 ఉ



భయ గోదావరి జిల్లాల నుండి వచ్చిన సినీ ప్రముఖుల విశేషాలతో రూపొందిన గోదావరి గట్టోళ్ళు..గట్సున్న గొప్పోళ్లు అనే పుసకా ్త న్ని దర్శకరత్న డా.. దాసరి నారాయణరావు ఇటీవల ఆయన స్వగ్రుహంలో ఆవిష్కరించారు. రాజమండ్రీ లో పోలీస్ డిపార్ట్ మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బి.ఎస్. జగదీష్ రచించింన ఈ పుసకా ్త న్ని దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు ఆవిష్కరించి..తొలిప్రతిని ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహరావుకు అందజేసారు. ఈ కార్యక్రమంలో మరో దర్శకనటుడు కాశీ విశ్వనాధ్, దర్శకుడు రాజవన్నెం రెడ్డి, నటుడు సారిక రామచంద్రరావు, రచయిత బిఎస్ జగదీష్ పాల్గోన్నారు.. ఈ సందర్భంగా దర్శక రత్న దాసరి నారాయణ రావు మాట్డు లా తు.. జగదీష్ రావు గుంటూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖుల పై ఇలాంటి పరిశోధనాత్మ రచనలు చెయ్యడం అభినందనీయం.ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇంత మంది దిగజా ్గ లాంటి సినీ ప్రముఖులు చిత్ర పరిశ్రమలో ఉన్నారన్న నిజం ఈ పుసక్త ం చూసాకే తెలిసింది. ఇలాంటి విశేష క్రుషి చేసిన జగదీష్ గారికి ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖుల తరుపున నా క్రుతజ్నతలు..వ్యక్తిగతంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

12 P టాలీవుడ్

పు

సక్త రచయిత జగదీష్ మాట్లాడుతు “నా ఈ చిరు ప్రయత్నాన్ని అభినందిస్తు పుస్తకాన్ని ఆవిష్కరించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి, తొలి ప్రతిని స్వీకరించిన రేలంగి నరసింహారావు గారికి ఇతర సినీ ప్రముఖులకు నా క్రుతజ్నతలు” అన్నారు.


""

శ్రీ

హరిహర ఫిలిమ్స్ పతాకంపై మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వంలో మధు ,అనీష్ ,అభిరాం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''కారులో షికారుకెళితే '' . ఇటీవలే ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ''ఏ '' సర్టిఫికేట్ ఇచ్చారు . కాగా నవంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . సెన్సార్ కార్యక్రమాలు పూర్తికావడంతో దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్డు లా తూ '' సెప్టెంబర్ నెలలో జరిగిన కార్యక్రమం లో కారులో షికారుకెళితే టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసామని దానికి మంచి స్పందన వచ్చిందని అలాగే నవంబర్ మొదటి వారంలో ఆడియో వేడుక నిర్వహించి అదే నెలలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ,ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని తప్పకుండా మా చిత్రం అన్ని వర్ల గా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు . దీరు మహేష్ , 21 f సుదర్శన్ , సురేష్ , ప్రియా , ఇషికా సింగ్ , ప్రియాంక , జీవా , జబరస్ ్ద త్ ఫణి , రాము తదితరులు నటించిన ఈ చిత్రానికి మీనాక్షి భుజంగ్ సంగీతం అందించారు .

టాలీవుడ్ P 13


 

టసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతోన్న చిత్రం కూడా కావ‌డంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు.సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల‌విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ టీజ‌ర్‌ను 2.6 మిలియ‌న్స్ ఆడియెన్స్ వీక్షించారు. ఇప్పుడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి భారీ ఎత్తున్న స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈసంద‌ర్భంగా... చిత్ర నిర్మాతలు ‌ వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - ``నంద‌మూరి బాల‌కృష్ణగా ‌ రు న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చిన

14 P టాలీవుడ్

ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా విడుద‌ల కోసం తెలుగు ప్రేక్ష‌కులు, నంద‌మూరి అభిమానులు జ‌న‌వ‌రి 12, సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కోసం ఎంత ఆస‌క్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి బాల‌కృష్ణ‌గారు న‌టించిన 100వ చిత్రం కావ‌డంతో సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను యు.ఎస్‌., యు.కె. స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా వంద లోకేష‌న్స్‌లో ఒకేసారి విడుల‌య్యేలా ప్లాన్ చేశాం. డిసెంబ‌ర్ మొద‌టివారంలో ఈ వేడుక‌ను గ్రాండ్ లెవ‌ల్లో పలువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో నిర్వ‌హించ‌నున్నాం. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం`` అన్నారు. టసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.


    మె

గాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న `ఖైదీ నంబ‌ర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్‌) సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. బాస్ ఈజ్ బ్యాక్ .. అందుకు త‌గ్గ‌ట్టే బాస్ అస‌లైన లుక్ ఎలా ఉంటుందో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో మ‌రింత పెరిగింది. యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో మెగాస్టార్ స్ట్రెయిట్‌లుక్.. మ్యాన‌రిజ‌మ్స్‌ని ఆవిష్క‌రించే కొత్త‌ స్టిల్స్‌ చూడాల‌న్న ఆస‌క్తిని ఫ్యాన్స్‌ క‌న‌బ‌రిచారు. అందుకే ఈ దీపావ‌ళి కానుక‌గా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ల‌ను నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ లాంచ్ చేశారు. ఈ పోస్ట‌ర్ల‌లో మెగాస్టార్ లుక్ సూపర్భ్ అన్న టాక్ వ‌చ్చింది. త‌న‌దైన స్టైల్లో ష‌ర్ట్ మ‌డత ‌ పెడుతూ బాస్ ఓ స్టిల్లో ‌ గ్యాంగ్‌లీడ‌ర్ని ‌ త‌ల‌పించారు. వేరొక స్టిల్‌లో త‌న‌కు మాత్ర‌మే సాధ్యం అనిపించే డ్యాన్స్ మూవ్‌మెంట్‌ని ఆవిష్క‌రించారు.

సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -``ఖైదీ నంబ‌ర్ 150 .. మెజారిటీ పార్ట్‌ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర పనులు పూర్తి చేస్తున్నాం. త్వ‌రలో ‌ నే పాట‌ల చిత్రీక‌రణ ‌ ‌కు యూనిట్‌ విదేశాలు వెళుతోంది. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌నవ ‌ ‌రిలో సంక్రాంతి కానుక‌గా `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. దీపావ‌ళి కానుక‌గా అభిమానుల ముందుకు కొత్త పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది`` అన్నారు. త్న‌వేలు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట‌త‌రణి ‌ క‌ళాద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ర‌

టాలీవుడ్ P 15


 యం

16 P టాలీవుడ్

గ్ హీరో నాగఅన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటెల్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా ఏంజెల్. రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్ పరిశర ప్రాంతాల్లో తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకుంది. అలానే ఏంజెల్ యూనిట్ అక్టోబర్ 15 నుంచి పాలకొల్లులో శరవేగంగా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ని జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చిత్రీకరణ జరుగుతుండటం పట్ల ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్ ఆనందం వ్యక్తం చేశారు. అక్టోబర్ 30 వరకు షూటింగ్ జరుగుతోందని భువన్ తెలిపారు. ఇక సోషియో ఫాంటసీ అండ్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ముంబైలో ఈ సినిమా పాటల రికార్డింగ్ ని పూర్తి చేశారు భీమ్స్. ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన : శ్రీనివాస్ లంకపల్లి, ఆర్ట్‌: వి.ఎస్. సాయిమణి, స్టంట్స్:‌ రామ్ లక్ష్మణ్, డైలాగ్స్‌: వేంపల్లి రమేశ్ రెడ్డి, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్, సినిమాటోగ్రఫీ: గుణ.


3



రోజుల్లోనే 11 కోట్లు కలెక్ట్‌చేసిన కార్తీ, పివిపిల దీపావళి బ్లాక్‌బస్టర్‌'కాష్మోరా' విపి సినిమా బేనర్‌లో ప్రసాద్‌ వి.పొట్లూరి ఎన్నో భారీ చిత్రాలను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన క్షణం, ద్విభాషా చిత్రంగా రూపొందిన మల్టీస్టారర్‌ ఊపిరి చిత్రాలతో పివిపి సినిమా బేనర్‌కు 2016 సెన్సేషన్‌ ఇయర్‌ అయింది. మళ్ళీ ఇప్పుడు కార్తీ హీరోగా రూపొందిన 'కాష్మోరా' చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన పివిపి మరో బిగ్‌ సక్సెస్‌ను అందుకున్నారు. కార్తీ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా రూపొందిన 'కాష్మోరా' రికార్డ్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. 3 రోజుల్లోనే 11 కోట్లు కలెక్ట్‌చేసి సెన్సేషన్‌క్రియేట్‌చేస్తోంది. వారా, యుగానికి ఒక్కడు, నాపేరు శివ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో మంచి ఇమేజ్‌ని సంపాదించుకున్న కార్తీ.. కింగ్‌నాగార్జునతో కలిసి ద్విభాషా చిత్రంగా చేసిన మల్టీస్టారర్‌ 'ఊపిరి' పెద్ద హిట్‌ అయింది. కార్తీకి తెలుగులో కూడా ఫాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. 'కాష్మోరా'కు వచ్చిన భారీ ఓపెనింగ్సే దానికి నిదర్శనం. ఈ సినిమా కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌సోలో సక్సెస్‌కాబోతోంది. ఫరెంట్‌ క్యారెక్టర్స్తో ‌ ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన నయనతారకు 'కాష్మోరా'లో చేసిన క్యారెక్టర్‌ సినిమాకు మరో హైలైట్‌ అయింది. సినిమాలో ఆమె క్యారెక్టర్‌ కనిపించేది కాసేపే అయినా చాలా పవర్‌ఫుల్‌గా వుంటూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ష్మోరా' సాధించిన బిగ్‌సక్సెస్‌తో నిర్మాత ప్రసాద్‌వి. పొట్లూరి చాలా హ్యాపీగా వున్నారు. ఈ సందర్భంగా

పి

ఆ డి

కా

పివిపి మాట్లాడుతూ - ''మా కాష్మోరా చిత్రం దీపావళి బ్లాక్‌బస్టర్‌గా నిలిచినందుకు చాలా హ్యాపీగా వుంది. చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కార్తీకి, డైరెక్టర్‌గోకుల్‌కి, టోటల్‌టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అన్నారు. ర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి డిఫరెంట్‌ కథాంశాలతో మరిన్ని చిత్రాలు ప్లాన్‌ చేస్తున్నారు. రానా దగ్గుబాటి హీరోగా పివిపి నిర్మిస్తున్న 'ఘాజి' చిత్రం ఫిబ్రవరి 24న విడుదల కాబోతోంది. అలాగే 'ఊపిరి' వంటి సూపర్‌హిట్‌ తర్వాత కింగ్‌ నాగార్జునతో మరో చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు పివిపి. ఓంకార్‌దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'రాజుగారి గది2' చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు పివిపి అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి.

ని

టాలీవుడ్ P 17


టమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పెద్ద తప్పు చేసాడట ! అయితే ఇకపై మాత్రం ఆ తప్పు చేయనని అంటున్నాడు జక్కన్న . ఇంతకీ రాజమౌళి చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా ................. బాహుబలి లో నటించడం . అవును బాహుబలి చిత్రంలో నటించి తప్పు చేసానని ఇకపై ఆ తప్పు ( యాక్టింగ్ ) చేయనని అంటున్నాడు . రాజమౌళి జస్ట్ ఒక్క సీన్ లో కల్లు అమ్మేవాడి గా కనిపిస్తాడు . ''ఇరుక్కు పో హత్తుకొని వీరా వీరా '' అనే పల్లవి గల పాట కి ముందు వచ్చే సన్నివేశంలో రాజమౌళి కుండల వద్ద కనిపిస్తాడు . అయితే అందులో నటించి తప్పు చేసానని ఇకపై ఆ తప్పు చేయనని అంటున్నాడు . అంతేకాదు బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడో అన్నది కూడా పెద్ద టాక్ అయి కూర్చుందని ఆ తప్పు కూడా నాదేనని అంటున్నాడు .

18 P టాలీవుడ్

  


అం

దం , అభినయం ఉన్న అనుష్క ని కెరీర్ తొలినాళ్ళ లో ఎంకరేజ్ చేయకపోగా ,ఆమెకు వస్తున్న అవకాశాలను గండి కొట్టాలని భావించడమే కాకుండా ఆమె కెరీర్ ని సర్వనాశనం చేయాలనీ కంకణం కట్టుకున్నాడట అందుకే ఆమెకు వస్తున్న అవకాశాలను తప్పించడానికి చాలా ప్రయత్నాలే చేసాడట దర్శకులు కరణ్ జోహార్ . అయితే ఆ తర్వాత ఆమె నటనకు ముగ్దుడై అనుష్క శర్మ దగ్గరకు వెళ్లి స్వయంగా క్షమాపణలు కోరాడట కరణ్ . ఇదే విషయాన్నీ స్వయంగా అందరి ముందు ఒప్పుకొని అనుష్క శర్మ విషయంలో చాలా తప్పు చేసానని తప్పు ని ఒప్పుకుంటున్నాడు కరణ్ జోహార్ . అయితే మొదట్లో అనుష్క శర్మ అంటే కోపం , కసి ఉండేవని కానీ ఇప్పుడు మాత్రం అనుష్క అంటే తనకు ఆరాధ్య దేవత అని అంటున్నాడు కరణ్ జోహార్ . మొత్తానికి పగపట్టిన వాడిని తనకు దాసోహం అయ్యేలా చేసిన అనుష్క పెద్ద ఘటికురాలే అన్న మాట .

   


    హా

ట్ భామ అనసూయ బార్ లో ఏం చేసిందో తెలుసా ................ మత్తెక్కించే ఇంటర్వ్యూ ని బార్ లో చేసింది ఈ భామ . సాధారణంగా బార్ లో ఫుల్లుగా మందు తాగడానికి ఉపయోగిస్తారు కానీ ఈ హాట్ భామ మాత్రం అందుకు విరుద్దంగా స్పైసి ఇంటర్వ్యూ నిర్వహించి కాక రేపింది . మందు తాగితే మత్తు ఎక్కుతుంది , కాకపోతే ఇక్కడ మందు తాగకుండానే ఇద్దరు హాట్ భామలను చూస్తూ మత్తెక్కి పోవడం ఖాయం . అయినా ఇంటర్వ్యూ చేయడానికి వేరే ప్లేస్ దొరకనట్లు బార్ లో ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించింది అనసూయ . ఇంతకీ అనసూయ ఇంటర్వ్యూ చేసింది ఎవరినో తెలుసా ............. రకుల్ ప్రీత్ సింగ్ . నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాలంటే సమంత , కాజల్ పేర్లు మాత్రమే వినిపించేవి కానీ ఇప్పుడు హాట్ భామ రకుల్ ఆ ప్లేస్ ని కొట్టేసింది . అనసూయ మస్తీ కోసం ఈ బార్ ఇంటర్వ్యూ చేసింది అనసూయ .








శృం

గార సన్నివేశాల్లో హాలీవుడ్ స్థాయిలో నటించడానికి నాకేమి అభ్యంతరం లేదని , అయినా అలా నటిస్తే తప్పేంటి ? అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది సనా ఖాన్ . కళ్యాణ్ రామ్ కత్తి చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నటించిన ఈ భామకు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు దాంతో అందాల ఆరబోత కు సిద్దపడింది . తాజాగా ''వాహ్ తుం హో '' చిత్రంలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించింది దాంతో సనా ఖాన్ పై విమర్శలు రావడంతో గట్టిగానే సమాధానం చెబుతోంది . హాలీవుడ్ స్థాయిలో అందాలను అరబోయడం మాత్రమే కాదు శృంగార సన్నివేశాల్లో కూడా నటించడానికి నాకు అభ్యంతరం ఏమి లేదు . అవసరమైతే నగ్నంగా నటిస్తా అంటూ రాధికా ఆప్టే ని ఉదాహరిస్తూ చెబుతోంది సనా ఖాన్ . మొత్తానికి హాట్ ఇమేజ్ కోసం బాగానే తహతహ లాడుతోంది ఈ భామ .


    ప్రే

మిస్తే`, `జ‌ర్నీ`, `షాపింగ్‌మాల్‌`, `పిజ్జా`చిత్రాల నిర్మాత సురేస్ కొండేటి స్వీయ స‌మ‌ర్ప‌ణలో ‌ , ఆర్‌4 ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి తెలుగువారికి అందిస్తున్న చిత్రం '' మెట్రో '' . ఆనంద్ కృష్ణ‌న్ ద‌ర్శ‌కత ‌ ్వం తెరకెక్కిన ఈ మెట్రో చిత్రానికి జోహ‌న్ సంగీతం అందించగా సాహితి పాట‌లు, మాట‌లు అందించారు. ఈ సినిమా పాట‌ల రికార్డింగ్ స‌హా అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. న‌వంబ‌ర్‌లో మెట్రో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ‌ సన్నాహాలు చేస్తున్నారు. ట్రో లేటెస్ట్ పోస్ట‌ర్లు, డిజైన్లు సంచ‌ల‌నం సృష్టిస్న్ తు నాయి. చైన్ స్నాచ‌ర్లు ఏమేం చేస్తారో ఆవిష్క‌రిస్తూ .. రూపొందించిన ఈ డిజైన్స్ క్రియేటివ్ స్ట‌ఫ్‌తో ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌హిళ మెడ‌లో చైన్ తెంచేసిన స్నాచ‌ర్‌, చెవి కోసి దుద్దులు ఎత్తుకెళ్లిన దొంగ .. బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వ‌చ్చి చైన్ లాక్కెళ్లిన దొంగ‌.. ఇలాంటివ‌న్నీ మెట్రో సినిమాలో చూడొచ్చ‌ని ఈ పోస్ట‌ర్లు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. చైన్ స్నాచింగ్ పేద‌ల‌ జీవితాల్లో ఎలా నిప్పులు పోస్తుందో కూడా ఈ సినిమాలో చూడొచ్చు. ఆద్యంతం భావోద్వేగాల్ని ట‌చ్ చేసే హ్యూమ‌న్ యాంగిల్ చిత్ర‌మిది. టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించేందుకు ఈ న‌వంబ‌ర్‌లోనే వ‌స్తోంద‌ని నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి తెలిపారు.

మె




...

తె

లుగులో సంచలన విజయం సాధించిన పెళ్లి చూపులు చిత్రం తమిళం లోకి వెళుతోంది . ఇక ఆ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి హక్కులు సొంతం చేసుకున్నది ఎవరో తెలుసా ............ గౌతమ్ వాసుదేవ మీనన్ . ప్రేమ కథా చిత్రాలకు , యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గౌతమ్ మీనన్ పెళ్లి చూపులు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాడని వార్తలు వస్తుండటంతో ఆ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి తమిళ హక్కులు పొందాడట గౌతమ్ మీనన్ . దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్ళిచూపులు చిత్రం తెలుగులో 22 కోట్ల షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది . విజయ్ దేవరకొండ - రీతూ వర్మ జంటగా నటించిన ఈ పెళ్లి చూపులు చిత్రాన్ని రాజ్ కందుకూరి , యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు .

టాలీవుడ్ P 23




తి తక్కువ వయసులోనే ఇంటర్నేషనల్ క్లాసికల్ డ్యాన్సర్ గా విశేష పేరు ప్రఖ్యాతులు పొంది వెడితెర పై కూడా సత్తా చాటాలని భావించి వచ్చిన నటుడు హనీష్ . స్వతహాగా మహమ్మదీయ కుటుంబంలో పుట్టినప్పటికీ కూచిపూడి పై ఉన్న మక్కువతో కఠోర శ్రమతో కూచిపూడి నేర్చుకొని దేశ విదేశాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి యావత్ తెలుగు జాతిని సంబ్రమాశ్చర్యాలకు గురి చేసాడు . ఇంట్లో వాళ్ళకు తెలియకుండానే కూచిపూడి ని నేర్చుకున్న హనీష్ ప్రతిభా పాటవాలు ఏంటో ఒక్కసారిగా టివిలో చూసి తెలుసుకొని ఆశ్చర్య పోయారు హనీష్ తల్లిదండ్రులు . కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చే హనీష్ కు వెండితెర పై ఆకర్షణ ఏర్పడింది ఆ ఆకర్షణే ''ఆమె ..... అతడైతే '' చిత్రంలో నటించడానికి పురి కోల్పింది . ఇటీవల రిలీజ్ అయిన ఆమె అతడైతే ఆడియో కు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో హీరో హనీష్ మీడియాతో ముచ్చటించారు . సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం మారుతి ప్రసాద్ , ఎన్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆమె అతడైతే చిత్రంలో హీరోగా నటిస్తూ కథానుసారం లేడి గెటప్ కూడా వేసి మెప్పించానని , అయితే లేడి గెటప్ వేయడం నాకు కొత్తేమి కాదని , స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్ నైనందున చేయగలిగానని అయితే సినిమా వేరు డ్యాన్స్ ప్రోగ్రాం వేరు అన్న విషయం సినిమా చేసాక కానీ తెలియలేదు . లేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో తండ్రి ఆశయ సాధన కోసం తనయుడు ఏం చేసాడన్నదే

కే

వి

24 P టాలీవుడ్



మా ఆమె అతడైతే చిత్ర కథ , చాలా ఫన్నీ గా ఉంటుంది ...... అబ్బాయి అమ్మాయిగా మారడానికి ఎలాంటి పరిస్థితులు సంభవించాయి ....... తన లక్ష్యాన్ని ఆ అబ్బాయి ఎలా చేరుకున్నాడు అన్నది వినోదాత్మకంగా తెరకెక్కించారని తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు . కపై హీరోల పాత్రలే కాకుండా నాకు నచ్చిన పాత్రలు వస్తే చేయడానికి నేను సిద్దమేనని , మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని ఇక ఈ పాత్ర నాకు రావడానికి కారణం 2012 లో రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన ''నువ్విలా '' అనే చిత్రం కారణమని ఆ చిత్రంలో గే పాత్ర పోషించానని తెలిపాడు హనీష్ . జేంద్రప్రసాద్ పోషించిన మేడం , నరేష్ చిత్రం భళారే విచిత్రం ల తర్వాత నాకు ఇంతటి మంచి అవకాశం లభించిందని వాళ్ళ స్పూర్తితో ఈ సినిమా చేసానని అలాగే పూర్తిగా సంగీత ప్రాధాన్యం ఉన్న సాగర సంగమం , స్వర్ణ కమలం లాంటి చిత్రాలను చేయాలని ఉందని , అలాంటి గొప్ప అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నాడు హనీష్ .

రా


రా

 



కింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `ఒక్క‌డు మిగిలాడు`. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుదలైంది. ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌నోజ్ ఎల్‌.టి.టి.ఇ. నాయ‌కుడు ప్ర‌భాక‌ర‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నాడు. అజ‌య్ అండ్ర్యూస్ నౌతాక్కి ద‌ర్శ‌కత్వంలో ఎస్‌.ఎన్‌.రెడ్డి, ల‌క్ష్మీకాంత్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు ఎస్‌.ఎన్‌.రెడ్డి, ల‌క్ష్మీకాంత్ మాట్డు లా తూ - ```ఒక్క‌డు మిగిలాడు` చిత్రంలో వేలుపిళ్ళై ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో మంచు మ‌నోజ్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశాం. ఈ చిత్రం శ్రీలంక‌లోని 15 ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థులు కోసం 1990లో జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో సాగుతుంది. మంచు మ‌నోజ్‌గారు చాలా బాగా కో ఆప‌రేట్ చేశారు. ప్ర‌భాక‌ర‌న్



గెట‌ప్‌కోసం వెయిట్ కూడా పెరిగాడు. వైజాగ్ ద‌గ్గ‌ర‌లోని ప‌ర‌వాడ ప్రాంతంలో యుద్ధ స‌న్నివేశాల‌ను 25 రోజుల పాటు చిత్రీక‌రించాం. మ‌నోజ్ ఇనెట‌న్స్తో ‌ కూడిన యాక్ష‌న్‌, డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి. ఈ సినిమా మ‌నోజ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుంది`` అన్నారు. న‌ర్ః ఎస్‌.ఎన్‌.ఆర్‌.ఫిలింస్ ఇండియా ప్రై.లి., న్యూ ఎంపైర్ సెల్యూలాయిడ్స్,‌ ఆర్ట్ః పి.ఎస్‌.వ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః వి.కె.రామ‌రాజు, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, స్క్రీన్ ప్లేః గోపీ మోహ‌న్‌, మ్యూజిక్ః శివ నందిగామ‌, నిర్మాతః ఎస్‌.ఎన్‌.రెడ్డి, ల‌క్ష్మీకాంత్‌, ద‌ర్శ‌క‌త్వంః అజ‌య్ అండ్ర్యూస్ నౌతాక్కి.

బ్యా

టాలీవుడ్ P 25








సా

యిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం విన్నర్. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, బేబి భ‌వ్య సమర్పణలో... న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శక‌ ‌త్వం వ‌హిస్తున్నారు. ర్శ‌కుడు మాట్లాడుతూ ``త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా. `విన్న‌ర్` అనే టైటిల్ చ‌క్క‌గా స‌రిపోతుంద‌ని పెట్టాం. నవంబర్ 2 నుంచి ఉక్రెయిన్ లో మూడు పాటలు చిత్రీకరించబోతున్నాం. సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ మీద చిత్రీకరించబోయే ఈ పాటలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. ఆ తర్వాత ఇస్తాంబుల్ లో యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తాం. దీంతో పాటు అనసూయ మీద ఓ స్పెషల్ సాంగ్, కొన్ని సీన్స్ కూడా ప్లాన్ చేశాం. త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిస్తున్నారు. ఐదు పాట‌లు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన ర‌చ‌న ఆక‌ట్టుకుంటుంది.

ద‌

26 P టాలీవుడ్

సా

వెలిగొండ శ్రీనివాస్ మంచి క‌థ‌నిచ్చారు `` అని అన్నారు. యిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు ఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా.కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్‌పూడి, ఆర్ట్: ప్ర‌కాష్‌, ఫైట్స్: ర‌వివ‌ర్మ‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌, ర‌చ‌న‌: అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని.




 త

మిళ స్టార్ హీరో సూర్య సింగం 3 షూటింగ్ ని కంప్లీట్ చేసాడు . హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సింగం , యముడు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో సింగం 3 చేస్తున్నారు . ఇక అనుష్క వరుసగా మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించడం విశేషం . అయితే మరో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది . మొదటి రెండు పార్ట్ లకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సింగం 3 చిత్రానికి హరీష్ జై రాజ్ సంగీతం అందిస్తున్నాడు . సూర్య - హరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 16 న తెలుగు , తమిళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు .

టాలీవుడ్ P 27


  ప

వన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సమంత తాజాగా మరోసారి పవన్ తో నటించడానికి సిద్దమైంది అన్న వార్త వచ్చింది అయితే అదంతా అబద్దమని , తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను తప్ప తెలుగులో ఏ చిత్రంలో కూడా నటించడం లేదని ,ఒప్పుకోలేదని ట్వీట్ చేసింది సమంత . నవంబర్ 5న పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ల సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో సమంత నటించడం లేదట .మరి సమంత హీరోయిన్ కాకపోతే ఎవరిని తీసుకోనున్నారో పవన్ చిత్రంలో. గచైతన్య తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సమంత చైతన్య లేకుండా బ్రతకలేనని కూడా చెబుతోంది . చైతన్య తో పాటు ఐస్ క్రీం అంటే కూడా చాలా ఇష్టమని అంటోంది సమంత.

నా

28 P టాలీవుడ్






నె

ల్లూరు లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన సమయంలో అక్కడి యువత ఒక్కసారిగా గుంపు గా వచ్చి కాజల్ మీద పడిపోయారట దాంతో కాజల్ ని నెల్లూరు పోలీసులు యువకులను పక్కకు తప్పించి కాజల్ ని లోపలకు తీసుకెళ్ళి పోయారట . ఇటీవలే జనతా గారేజ్ చిత్రంలో పక్కా లోకల్ ..... నేను పక్కా లోకల్ అంటూ ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్ చేసి కుర్రకారు ని రెచ్చగొట్టిన ఈ భామ తాజాగా ఎంతవరకు ప్రేమంటే అనే డబ్బింగ్ చిత్రం తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సన్నద్ధం అవుతోంది. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క యాడ్స్ కూడా చేస్తూ ఇలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు వెళుతూ రెండు చేతులా సంపాదిస్తోంది కాజల్ అగర్వాల్.

టాలీవుడ్ P 29




 ఎ

న్టీఆర్ వివివినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అదుర్స్ . ఎన్టీఆర్ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసాడు ఆ సినిమాతో . వినాయక్ దర్శకత్వం, ఎన్టీఆర్ నటన వెరసి సూపర్ హిట్ ఐన ఆ చిత్రానికి సీక్వెళ్ చేయాలనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు . కానీ అది ఎప్పటి కప్పుడు వాయిదా పడుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం వాయిదా పడే అవకాశం లేదంట ఎందుకంటె చిరంజీవి తో 150వ చిత్రం పూర్తిచేసిన తర్వాత ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేయడం ఖాయమని అంటున్నారు . ఇక అదుర్స్ 2 వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం.

30 P టాలీవుడ్


‌ ంలో ఎన్నో విజ‌యవ త ‌ ంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన అనురాధ ఫిలింస్ డివిజ‌న్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `రోజ్ గార్డెన్‌`. ప్ర‌స్తుతం ఈ చిత్రంతో కాశ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం భార‌త్‌, పాకిస్థాన్ల ‌ మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం క‌లిగి ఉంది. కాశ్మీర్‌లో అడుగుపెట్ట‌డానికే భ‌యం నెల‌కొన్న స‌మ‌యంలో ధైర్యంగా, సాహ‌సంగా ఈ చిత్రం పూర్తిగా కాశ్మీర్‌లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవ‌టం విశేషం. చిత్రం గురించి దర్శ‌కుడు జి.ర‌వికుమార్‌(బాంబే ర‌వి) మాట్లాడుతూ - ``కాశ్మీర్ మొత్తం అల్ల‌క‌ల్లోలంగా ఉన్న స‌మయ ‌ ంలో నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుగారు మాత్ర‌మే సాహ‌సంతో ఈ చిత్రాన్ని కాశ్మీర్‌లో నిర్మిస్తుండ‌టం విశేషం. అలాగే కాశ్మీర్ ప్ర‌భుత్వంతో నిర్మాత‌ల‌కు ఉన్న అనుబంధం కార‌ణంతో దాదాపు 120 మంది యూనిట్ స‌భ్యుల‌తో షూటింగ్ చేస్తున్నాం. కాశ్మీర్ ప్ర‌భుత్వం స‌హకా ‌ రంతో ప్ర‌భుత్వం అందిస్తున్న‌ భారీ భ‌ద్ర‌త మ‌ధ్య స‌హకారంతో ఏ టెన్ష‌న్ లేకుండా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ చిత్రీక‌ర‌ణలో ‌ సైన్యానికి చెందిన ఆయుధాల‌నే ఉప‌యోగిస్తున్నాం``అన్నారు. త్ర స‌మ‌ర్ప‌కులు చ‌ద‌లవా ‌ డ తిరుప‌తిరావు మాట్లాడుతూ ``ఇప్ప‌టికి 15 రోజుల నుండి కాశ్మీర్‌లో షూటింగ్ చేస్తున్నాం. మ‌రో 40 రోజ‌లు పాటు

చి

    ఇక్క‌డే షూటింగ్ ఉంటుంది. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. ల‌వ్ అండ్ మ్యూజికల్ మూవీ. ఓ ప్రేమ జంట టెర్ర‌రిస్టుల కార‌ణంగా ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొందనే పాయింట్‌ను కొత్త‌గా ఉంటుంది. ఇలాంటి క‌థ‌కు మంచి మ్యూజిక్ ఉండాల‌నే ఉద్దేశంతో ఆరు పాట‌ల్ని ముంబాయిలో భారీ ఎత్తున రికార్డ్ చేశాం. ప్ర‌ముఖ గాయ‌కులు ఉదిత్ నారాయ‌ణ్‌, జావేద్ అలీ, సాధ‌నా స‌ర్గ‌మ్‌, ఫ‌ల‌క్ ముచ్చ‌ల్‌, స్వ‌రూప్ ఖాన్ త‌దిత‌రుల‌తో పాట‌ల‌ను పాడించాం. ఈ సినిమాలో ముఖ్య‌మైన ప్రేమ గీతాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం.ర‌త్నం రాయ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు. నాలుగు పాట‌ల‌తో స‌హా సినిమా 80 శాతం చిత్రీక‌రణ ‌ ‌ను కాశ్మీర్‌లో పూర్తి చేస్తాం. డిల్లీలో న‌వంబ‌ర్ 1నుండి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. మిగిలిన పోర్ష‌న్ అంతా హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తాం సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. తిన్ నాష్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రంలో ముంబాయికి చెందిన ఫ‌ర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. పోసాని కృష్ణ‌ముర‌ళి, ధ‌న‌రాజ్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, త‌మిళ‌న‌టుడు త్యాగ‌రాజ‌న్‌, గౌతంరాజు, ర‌జిత త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః కె.శంక‌ర్‌, ఫైట్స్ః టినువ‌ర్మ‌, నందు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంగీతం, ద‌ర్శ‌కత ‌ ్వంః జి.ర‌వికుమార్‌(బాంబే ర‌వి).

ని

టాలీవుడ్ P 31


 

నా

ని హీరోగా నటించిన నేను లోకల్ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ చేసారు. దీపావళి పండుగ సందర్భంగా నాని కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు . నక్కిన త్రినాద్ రావు దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దిల్ రాజు . నాని వరుసగా విజయాలు సాధిస్తున్నాడు . ఇప్పటికే వరుసగా 5సినిమాల హిట్ తో మంచి జోష్ మీదున్నాడు నాని. ఇక నేను లోకల్ ఫస్ట్ లుక్ మాంచి మాస్ అప్పీల్ కనిపిస్తోంది . నిజంగానే లోకల్ అనిపిస్తూన్నాడు నాని.

32 P టాలీవుడ్


 జ నతాగ్యారేజ్' తో టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న మోహన్ లాల్ మరోసారి తెలుగు ప్రేక్షకు ల్ని పలకరించబోతున్నాడు. మల్లూ వుడ్ లో కలెక్షన్ల మోత మోగించిన మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'పు లిమురుగన్'చిత్రాన్ని తెలుగులో 'మన్యం పులి' పేరిట విడుదల చేసేం దుకు ప్రముఖ నిర్మాత సింధూరపువ్ వు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్ తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి కే 'మన్యం పులి' సినిమాకి సంబం ధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ముగిశాయి. పాటల రికార్డింగ్ కూ డా పూర్తి అయిందని చిత్ర సంగీత దర్శకుడు గోపీ సుందర్ తెలిపారు. ఇక సౌత్ ఇండియా నుంచి 'బాహుబలి' తరువాత మళ్లీ అంతే రేంజ్ లో సక్సెస్ అందుకున్న సినిమాగా మళయాల సీమలో 'మన్యం పులి' సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నేపథ్యంలో 'జనతా గ్యారేజ్' సి నిమాతో మోహన్ లాల్ కి తెలుగునాట ఫుల్ క్రేజ్ రావడంతో, అదే... ఊపులో 'మన్యంపులి' సైతం భారీ వి జయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా నవంబర్ లో 'పులి మురుగన్' తెలుగు వెర్ షన్ 'మన్యం పులి' ని విడుదల చేయ బోతున్నట్లు నిర్మాత కృష్ణా రె డ్డి తెలిపారు. దాదాపు రెండు సం వత్సరాలు పాటుఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చి త్రీకరించారు. పీటర్ హేన్స్ కం పోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మె యిన్ హైలెట్ గా నిలుస్తాయని, చి త్ర బృందం తెలిపింది. జగపతి బా బు, కమలినీ ముఖర్జీ కీలకపాత్రల్ లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్ శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ ణ, సంగీతం : గోపీ సుందర్, కెమె రా : షాజీ కుమార్.

టాలీవుడ్ P 33


34 P టాలీవుడ్




ను

వ్వులేక నేను లేను', 'తొలిచూపులోనే' చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్‌ చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వై.కాశీవిశ్వనాధ్‌ 'నచ్చావులే'తో ఆర్టిస్టుగా టర్న్‌ తీసుకుని వరుసగా సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయి అనతి కాలంలోనే వంద సినిమాలను పూర్తిచేశారు. హరీష్‌ హీరోగా, అవంతిక హీరోయిన్‌గా ఆర్‌జె సినిమాస్‌ పతాకంపై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత బి.ఎ. రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రంలో కాశీవిశ్వనాధ్‌ హీరోయిన్‌ఫాదర్‌గా యాక్ట్‌చేస్తున్నారు. ఈ చిత్రంతో వంద చిత్రాలను పూర్తి చేయడం విశేషం. ఈ సందర్భంగా అక్టోబర్‌ 27న హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో వై.కాశీ విశ్వనాధ్‌ ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.

దర్శక దేవుళ్లందరికీ నా కృతజ్ఞతలు!!

టుడు వై.కాశీవిశ్వనాధ్‌ మాట్లాడుతూ - ''ఇంతవరకు నేను రెండు సినిమాలు డైరెక్ట్‌ చేశాను. అయినా వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ప్రెస్‌మీట్‌ పెట్టలేదు. ఇటీవల ప్రెస్‌మీట్‌ పెట్టడానికి ఓ ప్రత్యేకత ఉంది. అది 'వైశాఖం' సినిమాతో నటుడుగా వంద సినిమాలను పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక మ్యాగజైన్‌ పెట్టినపుడు అది సక్సెస్‌ అయి క్లిక్‌ అయితే పాఠక దేవుళ్లకి కృతజ్ఞతలు చెబుతాం. ఒక సినిమా వంద రోజులు ఆడి సూపర్‌హిట్‌ అయితే దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతారు. అదే ఒక నటుడు వంద సినిమాలు కంప్లీట్‌ చేస్తే దర్శకులందరికీ కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాను. ఫస్ట్‌ సినిమా 'నచ్చావులే', 50వ సినిమా 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', వందవ సినిమా 'వైశాఖం'. ఈ

జర్నీలో నాకు సహకరించి ఎంకరేజ్‌ చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రెండు సినిమాలు డైరెక్ట్‌ చేసి మూడవ సినిమా ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా రవిబాబు ఇంట్లో నార్మల్‌ ఫాదర్‌గా ఉన్న నన్ను 'నచ్చావులే' చిత్రంలో నేచురల్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌ చేయించి నాకు గాడ్‌ఫాదర్‌ అయ్యారు రవిబాబు. ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే రామోజీరావుగారికి, 'నచ్చావులే' చిత్రంలో నన్ను ప్రొజెక్ట్‌ చేసి నాకు సహకరించిన టీం అందరికీ ధన్యవాదాలు. ఈ వంద సినిమాల్లో చిన్న దర్శకులు, పెద్ద దర్శకులు అనే తేడాలేకుండా నాతో సినిమాలు తీసిన డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌, రైటర్స్‌, కెమెరామెన్స్‌ అందరూ నాకు అవకాశం ఇవ్వబట్టే కేవలం 6, 7 సంవత్సరాల్లో వంద సినిమాలు పూర్తి చేయగలిగాను. ఇది నేను గొప్పగా చెప్పడం లేదు. స్టేజ్‌ ఎక్స్‌పీరియన్స్,‌ బ్యాగ్రౌండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ లేకపోయినా నటుడుగా వంద సినిమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన నా సహ నటీనటులు, 24 క్రాఫ్ట్స్‌ఎంతో మందికి రుణపడి ఉంటాను. డైరెక్టర్స్‌ నుండి యాక్టర్స్గా ‌ టర్న్‌ అయిన వారు వేళ్లమీద ఉన్నారు. వారంతా చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు. వాళ్లందరి సరసన నేను కూడా చేరగలిగాను. నన్ను బాగా ఎంకరేజ్‌ చేసిన దర్శకరత్న డా|| దాసరిగారు, రవిబాబు, శ్రీను వైట్ల, కొరటాల శివ, దశరధ్‌, శ్రీవాస్‌, వీరు పోట్ల, పరుచూరి మురళి, గోపీచంద్‌ మలినేని, జయంత్‌, బాబీ, ఎంఎస్‌ రాజు, తేజ, మారుతి, జయగారు, నందినిరెడ్డి, మధుర శ్రీధర్‌, త్రినాధరావు నక్కిన, సంతోష్‌ శ్రీనివాస్‌, అనిల్‌ రావిపూడి, చిన్నికృష్ణ, వీరభద్రం, కరుణాకరన్‌, ఇంకా ఎంతో మంది దర్శకులు మంచి మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చి ప్రోత్సహించారు. అంతేకాకుండా వారంతా నా ఉన్నత స్ధితికి కారణం అయ్యారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు.

టాలీవుడ్ P 35




ప్పటికే మూడు బ్లాక్ బస్టర్ లతో సంచలనం సృష్టించిన దర్శకులు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని మళ్ళీ మహేష్ బాబు తో కలిసి చేయడానికి రెడీ అవుతున్నాడు కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయడానికి సమాయత్తం అవుతున్నాడట కొరటాల శివ . సందేశాత్మక చిత్రాలను రూపొందించే కొరటాల పవన్ కళ్యాణ్ తో కనుక సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలు కొట్టే

సినిమా రావడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్ . అలాగే ఈ ఇద్దరి కాంబినేషన్ లో త్వరగా సినిమా రావాలని ఆశపడుతున్నారు కూడా . ఇక పవన్ కూడా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా సినిమాలు చేసి 2019 ఎన్నికల ప్రచారం పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు . ఆలోపున పవన్ - కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉంది . ఇక ఆ సినిమా వస్తే బాక్స్ లు బద్దలు కావడం ఖాయమే కదా !

         

కు

36 P టాలీవుడ్

ర్ర హీరో నాగశౌర్య కొత్త కారు కొన్నాడు. ఇటీవలే జ్యో అచ్యుతానంద చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ హీరో తాజాగా బిఎండబ్ల్యు కారు కొన్నాడు . కొత్త కారు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తన కారు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు . సక్సెస్ మాట ఎలా ఉన్నప్పటికీ నాగ శౌర్య వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలాగే వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మాస్ హీరోగా సక్సెస్ కావాలని ఆశ పడ్డాడు కానీ పాపం ఫలితం దక్కలేదు దాంతో తనకు ఆచ్ఛి వచ్చిన చిత్రాలనే చేస్తున్నాడు నాగ శౌర్య.




   

ర్ధార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తోన్నచిత్రం 'కాటమరాయుడు ' .ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ప్రారంభమైనా.. కొన్ని మార్పుల వల్ల ఆలస్యంగా సెట్స్ పైకి వచ్చినా... బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది.మొదట ఈ సినిమాను ఫిబ్రవరి లోపు షూటింగ్ పూర్తి చేసి వేసవిలో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్భావించింది..షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం అవటం వల్ల డేట్ ఏమైనా మారొచ్చని అంతా అనుకున్నారు.. కానీ చిత్రయూనిట్ ముందుగా ప్రకటించినట్టుగానే ఉగాది కానుకగా మార్చి 29 న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.ఈ సినిమాలో పవన్ సరసన శృతీహాసన్ నటిస్తోంది..ఈ సినిమా పూర్తి అవ్వగానే పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లోని సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది..

టాలీవుడ్ P 37


 అం

దాల తార ఐశ్వర్యరాయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు బీ టౌన్ లో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది..ఐశ్వర్య తాజాగా రణ్‌బీర్ కపూర్‌ సరసన ‘ఏ దిల్ హై ముష్కిల్’ లో నటించింది..ఈ సినిమాలో ఐష్ , రణ్‌బీర్ తో చేసిన రోమాన్స్ సన్నివేశాల్లో శృతిమించి ఎక్సపోజింగ్ చేసిందని భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కోటుంది...లేటు వయసులోను ఐష్ స్క్రీన్ రోమాన్స్ చేస్తూ రెచ్చపోవడం చూసి బీటౌన్ జనాలు ఆశ్చర్యానికి గురి అవుతుంటే..మరో వైపు బిగ్ బీ కుటుంబంలో చిచ్చు పెట్టిందన్న వార్తలు చక్కర్లు గోడుతున్నాయి..ఈ నేపధ్యంలో ఐశ్వర్య నోరు విప్పక తప్పలేదు..తన పై వస్తున్న రూమర్లకు ఘాటుగానే సమాధానం ఇచ్చింది..శృంగారమంటే నాన్సెన్స్ కాదని,శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు పూర్తి స్పృహాలో ఉంటామని చెప్పుకొచ్చింది..అంతేకాదు కథా అనుగుణంగానే నటిస్తామని ..అవేవి తెలుసుకోకుండా కామెంట్స్ చేయడం సరైంది కాదని జవాబు ఇచ్చింది.ఈ వాఖ్యలు తన అత్త జయబచ్చన్ కు కౌంటర్ గా ఇచ్చిందా..లేకా మాములుగా చేసిందా అని మరో చర్చ మొదలు పెట్టారు బాలీవుడ్ జనాలు...

టాలీవుడ్ P 38


 

మో

డల్ కం యాక్ట్రెస్ ఊర్వశి రౌతేలా తాజాగా చేసిన ఫోటో షూట్ తో పిచ్చి లేపుతోంది . క్లీవేజ్ షోతో రెండు గుండెలను ఆల్మోస్ట్ చూపిస్తూ , నగ్న తొడలతో కుర్రకారు కి నిద్ర లేకుండా చేస్తోంది . వెండితెర పై రెచ్చిపోవాలంటే ఎంత తక్కువ బట్టలు వేసుకొని అందాలను చూపిస్తే అంత తొందరగా లైం లైట్ లోకి రావచ్చని ఈజీగా కనిపెట్టేసింది ఈ భామ అందుకే రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది . బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా సత్తా చాటాలని భావిస్తున్న ఈ భామ అందుకు వేదికగా హృతిక్ రోషన్ సినిమాని ఎంచుకుంది . మరో విశేషం ఏంటంటే హృతిక్ రోషన్ తో ఊర్వశి రౌతేలా నటించిన కాబిల్ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కానుంది . ఫోటో షూట్ తో నిద్రలేని రాత్రులను యూత్ కి కానుకగా ఇస్తున్న ఈ భామ మరింత హాట్ ఇమేజ్ కోరుకుంటోంది .





Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.