Tollywood Telugu Magazine July 2021

Page 1

TOLLYWOOD.NET JULY 2021 | VOL 18 | ISSUE 07 | Rs.20/-

ముఖ్య కథనాలు

p















RNI NO: APTEL/2003/10076



/tollywood

/tollywood



NEWS HAPPENINGS

“WHAT LIES BEHIND YOU AND WHAT LIES IN FRONT OF YOU, PALES IN COMPARISON TO WHAT LIES INSIDE OF YOU.”

LIFE style

Murali Mohan Ravi

HOT SPICY

Credits: Editor in Chief CEO VP Sales and Marketing Associate Editor Telugu Content Writer Graphic & Web Designer/Developer Publication Consultant

: : : : : : :

CHIT CHAT

Murali Mohan Ravi Siva Dosakayala Sanathan Prathama Singh Vihari Moulali Deshamoni Raghurama Raju Kalidindi

PA

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS

FOR ADVERTISEMENT ENQUIRES CALL : +91 7702 555 873

LOCAT ON

Follow Us On :

fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE

wanna be featured

Email: editor@tollywoodmag.com I www.tollywood.net

in

Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JULY 2021

 స్టార్



హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో పెద్ద బ్రేక్ వచ్చింది. కరోనా వైరస్ కారణంగా 2020లో స్టార్ట్ అయిన విజయ్ నెక్స్ట్ సినిమా లైగర్ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెల్సిందే. సాధారణంగా పూరి జగన్నాథ్ 5 లేదా 6 నెలల్లో షూటింగ్ ను పూర్తి చేసేస్తాడు. కానీ లైగర్ విషయంలోనే

లెక్క తప్పింది. లైగర్ ఇంకా మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాకు వెళ్ళడానికి చూస్తున్నాడు. అందుకోసమే లైగర్ విషయంలో టార్గెట్ ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల లోపు లైగర్ షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని పూరి వద్ద

send your details and portfolio to

subscription 1 year (12 issues) : Rs 200

2 Year ( 24 issues) : Rs 400

Name:_______________________________________________________________________ Address: _____________________________________________________________________ ____________________________________________________________________________ City: ____________________________ Pin:________________________________________ Phone Number: ___________________Email Id:_____________________________________ Please find enclosed cheque/dd no: _________________________ Date: ________________ IN FAVOUR OF : VIBHU MEDIA PVT LTD Mailing Address: #8-3-833/A, Flat No.105, Ground Floor, B Block, Usha Enclave, Srinagar Colony, Hyderabad - 500073. Contact: +91 7702555873 Terms & Conditions 1. Rates are valid for Hyderabad only. For delivery to other parts of Telangana add Rs 40 per 12 issues, Rs 80 for 24 issues. 2. Vibhu Media PVT LTD is not responsible for postal delays or delivery failures. 3. Subscriptions are not refundable. 4. All disputes are subject to the exclusive jurisdiction of competent courts in Hyderabad only.

editor@tollywoodmag.com ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ను సంప్రదించారు. అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

QUIZ



COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE





LittleStar

హీ

రోయిన్ నిధి అగర్వాల్ తన పేరుకి తగ ్గట్ గా లు నే ఎప్పటికప్పుడు తన నిధులను ప్రేక్షకులకు ఎర వేసి మైమరిపిస ుం ్త టుంది. ఇస్మార్ ట్ శంకర్ సినిమాతో క్రేజ్ అందుకున్న నిధి అగర్వాల్ ఆ తర్వాత నుండి ఆసక్తికర ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. తన కెరీర్ లో ఎప్పుడూ గ్లామరస్ గా కనిపించడానికి వెనక్కి తగ ్గదు నిధి. అలాగే సోషల్ మీడియాలో కూడా నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్ చేస ుం ్త టుంది. రీసెంట్ గా నిధి పోస్ ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. లో నేక్ ఆరెంజ్ అవుట్ ఫిట్ తో నిధి తన క్లివేజ్ తో పాటు సెడ్యూసింగ్ లుక్స్ తో నెటిజన్స్ ను వలలో వేసుకుంటోంది. ఈ ఫోటోషూట్ కు భారీగా రెస్పాన్స్ వస ోం ్త ది. ఇక సినిమాల విషయానికి వస్ తే పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీర మల్ లు చిత్రంలో నటిస్తోన్న నిధి, అశోక్ గల్లా డెబ్యూ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస ోం ్త ది. JULY, 2021 b టాలీవుడ్ z 3



FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

 



 సుధీర్ బాబు సడెన్ గా తన కెరీర్ లో

గేర్లు మార్చేశాడు. ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తోన్న సుధీర్ ఇప్పుడు మరో చిత్రాన్ని ఓకే చేసాడు. శ్రీదేవి సోడా సెంటర్ వంటి మాస్ చిత్రాన్ని చేస్తోన్న సుధీర్ బాబు దానికి పూర్తి భిన్నంగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో సినిమాను కూడా ప్రకటించాడు సుధీర్ బాబు. నటుడు కమ్

రచయిత హర్షవర్ధన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మించింది. లక్ష్య నిర్మాణ దశలో ఉంది. అలాగే ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమాను కూడా నిర్మించాల్సి ఉంది. మరోవైపు హర్షవర్ధన్ ఇష్క్ వంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసాడు.





ఉస్తాద్ రామ్ పోతినేని తన తర్వాతి

చిత్రాన్ని మొదలుపెడుతున్నాడు. ఈ ఏడాది రెడ్ సినిమాను విడుదల చేసిన రామ్ తన నెక్స్ట్ సినిమాను ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించాడు. తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మొదలైంది. ఇటీవల నుండి షూటింగ్ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కిస్తున్నారు. రామ్ సరసన కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్

గా నటిస్తోంది. ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న కృతికి వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లో జరగనుంది. ఈ చిత్రానికి ఉస్తాద్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.

  మాస్

మహారాజా రవితేజ స్పీడ్ మాములుగా లేదు. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఆ తర్వాత జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసాడు. ఇక ప్రస్తుతం శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. దాంతో పాటు సినిమా టైటిల్ ను కూడా

రివీల్ చేసారు. ఈ సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసారు. రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు. దివ్యంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. JULY, 2021 b టాలీవుడ్ z 5



NEWS HAPPENINGS





LIFE style

మె

గా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో కూడా రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆచార్యలో స్టూడెంట్ లీడర్ రోల్ పాత్రను పోషిస్తున్నాడు. సిద్ధగా కనిపించనున్న చరణ్ ఇటీవల మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ రెండు పాటలు తప్ప చిత్రీకరణ మొత్తం పూర్తయింది.

HOT SPICY CHIT CHAT PA



RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON

  వె

fash on

2

TICKET TOLLYWOOD sex psychology

ఈ నేపథ్యంలో ఆచార్య షూటింగ్ కు మళ్ళీ డేట్స్ ఇచ్చాడు. చిరంజీవి పాత్రకు శిష్యుడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు రామ్ చరణ్. ఈ షెడ్యూల్ తో తన పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని సమాచారం. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఆచార్య చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ర్సటైల్ దర్శకుడు మణిరత్నం అటు తమిళ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో కూడా తగినంత పేరు సంపాదించుకున్నాడు. తన సినిమాలతో ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగించే మణిరత్నం లేటెస్ట్ గా నవరస అనే వెబ్ సిరీస్ ను నిర్మించాడు. తమిళ్ లో 9 మంది దర్శకులు 9 కథలను డైరెక్ట్ చేసారు. రీసెంట్ గా ఈ నవరస వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే మణిరత్నం తనకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పనిచేయాలన్న

ఆసక్తిని బయటపెట్టాడు. కొన్నేళ్ల క్రితం మణిరత్నంతో మహేష్ బాబు పనిచేస్తాడన్న ప్రచారం జరిగింది. అప్పట్లో హైదరాబాద్ కూడా వచ్చాడు. అయితే ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు. మణిరత్నం ఈ విషయంపై స్పందించాడు. “మహేష్ తో పనిచేయాల్సి ఉంది. గతంలో ప్రయత్నించా కానీ వర్కౌట్ అవ్వలేదు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే కచ్చితంగా తనతో పనిచేయాలని ఉంది” అని మణిరత్నం సెలవిచ్చాడు. సినిమాల పరంగా పొన్నియన్ సెల్వన్ డైరెక్ట్ చేస్తున్నాడు మహేష్.

top N GHT Life trade GUIDE CHOICE My 

 QUIZ

COMPETET ON రె

బెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ గత మూడేళ్ళుగా ప్రొడక్షన్ లో ఉంది. సాధారణంగానే స్లో గా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమా కరోనా పాండెమిక్ కారణంగా రెండు సార్లు వాయిదా పడింది. ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో సాంగ్ ను షూట్ చేస్తే పూర్తవుతుంది. మరి కొద్ది రోజుల్లో ఆ సాంగ్ ను షూట్ చేస్తారు. ఇదిలా ఉంటే రాధే శ్యామ్ ఎప్పుడు

d ary B RTHDAYS EXCLUS VE

విడుదలవుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆగస్ట్ లో చాలా మీడియం, బిగ్ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. అక్టోబర్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదలువుతోంది. క్రిస్మస్ సీజన్ కు కేజిఎఫ్ చాప్టర్ 2, పుష్ప వంటి సినిమాలు టార్గెట్ చేస్తున్నాయి. సంక్రాంతి సమయానికి కూడా పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. మరి వీటన్నిటినీ దాటుకుంటూ మంచి రిలీజ్ డేట్ ను రాధే శ్యామ్ ఎలా కన్ఫర్మ్ చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. JULY, 2021 b టాలీవుడ్ z 7




NEWS HAPPENINGS



LIFE style HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS

      LOCAT ON

fash on

2

TICKET TOLLYWOOD sex psychology

రంగస్థలం సినిమాతో సుకుమార్ తన సత్తాను

top

చూపించాడు. మాస్ సినిమా క్రియేటివ్ డైరెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించాడు సుకుమార్. రంగస్థలం తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు సుకుమార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర మొదటి పార్ట్ షూటింగ్ ప్రస్తుతం సికింద్రాబాద్ లో జరుగుతోంది. ఆ తర్వాత శేషాచలం అడవుల్లో జరిగే 45 రోజుల షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఇక ఈ సినిమాలో సుకుమార్ పెద్ద రిస్క్

N GHT Life

trade GUIDE My CHOICE

QUIZ

చేస్తున్నాడని సమాచారం. పుష్ప చిత్రంలో విలన్ గా సునీల్ నటిస్తున్నాడు. సునీల్ ను నెగటివ్ రోల్ లో తీసుకోవడానికి ప్రేక్షకులు ఇష్టపడతారా అన్నది ప్రశ్న. ఎందుకంటే సునీల్ విలన్ గా చేసిన డిస్కో రాజా ప్లాప్ అయింది. అంతే కాకుండా సునీల్ ను అలాంటి పాత్రల్లో చూడటానికి జనాలు ఇష్టపడట్లేదు. మరి పుష్ప పార్ట్ 1 లో విలన్ గా సునీల్ ను తీసుకుని సుకుమార్ రిస్క్ చేస్తున్నాడా అనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

 COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

-

 LittleStar



FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

యంగ్

టైగర్ ఎన్టీఆర్ నాలుగేళ్ల తర్వాత మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు. బిగ్ బాస్ ను హోస్ట్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్ గా మారాడు. నిజానికి ఈ కార్యక్రమం ఏప్రిల్ లోనే లాంచ్ కావాలి కానీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా వాయిదా పడింది. జులై 7 నుండి ఎన్టీఆర్ ఈ షో షూటింగ్ లో పాల్గొంటాడని వార్తలు వచ్చాయి కానీ అనుకోని 8 z టాలీవుడ్ b JULY, 2021

కారణాల వల్ల రెండు రోజులు వెనక్కి వెళ్ళింది. ఈ వీకెండ్ నుండి 10 రోజుల పాటు ఎన్టీఆర్ ఈ షో షూటింగ్ లో పాల్గొంటాడు. వీలైనన్ని ఎక్కువ ఎపిసోడ్స్ ను షూట్ చేసేలా ప్లాన్ చేసారు. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ 10 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుండి మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటాడు ఎన్టీఆర్. ఉక్రెయిన్ లో ఒక సాంగ్ ను చిత్రీకరించాల్సి ఉంది.

కరోనా సెకండ్ వేవ్ మరోసారి చాలా మంది

జీవితాలను తలక్రిందులు చేసి వెళ్ళిపోయింది. ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గడంతో సినిమా షూటింగ్స్ ను మొదలుపెట్టారు. థియేటర్స్ ను తెరుచుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి కానీ ఈ నెలలో కొత్త సినిమాలు విడుదలవ్వడం కష్టమే. ఆగస్ట్ నుండి తెలుగు సినిమాల విడుదలలు మొదలవుతాయని అందరూ భావిస్తున్నారు. అయితే ఈలోగా మరో వార్త బయటకు వచ్చింది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి

చేసుకుంది. ఈ చిత్రం ఓటిటిలో విడుదల అవ్వదని, థియేటర్లలోనే విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు. నిర్వాణ సినిమాస్ ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను కొనుగోలు చేసింది. తాజా సమాచారం ప్రకారం జులై 30 న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే లాక్ డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి తెలుగు చిత్రంగా తిమ్మరులు నిలుస్తుంది. శరన్ కొప్పిశెట్టి ఈ లీగల్ థ్రిల్లర్ తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood





ఒక భాషలో బాగా పేరు తెచ్చుకున్న సినిమాలు

మరో భాషలో రీమేక్ కావడం అనేది ఎప్పటినుండో వస్తున్నదే. ఈ మధ్య కాలంలో ఈ రీమేక్ ల హవా బాగా పెరిగింది. తెలుగు భాషలోకి కొన్ని చిత్రాలు రీమేక్ అవుతుండగా తెలుగు నుండి కూడా చాలా సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సౌత్ నుండి మరో చిత్రం హిందీలోకి రీమేక్ అవుతోంది. సూర్య హీరోగా వచ్చిన సూరరై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) అమెజాన్ ప్రైమ్ లో విడుదలై బాగా పేరు తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఎయిర్ డెక్కన్

ఫౌండర్ జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన విషయం తెల్సిందే. భారతదేశంలో అతి తక్కువ ధరతో ఫ్లైట్స్ నడపాలన్న గోపినాథ్ ఆలోచన ఎలా కార్యరూపం దాల్చింది అన్నది ఈ చిత్ర కథాంశం. ఇక ఈ సినిమా ఇప్పుడు హిందీలోకి రీమేక్ అవుతోంది. సూర్య 2డి ఎంటర్టైన్మెంట్ తో పాటు విక్రమ్ మల్హోత్రా అబుందటియా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించనుంది. ప్రస్తుతం దర్శకురాలు సుధా కొంగర స్క్రిప్ట్ వర్క్ పై పని చేస్తున్నారు. కాస్ట్ అండ్ క్రూ ను ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది.



 వరసగా కోలీవుడ్ హీరోలు అందరూ టాలీవుడ్

బాట పడుతున్నారు. ఇప్పటికే హీరో విజయ్ డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఇక ధనుష్ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు హీరో శివ కార్తికేయన్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన శివ కార్తికేయన్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు

సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు అనుదీప్. పూర్తి స్థాయి సిల్లీ స్క్రిప్ట్ గా జాతిరత్నాలు చిత్రాన్ని మలిచిన అనుదీప్ ఈ సారి సీరియస్ థ్రిల్లర్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. శివ కార్తికేయన్ ను అప్రోచ్ అయినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలున్నాయి.







ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్

ఎవరంటే పూజ హెగ్డే అని చెప్పవచ్చు. ఇటీవలే రాధే శ్యామ్ షూటింగ్ ను మొదలుపెట్టింది పూజ. కొన్ని రోజులు రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొన్నాక ఇప్పుడు తన బేస్ ను చెన్నైకు మార్చేసింది. ఇక్కడ పూజ తన తమిళ చిత్రాన్ని మొదలుపెట్టింది. విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న బీస్ట్ చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తోంది. నెల్సన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల బీస్ట్

సాంగ్ షూటింగ్ మొదలైంది. విజయ్, పూజ హెగ్డేలపై ఒక సాంగ్ ను షూట్ చేస్తున్నారు. అది పూర్తవ్వగానే పూజ మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటుంది. రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసి బాలీవుడ్ చెక్కేస్తుంది. అక్కడ రెండు ప్రాజెక్టులను సైన్ చేసింది అమ్మడు. ఇలా వరస చిత్రాలతో బిజీబిజీగా ఉంది అమ్మడు. పూజ హెగ్డే తెలుగులో రాధే శ్యామ్ కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చేస్తోంది. అలాగే ఆచార్యలో చిన్న పాత్రలో కనిపించనుంది. JULY, 2021 b టాలీవుడ్ z 9




NEWS HAPPENINGS

 ప్రస్తుతం

థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి, ఎప్పుడు నార్మల్ పరిస్థితులు వస్తాయి అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ భారీ సినిమాలు ఇప్పటినుండే రిలీజ్ డేట్స్ పై ఓ మాట అనుకుంటున్నాయి. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ఆచార్య, రాధే శ్యామ్, కేజిఎఫ్ చాప్టర్ 2, పుష్ప పార్ట్ 1 వంటి చిత్రాలు ఈ ఏడాది విడుదలవుతాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాటను 2022 సంక్రాంతికి విడుదల

LIFE style HOT SPICY CHIT CHAT RAZZI

PA

చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి రేసులోకి మరో రెండు చిత్రాలు వచ్చి చేరినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నిర్మిస్తోన్న అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కూడా సంక్రాంతి రేసులోకి వచ్చింది. అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 కూడా సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చింది. అయితే ఈ రిలీజ్ డేట్స్ పై మరింత క్లారిటీ త్వరలోనే వస్తుంది.

BEAUTY t ps

 BEHIND THE WOODS



LOCAT ON

fash on

2

TICKET TOLLYWOOD

ప్రస్తుతం

పూజ హెగ్డే హవా మాములుగా లేదు. టాలీవుడ్ లో యంగ్ హీరోలు అందరితో దాదాపుగా నటించేసిన పూజ హెగ్డే, టాప్ హీరోలతో సైతం కొందరితో నటించేసింది. చాలా త్వరగా టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంది. ప్రస్తుతం వేరే భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పూజ హెగ్డే, తెలుగు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ భామ నటించిన రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాలు ఈ ఏడాది విడుదలవుతాయి. అలాగే తమిళ్ లో విజయ్

sex psychology top

N GHT Life

trade GUIDE My CHOICE

సరసన బీస్ట్, మరో మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోన్న పూజ తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం తన డిమాండ్ కు తగ్గట్లుగా పూజ హెగ్డే 3.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు ఆ మొత్తం చెల్లించడానికి కూడా రెడీ అంటున్నారు. నితిన్ హీరోగా వక్కంతం వంశీలో తెరకెక్కబోయే చిత్రానికి ఈ రేటును డిమాండ్ చేసింది ఈ భామ.

 QUIZ

 COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

అఖిల్ అక్కినేని నటిస్తోన్న ఐదో సినిమాకు లైన్

క్లియర్ అయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు సంబంధించి షూటింగ్ పోర్షన్ మొత్తం పూర్తి చేసేసిన అఖిల్ ఇప్పుడు ఏజెంట్ పై ఫోకస్ పెట్టాడు. నిజానికి ఏజెంట్ కోసం చాలా నెలల నుండే శిక్షణ పొందుతున్నాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ స్కిల్స్ ను పెంచుకున్నాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఏజెంట్ కు సంబంధించి ఒక రూమర్ షికార్లు చేస్తోంది. ఏజెంట్ లో

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి విలన్ గా చేస్తున్నాడని, హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. నిజానికి మమ్ముట్టి ఈ చిత్రంలో పాజిటివ్ రోల్ చేస్తున్నాడట. అఖిల్ కు గురువు పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం కోసం ఏకంగా 3 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.





LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

ఓ బేబీ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను

సాధించింది దర్శకురాలు నందిని రెడ్డి. అంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా నందిని 10 z టాలీవుడ్ b JULY, 2021

తన నెక్స్ట్ సినిమా కోసం బ్రేక్ తీసుకుంది. నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమాను మొత్తానికి అనౌన్స్ చేసింది. నిజానికి నాగ చైతన్య హీరోగా

నందిని రెడ్డి సినిమా చేయాలనుకుంది కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తన తర్వాతి చిత్రంలో హీరోగా ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ ను ఎంచుకుంది. నందిని రెడ్డితో తరుచుగా పనిచేసే మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుంది.

అలాగే వెన్నెల కిషోర్, రావు రమేష్, గౌతమి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తాడు. స్వప్న సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనికి ఆసక్తికర టైటిల్ గా అన్నీ మంచి శకునములేను ఎంచుకున్నారు.


NEWS HAPPENINGS

న్యాచురల్ స్టార్ నాని తన నిర్మాణంలో అ!,

హిట్ చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు తన ప్రొడక్షన్ లో మూడో చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. తన సోదరి దీప్తి ఘంటాను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు నాని. ఈ చిత్రానికి మీట్ క్యూట్ అన్న టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. అలాగే సత్యరాజ్ కీలక పాత్రలో కనిపిస్తాడు. కాజల్ అగర్వాల్, నివేతా థామస్ లు కూడా హీరోయిన్స్

LIFE style

గా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆదా శర్మను ఇప్పటికే ఫైనల్ చేసారు. మీట్ క్యూట్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ను కూడా ఈ చిత్రంలో నటింపజేస్తున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ రావా, దేవదాస్ చిత్రాలతో ఆకాంక్ష సింగ్ ఫేమస్ అయింది. వచ్చే ఏడాది మొదట్లో మీట్ క్యూట్ ను విడుదల చేయనున్నాడు నాని.

HOT SPICY 



CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE







నితిన్

కు ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదు. 2021లో నితిన్ వి రెండు సినిమాలు విడుదలయ్యాయి. చెక్, రంగ్ దే చిత్రాలు నెల రోజుల వ్యవధిలో విడుదలవ్వగా ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి. అయితే రంగ్ దే చిత్రం టెలివిజన్ ప్రీమియర్ లో మాత్రం ఇంప్రెస్ చేసింది. జూన్ 20న రంగ్ దే చిత్రం జీ ఛానల్ లో ప్రీమియర్ అయింది. మొదటి ప్రీమియర్ లో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 7.22

టిఆర్పి రేటింగ్ ను సాధించింది. నితిన్ చిత్రానికి ఈ రేటింగ్ అంటే డీసెంట్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన ఈ చిత్రం టివి టెలికాస్ట్ లో మాత్రం ఇంప్రెస్ చేయడం విశేషమే. వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. నితిన్ నటించిన మరో సినిమా ఈ ఏడాది విడుదలవుతుంది. మేస్ట్రో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కాకపొతే మేస్ట్రో హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కానుంది. JULY, 2021 b టాలీవుడ్ z 11


LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

12 z టాలీవుడ్ b JULY, 2021


JULY, 2021 b టాలీవుడ్ z 13


ng od Bollywood w టా tory od

లీవుడ్ లో మైత్రి మూవీ మేకర్స్ హవా మాములుగా లేదు. వరసగా టాప్ సినిమాలను నిర్మిస్తోంది. స్టార్ హీరోలతో చిత్రాలని లైన్లో పెట్టింది. అంతే కాకుండా మరింత మందికి అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసింది ఈ సంస్థ. ఇదే కోవలో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ కు కూడా మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా సినిమాలపై మైత్రి ఫోకస్

చేసింది. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ కు ఏకంగా 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ ను ఇచ్చింది. సల్మాన్ 2023 నుండి ఈ సంస్థకు డేట్స్ ఇస్తానని ప్రామిస్ చేసాడు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ సల్మాన్ ను డైరెక్ట్ చేయగలిగే దర్శకుడి కోసం చూస్తోంది. ప్రస్తుతానికైతే చాలా మంది దర్శకులను కన్సిడర్ చేస్తున్నారు కానీ త్వరలోనే ఒక డైరెక్టర్ ను కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నారు. చూడాలి మరి మైత్రి మూవీ మేకర్స్ ఏ దర్శకుడితో సినిమాను సెట్ చేస్తుందో.





అక్కినేని

నాగ చైతన్య బాలీవుడ్ లో డెబ్యూ చేస్తోన్న విషయం తెల్సిందే. ఆమిర్ ఖాన్ హీరోగా వస్తోన్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య స్పెషల్ రోల్ చేస్తున్నాడు. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దాలో ఆమిర్ ఖాన్ ఆర్మీ రోజుల్లో ఫ్రెండ్ గా నాగ చైతన్య నటిస్తున్నాడు. ఈ రోల్ కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు. ప్రత్యేక ట్రైనర్ ను పెట్టుకుని తన ఫిజిక్ ను మెరుగు పరుచుకున్నాడు. ప్రస్తుతం లాల్ సింగ్

చద్దా షూటింగ్ లడఖ్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో నాగ చైతన్య ఇటీవల పాల్గొన్నాడు. మరో 20 రోజుల పాటు అదే షెడ్యూల్ లో నాగ చైతన్య పాల్గొంటాడని తెలుస్తోంది. ఇప్పటికే లవ్ స్టోరీ రిలీజ్ కోసం ఎదురుచూస్తోన్న చైతన్య, మరోవైపు థాంక్యూ చిత్రాన్ని దాదాపు పూర్తి చేసేసాడు. లాల్ సింగ్ చద్దా పార్ట్ ను పూర్తి చేసాక థాంక్యూను పూర్తి చేస్తాడు చైతన్య.









సౌత్

లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే పరిమితమైన తాప్సి, బాలీవుడ్ వెళ్ళాక మాత్రం తన కెరీర్ ను పూర్తిగా మార్చేసుకుంది. ఎక్కువగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ ను ఎంచుకుంటూ ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. ఆమె పలు ప్రతిష్టాత్మక బయోపిక్స్ లో కూడా భాగం కానుంది. ఇదిలా ఉంటే తాప్సి ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. కింగ్ ఖాన్ షారుఖ్ 14 z టాలీవుడ్ b JULY, 2021

ఖాన్ భారీ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు. పఠాన్ చిత్రాన్ని చేస్తోన్న షారుఖ్, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఎప్పటినుండో చర్చల దశలో ఉండగా మొత్తానికి ఫైనలైజ్ కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తాప్సిను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తాప్సి టాప్ నటిగా మారడం ఖాయం. పఠాన్ పూర్తయ్యాక రాజ్ కుమారి హిరానీ – షారుఖ్ సినిమా మొదలవుతుంది.


NEWS HAPPENINGS



 LIFE style



HOT SPICY CHIT CHAT

న్యాచురల్

స్టార్ నాని తిరిగి ముఖానికి రంగు వేసుకుంటున్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులకు దూరమైన నాని తిరిగి బిజీ అయ్యాడు. నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ మొదలైంది. ఇది ఫైనల్ షెడ్యూల్ అని నాని అధికారికంగా తెలియజేసాడు. “శ్యామ్ వచ్చేసాడు. ఆఖరి షెడ్యూల్ మొదలైంది” అని నాని ట్వీట్ చేసాడు. 10 ఎకరాలలో శ్యామ్ సింగ రాయ్ కోసం లాక్ డౌన్ కు ముందు భారీ సెట్ వేశారు. ఆ తర్వాత

PA

RAZZI

BEAUTY t ps

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు ఈ సెట్ కొంత మేర దెబ్బతింది. ఇప్పుడు ఈ సెట్ కు మరమత్తులు చేయడంతో లాస్ట్ షెడ్యూల్ మొదలైంది. రాహుల్ సంకిట్ర్యాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

BEHIND THE WOODS LOCAT ON

fash on

2

TICKET TOLLYWOOD sex psychology top







N GHT Life trade GUIDE

 My CHOICE



QUIZ

COMPETET ON

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం యూఎస్

లో ఉన్న విషయం తెల్సిందే. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం యూఎస్ వెళ్లిన రజినీకాంత్ ఈ నెలలో తిరిగి ఇండియాకు రానున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తోన్న సినిమా అన్నాత్తే. ఈ సినిమా షూటింగ్ రజినీకాంత్ యూఎస్ కు వెళ్ళడానికి ముందే పూర్తయిపోయింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా సన్ పిక్చర్స్ అన్నాత్తే విడుదలపై క్లారిటీ ఇచ్చింది. “అన్నాత్తే దీపావళికి మీరు రెడీనా”

d ary B RTHDAYS EXCLUS VE

అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. నవంబర్ 4న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ అప్డేట్ తో పాటు కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసారు. శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో తెలుగులో దరువు, శౌర్యం చిత్రాలను డైరెక్ట్ చేసాడు శివ. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఖుష్బూ, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ మొత్తానికి డిజిటల్ డెబ్యూ చేస్తోంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత డిజిటల్ డెబ్యూ చేసిన విషయం తెల్సిందే. ఈ కోవలోకే రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. అక్టోబర్ 31 లేడీస్ నైట్ టైటిల్ తో తెరకెక్కుతోన్న వెబ్ షో లో రకుల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇందులో విశ్వక్ సేన్ కామియో పాత్రలో నటిస్తున్నాడు. ఒక రోజు హాలోవీన్ పార్టీలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ వెబ్ షో

ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఈ వెబ్ ఫిల్మ్ షూట్ మొదలైంది. రకుల్ ప్రీత్ తో పాటు మేఘా ఆకాష్, నివేతా పేతురాజ్, విద్యుల్లేఖ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ది పెళ్లి కొడుకు పాత్ర అని తెలుస్తోంది. విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, విద్యులు ప్రస్తుతం షూట్ లో పాల్గొంటున్నారు. త్వరలోనే ఒక బడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ వెబ్ ఫిల్మ్ విడుదల కానుంది. JULY, 2021 b టాలీవుడ్ z 15


fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ

iswarya menon COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

talent contact us for PORTFOLIO'S and featured in TICKET 2 TOLLYWOOD m: +91 7702 555 873 e: editor@tollywoodmag.com

aathmika


NEWS HAPPENINGS

   LIFE style వి

క్టరీ వెంకటేష్ మంచి స్పీడుమీదున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేసాడు వెంకటేష్. నారప్ప, దృశ్యం 2 కూడా ఓటిటి రిలీజ్ లు అవుతున్నాయి. ఇదిలా ఉంటె త్వరలోనే ఎఫ్3 షూటింగ్ ను మొదలుపెడతాడు వెంకీ, మైసూర్ లో ఈ చిత్ర తాజా షెడ్యూల్ మొదలవుతుంది. ఎఫ్3 తర్వాత వెంకటేష్ చేయబోయే చిత్రాల విషయంలో కొంచెం క్లారిటీ వచ్చింది, మలయాళ సూపర్ హిట్ డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు వెంకటేష్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps

దాంతో కనుక సంతృప్తి చెందితే వెంటనే పట్టాలెక్కుతోంది. మరోవైపు దర్శకుడు త్రినాథరావు నక్కినతో చిత్రం రెండేళ్ల నుండి చర్చల దశలో ఉంది. ఈ ఏడాదే దీనిపై కూడా క్లారిటీ ఇస్తాడు వెంకీ. ఇక తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ కూడా అంతే. ఈ స్క్రిప్ట్ తో వెంకటేష్, సురేష్ బాబు సంతృప్తి చెందినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో చిత్రాన్ని ప్రకటించనున్నారు. అయితే ఏ సినిమా ముందు, ఏది వెనకాల అన్నది త్వరలోనే తెలుస్తుంది.

BEHIND THE WOODS LOCAT ON





fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE

  My CHOICE QUIZ

COMPETET ON సం

దీప్ కిషన్ ఈ ఏడాది ఏ1 ఎక్స్ ప్రెస్ తో డీసెంట్ విజయాన్ని సాధించాడు. హాకీ నేపధ్యమున్న ఈ చిత్రం సందీప్ కు మంచి పేరే తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం సందీప్ చేస్తోన్న చిత్రం గల్లీ రౌడీ, ముందుగా దీనికి రౌడీ బేబీ టైటిల్ ను ఫిక్స్ చేసారు కానీ వివిధ కారణాల వల్ల టైటిల్ మార్చాల్సి వచ్చింది. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం మొదట థియేటర్లలోనే విడుదల కావాల్సి ఉన్నా ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో

d ary B RTHDAYS EXCLUS VE

ఓటిటి రిలీజ్ అయితే బెటర్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక భారీ ఓటిటి సంస్థతో టాక్స్ నడుస్తున్నాయి. అది కనుక ఓకే అయితే నారప్ప, దృశ్యం2 తరహాలో మరో సినిమా కూడా ఓటిటి బాట పట్టనుంది. ప్రస్తుతం పలు చిత్రాలు ఇదే కోవలో నడుస్తున్నాయి. జి నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేసిన గల్లీ రౌడీ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నాడు.

తె

లుగమ్మాయిగా కెరీర్ ను నిర్మించుకున్న కలర్స్ స్వాతి పెళ్లి చేసుకుని కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. మళ్ళీ మూడేళ్ళ తర్వాత తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటోంది. కలర్స్ స్వాతి నటిస్తోన్న తాజా చిత్రం పంచతంత్రం. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోగా మళ్ళీ ఇటీవల తిరిగి మొదలైంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు హర్ష డైరెక్ట్ చేస్తున్నాడు. పంచతంత్రం షూటింగ్ ప్రస్తుతం

చివరి దశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంచనా. ఈ చిత్రంలో ఇంకా శివాత్మిక రాజశేఖర్, బ్రహ్మానందం, సముద్రఖని, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య నటిస్తున్నారు. పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అఖిలేష్ వర్ధన్, సృజన్ యర్రబోలు నిర్మిస్తున్నారు. పంచతంత్రం చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. JULY, 2021 b టాలీవుడ్ z 17


B RTHDAYS EXCLUS VE

 



LittleStar

నటీనటులు: కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణప్రియ, ఆమని దర్శకత్వం : ‌రవీంద్ర పుల్లే నిర్మాత : ‌చిట్టి కిరణ్ రామోజు సంగీతం : నవాల్ రాజా ఏఐఎస్ విడుదల తేదీ : జూన్ 11, 2021

గొడవల వల్ల ఎటువంటి పరిణామాలు సంభవించాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమాలో దొరుకుతాయి.

పెర్ఫార్మన్స్:

ఇప్పటికే పలు సినిమాలతో కార్తీక్ రత్నం తాను ఎంత మంచి నటుడు అన్నది నిరూపించాడు. అర్ధశతాబ్దం సినిమాకు కార్తీక్ రత్నం గుండె చప్పుడు లాంటి వాడు అని చెప్పవచ్చు. తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు. తండ్రి చాటు కూతురిగా కృష్ణప్రియ పెర్ఫార్మన్స్ పర్వాలేదు. రంజిత్ పాత్రలో పోలీస్ పాత్ర చేసిన నవీన్ చంద్ర దానికి సరిపోలేదు అనిపిస్తుంది. తాను చేయాల్సిన పాత్ర అయితే కాదిది. మాజీ మావోయిస్టుగా సాయి కుమార్ తన పాత్రకు న్యాయం చేసాడు. మిగతావాళ్లంటూ తమ తమ పరిధుల మేర రాణించారు.

FilmMaking Kollywood Bollywood రేటింగ్ : 2/5 Interview సాంకేతిక వర్గం : SpecialStory Hollywood ట్రైలర్ తో అత్యంత ఆసక్తి రేకెత్తించిన అర్ధశతాబ్దం ఓటిటి సంస్థ ఆహాలో విడుదలైంది. భారీ తారాగణంతో నిండిన ఈ సినిమా చుట్టూ ఉన్న హైప్ నిలబడ్డ తగ్గదో కాదో చూడాలి.

కథ :

సిరిసిల్ల ఊరిలో 2000లో ఈ కథ జరుగుతుంది. కృష్ణ (కార్తీక్ రత్నం) ఆ ఊరి కుర్రాడు. పుష్ప (కృష్ణప్రియ)ను చూసి మనసు పారేసుకుంటాడు. అయితే సరిగ్గా తన ప్రేమను వ్యక్తపరుద్దాం అనుకునే లోపే కృష్ణ చేసిన ఒక పని కారణంగా ఊరు మొత్తం కదులుతుంది. ఊర్లో కులం పేరుతో విపరీతమైన హింస పెరుగుతుంది. ఇప్పుడు కృష్ణ ఏం చేస్తాడు? పుష్ప అతని ప్రేమను అంగీకరిస్తుందా? ఆ ఊర్లో జరిగిన

అర్ధశతాబ్దం కథ ఆసక్తికరంగానే సాగినా దాన్ని మలిచిన తీరు నిరాశ కలిగిస్తుంది. ప్రజా నాట్య మండలి సభలు, బతుకమ్మ పండుగ, మావోయిస్టు కోణం ఇవన్నీ తెలంగాణ లైఫ్ స్టైల్ ను బాగా క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒకటి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా అదిరింది. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. కాకపోతే ఇందాక చెప్పుకున్నట్లు స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ వద్ద అర్ధశతాబ్దం నిరాశపరుస్తుంది.

చివరిగా:

అర్ధ శతాబ్దం ఫస్ట్ హాఫ్ నిరాశక్తగా సాగుతుంది. ఇక్కడ కథ అంటూ ఏం ఉండదు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుంది. ఇంకా కులం పేరుతో జరిగే గొడవలను

  నటీనటులు: శ్వేతా వర్మ, రామ్జ్, జయ్ చంద్ర, రవి వర్మ

దర్శకత్వం : ‌‌శ్రీ కృష్ణ, రామ సాయి నిర్మాత: ‌కౌశిక్ కుమార్ కతూరి, రామ సాయి సంగీతం : సమరన్ సాయి విడుదల తేదీ : జూన్ 13, 2021 రేటింగ్ : 2.5/5

పచ్చీస్ టైటిల్ వినగానే ఆసక్తికరంగా అనిపిస్తుంది. పెద్దగా అనుభవం లేని రామ్జ్, శ్వేతా వర్మ, జయ్ చంద్ర, రవి వర్మ నటించిన ఈ సినిమా డైరెక్ట్ ఓటిటిలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ :

అభిరామ్ (రామ్జ్) ఒక గ్యాంబ్లర్. ఆర్కే (రవి వర్మ) ఒక కాసినో ఓనర్. ఆర్కేకు అభిరాం భారీగా బాకీ పడతాడు. తన అప్పులన్నీ తీర్చడానికి అభిరాం ఒక లోకల్ పొలిటికల్ ఇష్యూలో తలదూరుస్తాడు. బసవరాజు, గంగాధర్ ల మధ్యన రాజుకున్న వివాదంలో ఇరుక్కోవడం వల్ల అభిరాంకు అవంతిక పరిచయం అవుతుంది. మరోవైపు అవంతిక తన తప్పిపోయిన తమ్ముడు గురించి వెతుకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది. ఈ డాట్స్ అన్నీ ఎలా సాల్వ్ అవుతాయి అన్నది ప్రధాన కథ. 18 z టాలీవుడ్ b JULY, 2021

పెర్ఫార్మన్స్:

అభిరామ్ పాత్రలో రామ్జ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచాడనే చెప్పాలి. అభిరామ్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు ఈ నటుడు. శ్వేతా వర్మ చూడటానికి బాగుంది. తన పెర్ఫార్మన్స్ కూడా డీసెంట్ గా ఉందనే చెప్పాలి. ఇప్పటివరకూ ఎక్కువగా అల్లరి పాత్రలు వేసిన శ్వేతా వర్మ ఈసారి సీరియస్ రోల్ చేసింది. కాసినో ఓనర్ పాత్రలో రవి వర్మ పెర్ఫార్మన్స్ కూడా ఓకే. శుభలేఖ సుధాకర్, విశ్వేన్దర్ రెడ్డి మరియు ఇతరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం :

పచ్చీస్ కథ చాలా కొత్తగా ఉంది. బోలెడన్ని లేయర్స్ ఉన్న ఈ కథను సరిగ్గా హ్యాండిల్ చేయడంలో దర్శకులు విఫలమయ్యారు. కథ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సీన్స్ ను ఎలివేట్ చేసిన విధానం హైలైట్. కార్తీక్ పార్మర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా తమ పనితో మెప్పిస్తుంది. రిపిటీటివ్ సీన్స్ రాకుండా స్క్రీన్ ప్లేను మరింత బిగితో రాసుకుని ఉంటే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేది.

తీర్పు:

పచ్చీస్ ఓపెన్ ఎండ్ తో ముగుస్తుంది. దీనికి సీక్వెల్ ఉన్నట్లు దర్శకుడు హింట్ ఇచ్చాడు.

కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది. ఈ కోణం సినిమాలో సరిగ్గా ఇమడలేదు అనే చెప్పాలి.

మొత్తానికి అర్ధశతాబ్దం సినిమా ప్రేక్షకులను నిరాశపరిచే ఒక ప్రయత్నం.


               

NEWS HAPPENINGS

రీసెంట్

గా టాప్ దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. “మన మధ్య బాండ్ అలాగే ఉంటుంది. మీడియం మారుతుంది అంతే, మనం టచ్ లోనే ఉంటాం” అని కొరటాల శివ స్పందించాడు. అయితే కొరటాల శివ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాను అతిగా వాడింది లేదు. ఎప్పుడూ చాలా తక్కువగానే ట్వీట్స్ పెడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు దాన్నుండి డిస్ట్రాక్ట్ అవ్వడం అన్న మాటే ఉండదు. ఇక

LIFE style HOT SPICY CHIT CHAT PA

RAZZI

ఎందుకని కొరటాల శివ సోషల్ మీడియా నుండి తప్పుకున్నాడు అంటే దానికి బలమైన కారణమే ఉందని చెప్పుకోవాలి. ముందుగా అల్లు అర్జున్ తో సినిమాను ప్రకటించిన కొరటాల శివ దానికంటే ముందు ఎన్టీఆర్ తో చిత్రాన్ని చేయబోతున్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొరటాలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది హద్దులు దాటడంతో హర్ట్ అయిన కొరటాల శివ, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

BEAUTY t ps

  

BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD

ఉప్పెన

చిత్రం ద్వారా సెన్సేషనల్ డెబ్యూ చేసిన కృతి శెట్టి వరసగా మూడు సినిమాలకు కమిటైంది. నాని శ్యామ్ సింగ రాయ్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోన్న కృతి శెట్టి, రామ్ – లింగుసామి ద్విభాషా చిత్రంతో పాటు, సుధీర్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ కు బ్రేక్ వచ్చింది. అయితే ఇటీవల కృతి శెట్టి మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటోంది. ముందుగా

sex psychology top

N GHT Life

trade GUIDE

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు చేస్తోన్న “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని ఉంది” చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టింది. లాక్ డౌన్ కు ముందుగా ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. మళ్ళీ ఇప్పుడు మెజారిటీ భాగం షూటింగ్ జరిగిన తర్వాత కృతి శెట్టి రామ్ చిత్రానికి మూవ్ అవుతుంది. ఈ మూడు చిత్రాలు పూర్తైన తర్వాతే కృతి నెక్స్ట్ సినిమాలను సైన్ చేసే అవకాశముంది.

 My CHOICE QUIZ

 COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

విభిన్నమైన

చిత్రాలతో తనకంటూ ఒక బేస్ ను ఏర్పరుచుకున్నాడు అడివి శేష్. ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలతో సూపర్ హిట్లు సాధించిన శేష్ ప్రస్తుతం యూఎస్ లో ఉన్నాడు. తన ఫామిలీతో సమయం గడపడానికి యూఎస్ వెళ్లిన శేష్ త్వరలోనే తిరిగి రానున్నాడు. వచ్చిన వెంటనే మేజర్ చిత్ర పెండింగ్ వర్క్ ను పూర్తి చేస్తాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగుతో పాటు

హిందీ, మలయాళంలో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది. శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హిట్ 2 షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నాడు. శైలేష్ కొలను డైరెక్ట్ చేయనున్న ఈ సీక్వెల్ ను నాని నిర్మిస్తున్నాడు. అలాగే శేష్ గూఢచారి 2 గురించి కూడా స్పందించాడు. ఈ ఏడాదే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి వచ్చే ఏడాది షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. శేష్.





LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

మాస్ మహారాజా రవితేజ తన కొత్త చిత్రాన్ని

మొదలుపెట్టాడు. ఖిలాడీ షూటింగ్ దాదాపుగా పూర్తైన నేపథ్యంలో రవితేజ తన ఫోకస్ ను నెక్స్ట్ చిత్రంపై పెట్టాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించే చిత్రంలో రవితేజ నటిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ఇటీవల విడుదల చేసిన పోస్టర్ చుస్తే అర్ధమవుతోంది. మేజిస్ట్రేట్ ఆఫీస్ లో సీరియస్ వర్క్ లో ఉన్నాడు రవితేజ. అగ్రెసివ్ రోల్ లో రవితేజ కనిపిస్తాడని

సమాచారం. దివ్యంశ కౌశిక్ ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా కనిపించనుంది. మరో హీరోయిన్ ను ఇంకా ఫైనలైజ్ చేయాలి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. సత్యన్ సూర్యన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో రివీల్ కానుంది. JULY, 2021 b టాలీవుడ్ z 19




NEWS HAPPENINGS

 మాస్

మహారాజా రవితేజ మళ్ళీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. ఖిలాడీ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో షార్ట్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక రేపటి నుండి రవితేజ మరో ప్రాజెక్ట్ ను మొదలుపెడుతున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ సినిమాను కన్ఫర్మ్ చేసిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ కు ముందు లాంచ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తోంది.

LIFE style HOT SPICY CHIT CHAT RAZZI

PA

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top

 N GHT Life

trade GUIDE



My CHOICE

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కింది. చాలా తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని షూట్ చేసేసారు. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయడం విశేషం. ఇక దృశ్యం 2 ను మొదట థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నా కానీ ఇప్పుడు ఓటిటిలో

QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయబోతున్నారు. ఓటిటిలో హాట్ స్టార్ లో విడుదలవుతోన్న ఈ చిత్ర సాటిలైట్ రైట్స్ ను స్టార్ మా కొనుగోలు చేసింది. దృశ్యం 2 లో రాంబాబుగా తిరిగి రానున్నాడు వెంకటేష్. తన కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తిగా వెంకటేష్ కనిపిస్తాడు. మీనా వెంకటేష్ కు పెయిర్ గా నటిస్తోంది.



   LittleStar

FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood సినిమాకు “సభకు నమస్కారం” అనే ఆసక్తికర కా మెడీ చిత్రాలతో స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు అల్లరి నరేష్. ఈ మధ్య కామెడీ చిత్రాలతోనే ప్లాపులు ఫేస్ చేసిన నరేష్, నాంది వంటి డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. నాంది చిత్రంలో అల్లరి నరేష్ కు పెర్ఫార్మన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాంది తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ నటుడు మరోసారి తన ఫెవరెట్ కామెడీ జోనర్ కు ఫిక్స్ అయ్యాడు. ఇటీవల అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా తన 58వ సినిమాను ప్రకటించారు. తన నెక్స్ట్ 20 z టాలీవుడ్ b JULY, 2021

టైటిల్ ను ఓకే చేసారు. పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన సతీష్ మల్లంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జర్నలిస్ట్ నుండి పీఆర్వోగా మారి ఇప్పుడు నిర్మాత అయిన మహేష్ ఎస్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ద్వారా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. అబ్బూరి రవి కథ సహకారం అందిస్తున్నాడు. సభకు నమస్కారంకు సంబంధించి మరింత సమాచారం త్వరలోనే తెలుస్తుంది.

అలాగే గతేడాది నుండి త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ముందు స్క్రిప్ట్ విన్న రవితేజ కొన్ని మార్పులను సూచించాడట. ఇప్పుడు ఆ మార్పులు చేయడంతో రవితేజ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి. ఇక ఈ చిత్రం కోసం రవితేజ ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


NEWS HAPPENINGS

 

      LIFE style

HOT SPICY CHIT CHAT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ను మరింత పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడు. తన ప్రస్తుత

PA

RAZZI

సినిమా పుష్పను ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాడు. అంతేనా, ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీగా ఖర్చు పెడుతోంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కు మరింత లావిష్ గా ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మరో నెల రోజుల్లో పూర్తి చేసి పుష్ప సెకండ్ పార్ట్ పనులు మొదలుపెట్టాలని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తోంది. అయితే అల్లు అర్జున్ మాత్రం పుష్ప రెండు పార్ట్స్ కు మధ్య మరో సినిమా గ్యాప్ ఉంటే మంచిదని భావిస్తున్నాడు. అందుకే ఈ గ్యాప్ లో ఐకాన్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం మైత్రి వారికి రుచించట్లేదట. రెండు భాగాలూ వరసగా షూటింగ్ అయిపోతే తమకు ప్రొడక్షన్ ఖర్చులు పెరిగిపోతుందని ఆలోచిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం చేస్తారో ఏమో.





BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON

యంగ్

fash on

2

TICKET TOLLYWOOD sex psychology top

టైగర్ ఎన్టీఆర్, టాప్ దర్శకుడు కొరటాల శివతో టీమప్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా అతి త్వరలోనే లాంచ్ కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ను పూర్తి చేస్తున్నాడు. దాని తర్వాత టివి షో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ను హోస్ట్ చేయాల్సి ఉంది. ఈలోగా దర్శకుడు కొరటాల శివ కూడా తన ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాడు. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. మరో రెండు నెలల్లో ఎన్టీఆర్ – కొరటాల శివ

మూవీ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా కొరటాల శివ కాస్ట్ అండ్ క్రూ ను ఎంపిక చేస్తున్నాడు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఖరారు అవుతుందని అంటున్నారు. అలాగే అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తాడు. ఇక విలన్ గా ఎవరు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరో భాషలో యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోను ఈ సినిమాలో విలన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయట. చూద్దాం.

N GHT Life trade GUIDE

MyCHOICE 

  QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆగ్ర దర్శకుడు

ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ఉంటుందని తెలిసిన దగ్గరనుండి బజ్ భారీగా పెరిగింది. ఈ చిత్రంపై అన్ని వర్గాల్లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో వర్కౌట్ అవ్వాల్సింది కానీ వివిధ కారణాల వల్ల అలా వెనక్కి జరుగుతూ పోయింది. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యాక రాజమౌళి, మహేష్ తో సినిమాను చేయనున్నాడు. అయితే

LittleStar

ఈ ప్రాజెక్ట్ ఏ జోనర్ లో తెరకెక్కుతుందా అన్న సందేహం అందరిలో ఉంది. దీనిపై రైటర్ విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ స్టైల్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అన్నారు. అలాగే ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ టైపులో భారీ వ్యయంతో ఈ సినిమా ఉంటుందని అన్నారు. మహేష్ – రాజమౌళి చిత్రంపై మరిన్ని విశేషాలు అతి త్వరలోనే తెలుస్తాయి.

JULY, 2021 b టాలీవుడ్ z 21


    

NEWS HAPPENINGS

LIFE style HOT SPICY CHIT CHAT PA

మెగా హీరో వరుణ్ తేజ్ డిఫరెంట్ జోనర్స్

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on

2

కు చెందిన సినిమాలు చేస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. వరస హిట్స్ తో మంచి ఊపు మీదున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం గని చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ జోనర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఈ చిత్ర తాజా షెడ్యూల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇటీవల షెడ్యూల్ మొదలయ్యింది. ఇక వరుణ్ జిమ్ లో కండలు పెంచే పనిలో పడ్డాడు. హాలీవుడ్ యాక్షన్

డైరెక్టర్స్ లారెన్ స్టోవల్, వ్లాడ్ రీంబుర్గ్ గని కోసం పనిచేస్తున్నారు. వీరు గతంలో టైటాన్స్, సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాల కోసం పనిచేసారు. వరుణ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో బట్టి గనిలో హార్డ్ కోర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అర్ధమవుతోంది. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

TICKET TOLLYWOOD sex psychology



top



N GHT Life

trade GUIDE My CHOICE QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

అల వైకుంఠపురములో వంటి భారీ బ్లాక్ బస్టర్

కొట్టినా కానీ ఏడాదిన్నర కాలం నుండి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడు. ముందుగా ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాను ప్రకటించాడు కానీ అది పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జులై నుండి మొదలవుతుంది. అది పూర్తయితే కానీ త్రివిక్రమ్ 22 z టాలీవుడ్ b JULY, 2021

సినిమా ముందుకు కదలదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈలోగా పవన్ కళ్యాణ్ చిత్రంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి అయ్యప్పనుమ్ కోశియుము చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నాడు. జులై రెండో వారం నుండి మొదలయ్యే ఈ చిత్ర షూటింగ్ కు త్రివిక్రమ్ కూడా హాజరుకానున్నాడట. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.



 ఎస్ ఎస్ థమన్ టైమ్ అసలు మాములుగా

నడవట్లేదు. వరసగా టాప్ హీరోల సినిమాలు అన్నీ చేస్తున్నాడు థమన్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాలకు పనిచేస్తున్నాడు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా వర్క్ చేయనున్నాడు. చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ చిత్రాన్ని రీమేక్ చేయనున్న విషయం తెల్సిందే. గతేడాదే లాంచ్ అయిన ఈ చిత్రం వివిధ కారణాల కారణంగా పట్టాలెక్కలేదు. అయితే

ఈ ఆలస్యం కారణంగా రకరకాల రూమర్స్ చక్కర్లు కొట్టడం మొదలైంది. లూసిఫెర్ రీమేక్ ను పూర్తిగా పక్కన పెట్టేశారని కూడా అన్నారు. కానీ అవేమి నిజాలు కావని కన్ఫర్మ్ అయింది. లూసిఫెర్ రీమేక్ మ్యూజిక్ సెషన్స్ మొదలయ్యాయి. దర్శకుడు మోహన్ రాజా, ఎస్ ఎస్ థమన్ కలిసి ఒక సెల్ఫీను షేర్ చేసారు. మ్యూజిక్ సెషన్ మొదలైన విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ లు నిర్మిస్తోన్న ఈ సినిమా కాస్టింగ్ ప్రాసెస్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.



TOLLYWOOD.NET JULY 2021 | VOL 18 | ISSUE 07 | Rs.20/-

RNI NO: APTEL/2003/10076 JULY 2021 VOL:18 ISSUE:07 Rs.20/- TOLLYWOOD TELUGU MONTHLY MAGAZINE

/tollywood

/tollywood


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.