Tollywood Magazine Telugu July - 2017

Page 1

JULY 2017 VOL 14 ISSUE 7

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET



“THE BEST PREPARATION FOR TOMORROW IS DOING YOUR BEST TODAY.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By

: : : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JULY 2017

టాలీవుడ్ P 3




స్.బి ఆర్ట్ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ పై భువ‌న‌గిరి స‌త్య సింధూజ నిర్మాత గా మెట్ట‌మెద‌టిసారిగా నిర్మిస్తున్న చిత్రం సోడా గోలి సోడా.. ఉబ‌య‌గోదావ‌రి జిల్లాల్లో అమ‌లాపురం, పాల‌కొల్లు లాంటి అంద‌మైన ప్ర‌దేశాల్లో మెద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో రెండ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. మ‌ల్లూరి హ‌రిబాబు ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా భారీ తారాగాణం తో హ‌స్య‌ప్రధా ‌ నంగా చిత్రీక‌రిస్తున్నారు. హైద‌రాబాద్ లోని ఓ ప్‌ివేట్ హౌస్ లో ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ ఆలీ, కృష్ణభ ‌ ‌గవా ‌ న్‌, గౌతంరాజు, ప్ర‌భాస్ శ్రీను, హీరో మాన‌స్‌, హీరోయిన్ కారుణ్య ల‌పై కొన్ని కామెడి స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయస‌మావేశంలో ర్మాత భువ‌న‌గిరి స‌త్య సింధూజ మాట్లాడుతూ.. ఎస్‌.బి ఆర్ట్ క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో మెద‌టిషెడ్యూల్ పూర్తిచేసుకుని రెండ షెడ్యూల్ జ‌రుపుకుంటున్న మా చిత్రం సోడా గోలిసోడా. ఎంత మంచి చిత్రానికైనా కామెడి చాలా అవ‌స‌రం. అందుకే మా చిత్రంలో వున్న మంచి మెసెజ్ ని చ‌క్క‌ని కామెడి తో చేస్తున్నాం. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ ఆలీ, కృష్ణభ ‌ ‌గ‌వాన్‌, ప్ర‌భాస్ శ్రీను, గౌతం రాజు, జ‌బ‌ర్ద‌స్త్ ఆది ఇలా చాలా మంది కామెడి చేసి ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తారు. మా ద‌ర్శకు ‌ డు హ‌రిబాబు చాలా క్లారిటితో చేస్తున్న చిత్రం. అతి త్వ‌ర‌లో మీ ముందుకు చిత్రాన్ని తీసుకువ‌స్తాం. అని అన్నారు. ర్శకు ‌ డు హ‌రిబాబు మాట్లాడుతూ.. ఎస్‌.బి.ఆర్ట్ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో నేను చెప్పిన క‌థ విని స‌త్య

ని

ద‌

4 P టాలీవుడ్

సిందూజ గారు చేస్తున్నందుకు వారికి నా ధ‌న్య‌వాదాలు. ముఖ్యంగా ఓ సినిమా ఆఫీస్ లో హీరో, హీరోయిన్స్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఆలీ గారి కాంబినేష‌న్ లో తీస్తున్నాం. ముఖ్యంగా మా కెమెరామెన్ ముజీర్ మాలిక్ గురించి చెప్పాలి. మా విజ‌న్ కి ఆయ‌న అనుభ‌వం తో ప్ర‌తి ఫ్రేమ్ రిచ్ గా వస్తుంది. చిత్రం చూసిన ప్ర‌తిఓక్క‌రు కెమెరా వ‌ర్క్ గురించి మాట్లాడుకుంటారు. అని అన్నారు. లీ మాట్లాడుతూ.. చాలా యాడ్ ఫిల్మ్ డైర‌క్ట్ చేసిన హ‌రిబాబు ద‌ర్శ‌కుడిగా చేస్తున్నారు. నిర్మాత‌లు న‌మ్మి ఈ చిత్రాన్ని చేస్తున్నారు. బీడు భూమిలో కూడా పంట‌లు పండించ‌వ‌చ్చు అనేది మెయిన్ పాయింట్ గా పూర్తి ఎంట‌ర్టైన్‌మెంట్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నన్ను, కృష్ణభ ‌ ‌గ‌వాన్‌, ప్ర‌భాస్ శ్రీను, ఆది, గౌతంరాజు, జ‌య‌వాణి, అపూర్వ లాంటి న‌టీన‌టుల‌తో పూర్తి కామెడి చిత్రం గా చేస్తున్నారు. అని అన్నారు. మెరామెన్ ముజీర్ మాలిక్ మాట్లాడుతూ.. ద‌ర్శకు ‌ డు హ‌రిబాబు నేను దాదాపు 18 సంవ‌త్స‌రాల నుండి స్నేహితులం. ఇప్ప‌డు సినిమా చేస్తున్నాం. ఈ సినిమా చేస్తున్నంతసేపు న‌వ్వులే నవ్వులు. ఈ సినిమా పేక‌ప్ చెప్పాలంటే భాద‌గావుంది ఇంటికి వెళ్ళాక బోర్ కొడుతుంది. అంత బాగా చేస్తున్నారు అంద‌రూ.. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంది. అని అన్నారు. చిత్రం లో అవ‌కాశం రావ‌టం చాలా అనందంగా వుంది. ఈ మ‌ద్య కాలంలో ఫుల్ లెంగ్త్ కామెడి చిత్రంగా తెర‌కెక్కతుంది. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు.అని న‌టీన‌టులు అన్నారు.

ఆ కె




  ఇం

డియాలో అన్ని జనరేషన్స్‌కి తెలిసిన ఒకే ఒక పేరు శ్రీదేవి. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి మామ్‌ వరకు జర్నీ చేయడమంటే మామూలు విషయం కాదు. శ్రీదేవితో 24 సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిని నేనే. శ్రీదేవి డేట్స్‌ ఇచ్చి, సురేష్‌బాబు ఫైనాన్స్‌ చేసి, కోన కథ అందిస్తే శ్రీదేవి సిల్వర్‌ జూబ్లీ మూవీ చేస్తాను అని అంటున్నాడు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు . అతిలోకసుందరి శ్రీదేవి తో అత్యధిక చిత్రాలు చేయడమే కాకుండా చేసిన సినిమాలలో దాదాపుగా సూపర్ హిట్స్ అయ్యాయి దాంతో ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఏర్పడింది . ఇంకో సినిమా చేస్తే 25 సినిమాలు చేసిన అరుదైన ఘనత ఈ ఇద్దరి సొంతం అవుతుంది దాంతో సురేష్ బాబు ని నిర్మించమని కోరుతున్నాడు కానీ సురేష్ బాబు అంత సాహసానికి పూనుకుంటాడా చూడాలి .

టాలీవుడ్ P 5






కా

మెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత యువ నిర్మాత డా. రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా మరో విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' పార్ట్‌1 రైట్స్‌ ఫ్యాన్సీ ఆఫర్‌తో స్వంతం చేసుకొని 'సప్తగిరి ఎల్‌. ఎల్‌.బి' పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో 5 ఏళ్ళు, సూపర్‌గుడ్‌ ఫిలింస్‌లో 5 ఏళ్ళు దర్శకత్వశాఖలో పని చేసి డా. డి.రామానాయుడుగారికి, సూపర్‌గుడ్‌ ఆర్‌.బి. చౌదరికి ప్రియ శిష్యుడనిపించుకుని 'కలిసుందాం..రా', 'ప్రేయసిరావే', 'నిన్నే ప్రేమిస్తా', 'భీమిలి కబడ్డీ జట్టు' 'రచ్చ' వంటి సూపర్‌హిట్‌చిత్రాలకు పని చేసి, దిల్‌ రాజు బేనర్‌లో 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'కి దర్శకత్వశాఖలో వర్క్‌ చేసిన చరణ్‌ లక్కాకుల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తం షాట్‌కి సూపర్‌ రైటర్‌ పరుచూరి

పూ

6 P టాలీవుడ్

వెంకటేశ్వరరావు క్లాప్‌ కొట్టగా, నిర్మాత డా. రవికిరణ్‌ కుమార్తెలు బేబీ ఐశ్వర్య, బీ అస్మిత కెమెరా స్విచాన్‌ చెయ్యగా, సీనియర్‌ ఎడిటర్‌గౌతంరాజు గౌరవ దర్శకత్వం వహించారు. ర్మాత డా. రవికిరణ్‌ మాట్లాడుతూ - ''సప్తగిరితో మేము నిర్మించిన తొలి చిత్రం ఎవరూ ఊహించనంత అద్భుత విజయాన్ని సాధించింది. మళ్ళీ సప్తగిరి హీరోగా అంతకంటే పెద్ద హిట్‌ తియ్యాలని 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' రైట్స్‌ తీసుకొని తెలుగులో మనకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ అవకుండా ఈ 'సప్తగిరి ఎల్‌. ఎల్‌.బి' చిత్రాన్ని ప్లాన్‌చేశాం. ర్శకుడు చరణ్‌ లక్కాకుల మాట్లాడుతూ ''గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావుగారి క్లాప్తో ‌ ఈ సినిమా ప్రారంభం అయినందుకు ఆనందంగా వుంది. మంచి నిర్మాత డా. రవికిరణ్‌గారు. సక్సెస్‌ఫుల్‌హీరో సప్తగిరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. దర్శకుడిగా ఈ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చెయ్యడానికి శాయశక్తులా కృషి చేస్తాను'' అన్నారు.

బే ని


న్మథ', 'వల్లభ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ ఛార్మింగ్‌ హీరో శింబు. తాజాగా శింబు హీరోగా గ్లామర్‌ బ్యూటీస్‌ నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా పాండిరాజ్‌ దర్శకత్వంలో 'ప్రేమసాగరం' ఫేమ్‌టి. రాజేందర్‌సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌, జేసన్‌రాజ్‌ఫిలింస్‌బేనర్స్‌పై టి.రాజేందర్‌నిర్మించిన రొమాంటిక్‌ఎంటర్‌టైనర్‌'సరసుడు'. ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్‌.కురళఅరసన్‌ అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. ఇటీవల విడుదలైన ఆడియో సూపర్‌హిట్‌

అయ్యి సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టి. రాజేందర్‌ ఈ చిత్రానికి పాటలు, మాటలు రాయడం మరో విశేషం. శింబు, నయనతార కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఓ స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. శింబు సినీ ఆర్ట్స్‌లో 'కుర్రాడొచ్చాడు' చిత్రం తర్వాత రిలీజ్‌ అవుతున్న డైరెక్ట్‌ తెలుగు చిత్రమిది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌యు సర్టిఫికెట్‌పొందింది. ఈ సినిమా చూసి సెన్సార్‌ సభ్యులు ఎంతో అప్రిషియేట్‌ చేశారు. అన్ని ఏరియాల నుండి బిజినెస్‌పరంగా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. జూలైై నెలలో వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది.



టాలీవుడ్ P 7






'తె

లంగాణ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామర్స్' ఆధ్వ‌ర్యంలో ర‌చ‌యిత సి. నారాయ‌ణరెడ్డి సంస్మ‌రణ ‌ స‌భ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మ‌న్ సిధారెడ్డితోపాటు ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, పరుచూరి బ్రదర్స్‌, టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్‌, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తి, ప్రసాద్‌ ఐమాక్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌, దర్శకులు బి.గోపాల్‌, సినీనటీమణులు కవిత, గీతాంజలి, ఖైరతాబాద్‌ తెరాస నియోజకవర్గ ఇంఛార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, టీఎఫ్‌సీసీ ప్రతినిధులు సాయివెంకట్‌, రవి, సినారె కుటుంబ స‌భ్యులు తదితరులు హాజరయ్యారు. సంద‌ర్భంగా టీ-చాంబ‌ర్ అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.... ` సినిమా ఇండ‌స్ట్రీ లో 30 ఏళ్ల నుంచి ఉన్నాను. సినారె గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నో గొప్ప ర‌చ‌న‌లు చేశారు. 3000 కు పైగా పాట‌లు ర‌చించారు. ఆయ‌న ప్ర‌తిభ‌కు ఎన్నో అవార్డులు అందుకున్నారు. అంత గొప్ప దిగ్గ‌జం ఈరోజు మ‌న మ‌ధ్య‌ లేక‌పోవ‌డం బాధాక‌రం. ఆయ‌న అంతిమ యాత్ర లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు పాల్గొన్నారంటే ఎంత గొప్ప వ్య‌క్తినో తెలుస్తోంది. అంతిమ యాత్ర‌లో పాల్గొన్న తొలి ముఖ్య‌మంత్రి ఆయ‌నే. సినారె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా` అని అన్నారు. రుచూరి బ్ర‌ద‌ర్స్ మాట్లాడుతూ... ` ఇద్ద‌రు గొప్ప వ్య‌క్తులు దాస‌రి, సినారె గారు మ‌న మ‌ధ్య‌న

ప‌

8 P టాలీవుడ్

లేక‌పోవడం భాధాక‌రం. సినారె అధ్య‌క్ష‌త‌నే ర‌ఘుబాబు నాట‌కొత్స‌వాలు జ‌రిగేవి. ఇక‌పై ఆ ఉత్స‌వాల్లో ఆయ‌న పేరిట ఉత్తమ ర‌చ‌యిత అవార్డును అందిస్తాం. తెలుగు అక్ష‌రం ఉన్నంత కాలం సినారె మ‌న మ‌ధ్య‌నే ఉంటారు` అని అన్నారు. -ఫిల్మ్ చాంబ‌ర్ సెక్ర‌ట‌రీ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ... ` సినారె గారు కొన్ని వేల పాట‌లు ర‌చించారు. ఆయ‌న పాట‌లంటే ఎంతో ఇష్టం. అలాంటి గొప్ప వ్య‌క్తి ని కోల్పోవ‌డం బాధాక‌రం` అని అన్నారు. మేష్ ప్ర‌సాద్ మాట్లాడుతూ... ` సినారె గారి స్థానాన్నిమ‌రొక‌రు భ‌ర్తీ చేయ‌లేరు. గొప్ప లెంజెడ‌రీ రైట‌ర్ ఆయ‌న‌. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నా` అని అన్నారు. విత మాట్లాడుతూ...` 14 ఏళ్ల వ‌య‌సులో సినారె గారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆయ‌న పాట‌లు రచించిన సినిమాలో నేను న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నా. పెద్ద స్టార్ అవుతావ‌ని ఆరోజుల్లోనే ఆయ‌న న‌న్ను భుజం త‌ట్టి ప్రోత్స‌హించారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త విని ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యా. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నా` అని అన్నారు. ర్శ‌కుడు బి.గోపాల్ మాట్లాడుతూ... ` స్టేట్ రౌడీ' చిత్రానికి ఆయ‌న పాట రాశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో మంచి అనుబంధం ఉంది. వేల పాట‌ల‌ను ర‌చించిన గొప్ప వ్య‌క్తి. ఆయ‌న రచించిన ప్ర‌తీ పాట ఆణి ముత్య‌మే` అని అన్నారు.

టి

ర‌ క‌

ద‌




      శ్రీ

లత సినీ క్రియేషన్స్ పతాకం పై పి. ఈశ్వర్ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బెక్కం రవీందర్ ప్రొడక్షన్ కంట్రోలర్ గా శ్రీ లత నిర్మిస్తున్న చిత్రం కాలేజ్ డేస్. నూతన నటి నటులతో యూత్ ఫుల్ కథాంశం తో రూపొందుతున్న చిత్రం కాలేజ్ డేస్. గౌతమి పుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ దగ్గర పలు చిత్రాలకు కో-డైరెక్టర్ గా పని చేసిన రజినీకాంత్ . ఎన్నా ఈ చిత్రానికి దర్శకుడిగా వేవహరిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఘనం గా ప్రారంభం అయింది . సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీ లత మాట్లాడుతూ " మా శ్రీ లత సినీ క్రియేషన్స్ బ్యానర్ లో ఇది రెండో సినిమా . మొదటి చిత్రం ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది త్వరలో ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఈ చిత్రం ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. కథ చాల బాగుంది. అందరు కొత్త వాళ్ళతో

ఒక కాలేజీ బ్యాక్ డ్రాప్ లో మంచి మెస్సేజ్ తో యూత్ ని ఆకట్టుకునే విధంగా నిర్మిస్తున్నాం". ర్శకుడు రజినీకాంత్ . ఎన్నా మాట్లాడుతూ " డైరెక్టర్ క్రిష్ గారి బ్యానర్ లో చాల టీవీ ప్రోగ్రాం కి నేను కోడైరెక్టర్ గా పని చేశాను. వారు చేసిన కొని సినిమాలకి నేను కో-డైరెక్టర్ గా కూడా పని చేశాను. వారి బ్యానర్ లోనే ఒక్క సినిమా కి నాకు దర్శకత్వ అవకాశం ఇచ్చారు కానీ కొన్ని కారణాల వాళ్ళ సినిమా చేయడం కుదరలేదు . ఇప్పుడు నిర్మాత శ్రీ లత గారు నా కథ నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాల థాంక్స్ . నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం . హైదరాబాద్ పరిసరప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది . లంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ "తెలంగాణ ఆంధ్రా స్టూడెంట్స్ టాపిక్ తో వస్తున్నా చిత్రం ఈ కాలేజీ డేస్. ఒక హ్యాపీ డేస్ లాంటి గొప్ప చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను ".

తె

టాలీవుడ్ P 9


చా

లామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో టాలెంట్ నిరూపించుకొని బాలీవుడ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ… రియా చక్రవర్తి మాత్రం బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకొని తెలుగు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ లాంటి బిగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం హానర్ గా ఫీల్ అవుతున్నానంటోంది. త్వరలోనే ఓ భారీ చిత్రంలో నటించబోతున్న ఈ చిన్నది చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే…. అమ్మ‌గారు మంగ‌ళూరు, నాన్న‌దేమో బెంగాల్‌. నాన్న ఆర్మీ ఆఫీస‌ర్‌. నేను పూణేలో పుట్టి పెరిగాను. తెలుగులో తూనీగ తూనీగ సినిమా చేసిన త‌ర్వాత `మేరీ డాడ్ కి మారుతి`, సోనాలి కేబుల్ సినిమాల్లో న‌టించాను. అలా వ‌రుసగా బాలీవుడ్‌లో అవ‌కాశాలు వ‌చ్చాయి. `హాప్ గర్ల్ ఫ్రెండ్`, `బ్యాంక్ చోర్` సినిమాల్లో నటించాను. ఆ రెండు సినిమాలు నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ రెండు సినిమాల్లో నా పాత్ర‌కు పెర్ ఫార్మెన్స్ పరంగా మంచి పేరు వచ్చింది. రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి.బ్యాంక్‌చోర్ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర చేశాను. సినిమాలో కామెడి ప్ర‌ధానంగా సాగుతుంది. ప్ర‌స్తుతం నేను థియేటర్ గ్రూప్ లో యాక్టింగ్ నేర్చుకున్నాను. బెల్లీ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఫిట్ నెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ… నా పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోయినా… కథలో కొత్తదనం లేకపోయినా ఒప్పుకోలేదు. నాకు తెలుగులో మంచి పాత్రల్లో కనిపించాలని ఉంది. విద్యాబాలన్, అనుష్క నాకు బాగా నచ్చే హీరోయిన్స్. తెలుగులో రానా, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే ఇష్టం. నేను కథలు కూడా రాస్తాను. డైరెక్షన్ చేయలేను. కానీ నాకు అనిపించిన స్టోరీస్ రాస్తుంటాను. తెలుగులో ఓ మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాను. క్వాన్ నాకు ఆ అవకాశం ఇప్పించింది. యంగ్ హీరోస్ లో మంచి పేరున్న హీరోతో చేయడం నా అదృష్టం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ చెబుతాను. ప్రస్తుతం నా కాన్ సన్ ట్రేషన్ అంతా తెలుగు వైపే ఉంది. దీనికోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. అని అన్నారు.

మా



 10 P టాలీవుడ్


 హ



రీష్‌ని హీరోగా పరిచయం చేస్తూ అవంతిక హీరోయిన్‌గా ఆర్‌.జె. సినిమాస్‌బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. డి.జె. వసంత్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. 'భానుమతి.. భానుమతి', 'కమాన్‌ కంట్రీ చిలకా..', 'ప్రార్థిస్తానే..', వైశాఖం టైటిల్‌ సాంగ్‌.. ఇలా అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ చిత్రం పోస్టర్స్‌, ట్రైలర్‌కి ట్రెమండస్‌రెస్పాన్స్‌వస్తోంది. సోషల్‌మీడియాలో 'వైశాఖం' థీమ్‌టీజర్‌కి 31 లక్షల 50 వేలు వ్యూస్‌క్రాస్‌చేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా జూన్‌ 30న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో 'వైశాఖం' ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువసామాట్ర్‌ నాగచైతన్య 'వైశాఖం' చిత్రంలోని పాటల్ని, థియేట్రికల్‌ ట్రైలర్‌ని వీక్షించి చిత్ర యూనిట్‌ని అభినందించి 'వైశాఖం' ప్రోమోస్‌ని రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో హరీష్‌, హీరోయిన్‌ అవంతిక, డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, నిర్మాత బి.ఎ.రాజు, కెమెరామెన్‌వాలిశెట్టి వెంకట సుబ్బారావు, లైన్‌ప్రొడ్యూసర్‌

యు

బి.శివ, కమెడియన్స్,‌ భద్రమ్‌, విఘ్నేష్‌పాల్గొన్నారు. వసామ్రాట్‌ నాగచైతన్య మాట్లాడుతూ ''ఫస్ట్‌ రాజుగారికి థాంక్స్‌ చెప్పాలి. సినిమా రిలీజ్‌ విషయంలోగానీ, పబ్లిసిటీ విషయంలోగానీ, నాకు, అక్కినేని ఫ్యామిలీకి ఆయన ఇచ్చిన సపోర్ట్,‌ ఎంకరేజ్‌మెంట్‌కి ఎన్ని థాంక్స్‌ చెప్పినా సరిపోదు. సాంగ్స్‌ చూస్తుంటే మంచి కంటెంట్‌ వుందనిపిస్తోంది. మీ బేనర్‌లో ఇంకో మంచి సినిమా అవుతుందని బాగా నమ్ముతున్నాను. 'వైశాఖం' వంటి మంచి సినిమా చేసిన జయగారికి కంగ్రాట్స్‌. సాంగ్స్‌ అన్నీ చూశాను. విజువల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా వున్నాయి. ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌ ఫెంటాస్టిక్‌గా చేశారు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయి. హరీష్‌, అవంతిక లుక్స్‌సూపర్‌. ఈ సినిమాతో ఇద్దరు న్యూ కమర్స్‌ని ఇంట్రడ్యూస్‌చేయడం చాలా హ్యాపీగా వుంది. న్యూ టాలెంట్‌ వస్తేనే ఇండస్ట్రీలో మంచి సినిమాలు వస్తాయి. ఇండస్ట్రీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. హీరో, హీరోయిన్‌ ఇద్దరికీ బ్రైట్‌ ఫ్యూచర్‌ వుంటుంది. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. 'వైశాఖం' సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్‌వుంటే ఆర్‌.జె. సినిమాస్‌బేనర్‌లో సినిమా చేస్తాను'' అన్నారు.

టాలీవుడ్ P 11


 సూ



పర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెకర్ ్ట ‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్పె ‌ క్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న '2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌వర్క్‌జరుపుకుంటోంది. చిత్ర విశేషాలను లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలియజేస్తూ - ''షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ జరుగుతోంది. హాలీవుడ్‌స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అదే స్థాయిలో ప్రేక్షకుల దగరి ్గ కి తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. '2.0' చిత్రానికి సంబంధించిన ప్రచారంలో భాగంగా వరల్డ్‌

12 P టాలీవుడ్

టూర్‌ప్లాన్‌ప్లాన్‌చేశాం. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశాం. ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నార. దీపావళికి '2.0' ఫస్ట్‌లుక్‌ను, ప్రోమో టీజర్‌ను విడుదల చేసి, రజనీకాంత్‌గారి పుట్టినరోజున ట్రైలర్‌ రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశార. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోను అక్టోబర్‌లో దుబాయ్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌చేస్తున్నార'' అన్నారు. పర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

సూ


 లె

జెండ్ చిత్రంలో విలన్ గా జగపతిబాబు నటించగా , తాజాగా బాలయ్య నటించనున్న 102 వ చిత్రంలో విలన్ గా మరో సీనియర్ హీరో శ్రీకాంత్ నటించనున్నాడు . వందకు పైగా చిత్రాల్లో నటించిన ఫ్యామిలీ చిత్రాల హీరో గా శ్రీకాంత్ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు . అయితే కెరీర్ తొలినాళ్ళ లో శ్రీకాంత్ విలన్ పాత్రలే చేసాడు , ఆ తర్వాత హీరో అయ్యాడు . కట్ చేస్తే మళ్ళీ ఇన్నాళ్లకు బాలయ్య సినిమాలో విలన్ గా మారాడు . మిళ దర్శకులు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించనున్న చిత్రంలో బాలయ్య హీరో కాగా శ్రీకాంత్ విలన్ . ఇక నయనతార హీరోయిన్ . ఈ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ మరో టర్న్ తీసుకోవడం ఖాయం అని అంటున్నారు .

టాలీవుడ్ P 13


మిళ స్టార్ హీరో విజయ్ తాజాగా తమిళంలో '' మెర్సల్ '' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . తెలుగులో పలు డబ్బింగ్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ '' తేనాండాల్ ఫిలిమ్స్ '' విజయ్ నటిస్తున్న చిత్రాన్ని నిర్మిస్తోంది , ఇక ఈ సినిమా ఆ సంస్థ కు ఎన్నో సినిమానో తెలుసా ...... ..... వందో సినిమా . దక్షిణ పథాన అద్భుతమైన చిత్రాలను నిర్మించిన తేనాండాల్ ఫిలిమ్స్ తాజాగా వందో చిత్రానికి శ్రీకారం చుట్టింది . మిళంలో మెర్సల్ గా వస్తున్న చిత్రాన్ని తెలుగులో '' అదిరింది '' అనే టైటిల్ తో డబ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ప్రముఖ దర్శకులు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత , కాజల్ , నిత్యా మీనన్ లు నటిస్తున్నారు .

14 P టాలీవుడ్










స్లిష్ టై స్టార్ అల్లు అర్జున్ ని ఆదుకున్నాడు హీరో నాని . అల్లు అర్జున్ ని నాని ఆదుకోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? జూన్23న దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే . అయితే అదే రోజున నాని నటించిన '' నిన్ను కోరి '' సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది కానీ నాని సినిమా రిలీజ్ కాకుండా తెరవెనుక మంత్రంగం నడిపించడంతో జూన్ 23న రిలీజ్ కావాల్సిన నాని సినిమా జూలై 7 కి వాయిదా పడింది . అంటే రెండు వారాల గ్యాప్ అన్నమాట .

లా రెండు వారాలు గ్యాప్ ఇవ్వడం వల్ల అల్లు అర్జున్ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది . సినిమాకు బాడ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేదు పైగా ఇది పెద్ద సినిమా కాబట్టి , కాస్త ఎంటర్ టైన్మెంట్ అలాగే పూజా హెగ్డే గ్లామర్ , అల్లు అర్జున్ యాక్షన్ కోసం ప్రేక్షకులు వస్తారు అని నమ్మకంగా ఉన్నారు. అదే నాని సినిమా రిలీజ్ అయ్యుంటే అల్లు అర్జున్ సినిమా పరిస్థితి మరోలా ఉండేది .

టాలీవుడ్ P 15




రా

జకీయాలకు రజనీకాంత్ సరిపోడని అతడు అన్ ఫిట్ అంటూ తేల్చి పడేసాడు బిజెపి నేత సుబ్రమణ్య స్వామి . తమిళనాడు కు చెందిన ఈ నేత రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని అంటున్నాడు అంతేకాదు రాజకీయాల్లో వేగంగా నిర్ణయాలు , సమర్థవతంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ అది రజనీ కి చేతకాదు కాబట్టి రాజకీయాల్లో రాణించలేడు అని కుండబద్దలు కొట్టాడు సుబ్రహ్మణ్యం . తకొద్ది రోజులుగా అభిమానులతో సమావేశమైన రజనీ యుద్దానికి సిద్ధం అంటూ రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ సంకేతం ఇచ్చిన విషయం తెలిసిందే . త్వరలోనే మరో విడత అభిమానులతో సమావేశం జరిపి తన పుట్టినరోజైన డిసెంబర్ 12న రాజకీయ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది . అయితే రజనీ రాజకీయ రంగ ప్రవేశాన్ని స్వాగతించాల్సింది పోయి సుబ్రమణ్య స్వామి వ్యతిరేకిస్తున్నాడు .

గ 16 P టాలీవుడ్


శ్రీ

నాద్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చ రవి, కిరాక్ అర్పి , రచన స్మిత్ , రుచి ప్రధాన పాత్రలో .. ఎ వి రమణ మూర్తి సమర్పణలో వి రవివర్మ దర్శకత్వంలో చిన్మయానంద ఫిలిమ్స్ పతాకం పై ఎస్. సరిత నిర్మిస్తున్న చిత్రం ''ఇదేం దెయ్యం''. 'ముగ్గురు అమ్మాయిలతో' అనే కాప్షన్ తో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ చిత్రం షూటింగ్ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్బంగా చిత్ర వివరాలను నిర్మాత ఎస్ . సరిత తెలియచేస్తూ .. ఈ మద్య హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ముక్యంగా ఈ తరహా చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఇదేం దెయ్యం చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ముగ్గురు అమ్మాయిలతో అన్నది ఉప శిర్షిక. ముగ్గురు యువకులు అనుకోకుండా వారికి ఆపద ఎదురైంది .. దాన్న్నుంచి ఎలా తప్పించుకున్నారు. వారు

తప్పించుకునే ప్రయత్నంలో జరిగే సంగటనలు చాలా ఫన్ గా ఉంటాయి. పూర్తీ స్తాయి కామెడి నేపద్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం.. హర్రర్ సినిమా అయినా కూడా ఫ్యామిలీ అందరు చూసేలా ఉంటుంది. హీరో శ్రీనాద్, జబర్దస్ట్ కమెడియన్స్ రచ్చ రవి , కిరాక్ అర్పి ల కామెడి గిలిగింతలు పెడుతుంది. ఇందులో ఐదు పాటలు ఉంటాయి. బాలు అందించిన మ్యూజిక్, రి రికార్డింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతలో షూటింగ్ పూర్తీ చేసాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు జరపనున్నాం అని తెలిపారు. జీవ, అనంత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం : బాలు స్వామి, కెమెరా : కృష్ణ ప్రసాద్, సహా నిర్మాతలు : రత్న శేఖర్, రామ్ కిషోర్, మధుసూదన్ , సౌజన్య , నిర్మాత : ఎస్ సరిత , దర్శకత్వం : వి . రవివర్మ .

 

టాలీవుడ్ P 17




సూ

పర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న రోబో సీక్వెల్ '' 2. 0 '' చిత్రాన్ని తెలుగులో ఏకంగా వంద కోట్ల కు అమ్మాలని చూస్తున్నారట . ఇప్పటికే పలువురు నిర్మాతలు పోటీపడి 60 కోట్ల వరకు పెట్టడానికి ముందుకు వచ్చారు కానీ రోబో సీక్వెల్ నిర్మాతలు మాత్రం 400 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా నిర్మిస్తున్నాం , తప్పకుండా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా కాబట్టి వంద కోట్లకు తక్కువగా ఇచ్చేది లేదని మంకు పట్టుపట్టి కూర్చున్నారట .

18 P టాలీవుడ్

వం

ద కోట్ల మీద ఉంటే కనీసం 70, 80 కోట్లు పలకడం ఖాయం లేదంటే తీరా సమయంలో ఎవరో ఒకరు రాకపోతారా అప్పుడే చూద్దాం అన్నట్లుగా ఉందట వాళ్ళ వ్యవహారం . అయితే మనోళ్లు మాత్రం ఎంత తొందరగా ఆ సినిమా హక్కులను సొంతం చేసుకుంటే అంత మంచిది అన్న ధోరణిలో ఉండటంతో ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు . ఒక డబ్బింగ్ సినిమాకు అంత రేటు పెట్టడం భావ్యమా ? అన్న చర్చ కూడా జరుగుతోంది కానీ మనవాళ్ళు వింటారా ?




టీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ఫిలిం ఇండ‌స్ర్టీ పై 28 శాతం జీఎస్ టీ విధిస్తు ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విధానంపై తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ తీవ్రంగా ఖండించారు. సినిమా అనేది సామాన్యుల‌కు , మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు రెండు గంట‌ల వినోందం అందించేది. అలాంటి సినిమాకు 28 శాతం జీఎస్ టీ విధించ‌డం అమానుషం. ఇప్పుడు చిన్న సినిమాకు 7 శాతం ట్యాక్స్, పెద్ద సినిమాకు 15 శాతం ట్యాక్స్, డ‌బ్బింగ్ సినిమాకు 20 శాతం ట్యాక్స్ ఉండేది. వాట‌న్నింటికీ క‌లిపి ఒకేలా 28 శాతం జీఎస్టీ చేయ‌డం స‌బ‌బు కాదు. కాబ‌ట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాలి. 10 శాతం జీఎస్ టీ చేయాల్సింది గా డిమాండ్ చేస్తున్నా. క‌మ‌ర్శియ‌ల్ గా ఉండే క్ల‌బ్స్ , క్యాసీనోలు, గుర్ర‌పు రేసుల‌కు విధించిన విధంగా, సినిమా ఇండ‌స్ర్టీ పై భారం మోప‌డం వ‌ల్ల చిన్న సినిమాలు నష్ట‌పోతాయి.

తా

జాగా మ‌ళ్లీ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని రాష్ర్ట హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే ఇండ‌స్ర్టీలో ఉండే 4.5 సోకాల్డ్ కార్పోరేష‌న్ లో ప‌ద్ద‌తిని తీసుకురావ‌డం దుర‌దృష్ట క‌రం. బిగ్‌ స్క్రీన్‌ టిక్కెట్‌ ధరలు రూ.300 అవుతుండ‌గా, మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధర రూ. 200లకు చేరనుంది. సాధారణ ఏసీ థియేటర్‌లో బాల్కనీ టిక్కెట్‌ ధరను రూ. 120 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ టిక్కెట్టు ధర రూ.80 నుంచి 100 వరకూ ఉంది. కనీస టిక్కెట్టు ధరను రూ. 40గా నిర్ణయించారు. ఇంతవరకూ ఇది రూ. 20గా ఉంది. దీంతో సినిమా వినోదం మ‌ధ్య‌త‌ర‌గ‌తి..దిగువ త‌ర‌గ‌తి కుటుంబాల‌కు భారం కానుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణం ఈ ధ‌ర‌లను త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే సినిమా ఇండ‌స్ర్టీని పీడిస్తోన్న థియేట‌ర్ లీజ్ విధానం, డిజిట‌ల్ దోపీడి, రూ7 మెయింట‌నెన్స్ వ‌ల్ల చిన్న సినిమాలు భారీ గా న‌ష్ట‌పోతాయని ధ్వ‌జ‌మెత్తారు.






  గ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం” . ప్ర‌స్తుతంజార్జియాలో ఎంగురి డ్యామ్‌లో ఇప్పుడు గ‌రుడ వేగ టీం సంద‌డి చేస్తుంది. జార్జియా దేశానికి మూడొంతులు పైగా ఎల‌క్ట్రిసిటీ, తాగునీటిని స‌రఫ‌రా చేసే డ్యామ్ ఇది. జార్జియా ప‌శ్చిమాన ఉన్న ఈ డ్యామ్ ప్ర‌పంచంలోనే 6వ ఎత్తైన (271.5 మీ లేదా 891 అడుగులు) డ్యామ్. ఈ ప్రాంతంలో ఏడు రోజుల పాటు యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. పారాచ్యూట్స్‌, మిల‌ట‌రీ విమానాలు, ఎం-16 మెషీన్స్ స‌హా భారీగా పేలుడు ప‌దార్థాల‌ను ఉప‌యోగిస్తున్నారు. జార్జియా అధికారులు, డ్యామ్ అధికారులు యూనిట్‌కు స‌హకారం అందిస్తున్నారు. డ్యామ్ చీఫ్ ఇన్‌చార్జి జాన్ ఛ‌నియా ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తుండ‌టం విశేషం. అంతే కాకుండా 4 డిగ్రీల చ‌లిలో ముప్పై మైళ్ళ వేగంతో గాలులు వీస్తుంది. ఈ ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా యూనిట్ స‌భ్యులు ఎంతో క‌ష్ట న‌ష్టాల‌కోర్చి సినిమా షూటింగ్ చేస్తున్నారు. జ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ గృహిణి పాత్ర‌లో న‌టిస్తుంది. జార్జ్ అనే క‌రుగుగ‌ట్టిన విల‌న్ పాత్ర‌లో కిషోర్ స‌హా నాజ‌ర్‌, పోసాని కృష్ణము ‌ ర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌,

రా

చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌ది త‌రులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేక‌ప్ః ప్ర‌శాంత్‌, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ః శ్రీనివాస‌రావు ప‌లాటి, సాయి శివ‌న్ జంప‌న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః ముర‌ళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ః బాబీ అంగార‌, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌న్ః సి.వి.రావ్‌(అన్న‌పూర్ణ స్టూడియోస్‌), స్టంట్స్ః స‌తీష్‌, నుంగ్‌, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫ‌ర్ః విష్ణుదేవా, ఎడిట‌ర్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ర‌చ‌నః ప్ర‌వీణ్ స‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, స‌మ‌ర్ప‌ణః శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణంః జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్ర‌ఫీః అంజి, సురేష్ ర‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ప్రొడ్యూస‌ర్ః ఎం.కోటేశ్వ‌ర్ రాజు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.




నుష్ హీరోగా నటించిన విఐ పి 2లో బాలీవుడ్ భామ కాజోల్ కూడా నటించిన విషయం తెలిసిందే . అయితే కాజోల్ నటిస్తోంది అనగానే ఏదో ప్రాముఖ్యత ఉన్న పాత్రే అని అనుకున్నారు కట్ చేస్తే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ వల్ల తెలుస్తున్న విషయం ఏంటంటే ...... కాజోల్ పాత్ర విలన్ అని . నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రని కాజోల్ చేత చేయించడం అంటే సినిమాకు బాగా ప్లస్ అవుతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు . మర్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరం అయ్యింది , పిల్లలు కాస్త పెద్దకాగానే మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది . 43 ఏళ్ల వయసులో కూడా తరగని అందంతో అలరిస్తున్న కాజోల్ విఐ పి 2లో విలన్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి .

గ్లా

టాలీవుడ్ P 23




స్వ

రచక్రవర్తి స్వర్గీయ చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి శివకాశీపురం చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు . వారసుల రాజ్యం లోకి మరో వారసుడు తెరంగేట్రం చేస్తున్నాడు . చక్రవర్తి సంగీత దర్శకుడి గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే . అలాగే చక్రవర్తి తనయుడు శ్రీ కూడా సంగీత దర్శకుడిగా పలు చిత్రాలకు పనిచేసాడు . చక్రవర్తి సంగీతం అందించడమే కాకుండా పలు చిత్రాల్లో నటించాడు కూడా , కాగా చక్రవర్తి మనవడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి కి తాత లాగే నటన పై మక్కువ ఏర్పడటం తో నటనలో తర్ఫీదు పొందాడు . సినిమాలపై ఆసక్తి ఉన్న రాజేష్ శివ కాశీపురం చిత్రంతో

24 P టాలీవుడ్

సా

అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు . యి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై పులిమామిడి మోహన్ బాబు నిర్మిస్తున ఈ చిత్రం ద్వారా హరీష్ వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . యదార్థ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న శివకాశీపురం చిత్రం షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై నెలాఖరున లేదా ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . పవన్ శేష సంగీతం సమకూర్చగా జై రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందించాడు .


శ్రీ

కార్తికేయ స‌మ‌ర్ప‌ణ‌లో పి.యు.కె ప్రొడ‌క్ష‌న్స్ పై నిర్ణ‌యం దీపిక్ కృష్ణన్ ‌ నిర్మిస్తున్న చిత్రం `తొలి ప‌రిచ‌యం`. వెంకీ, లాస్య నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ముర‌ళీ మోహ‌న్, సుమ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇంద్రగంటి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో వేడుక కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీ మోహన్ బిగ్ సీడీనీ, సీడీల‌ను ఆవిష్క‌రించి చిత్ర యూనిట్ కు అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ` మంచి న‌టులున్నారు. మూడు పాట‌లు బాగున్నాయి. ట్యూన్స్ క్యాచీగా ఉన్నాయి. హీరో, హీరోయిన్లు క‌థ‌కు బాగా కుదిరారు. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు రావాలి` అని అన్నారు. ` అధ్య‌క్షులు శివాజీ రాజా మాట్లాడుతూ, ` ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ మంచి ప్ర‌య‌త్నం చేశాడు. తూర్పుగోదావ‌రి అందాల‌ను సినిమాలో బాగా చూపించారు. కెమెరా ప‌నిత‌నం బాగుంది. సినిమా విజ‌యం సాధించింది భ‌విష్య‌త్ లో టీమ్ అంద‌రికీ మంచి అవ‌కాశాలు రావాలి` అని అన్నారు. గీత ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మాట్లాడుతూ, ` నేను పుట్టింది సంగీత కుటుంబంలో పుట్టి పెరిగాను. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ గారి నాకు బ్ర‌ద‌ర్ అవుతారు. అయితే ఈ ఛాన్స్ ద‌ర్శక‌ నిర్మాతల ‌ వ‌ల్లే ఈ ఛా న్స్ వచ్చింది. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి జ‌న‌సేన అధికారిక సాంగ్ ను నేనే కంపోజ్ చేశాను. అలాగే తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ దినోత్స‌వం సాంగ్ కూడా చేశాను. గాయ‌కుడిగా నేష‌నల్ ‌ లెవ‌ల్ లో గోల్డ్

మెడ‌ల్స్ వ‌చ్చాయి. అలాగే వేటూరి గారితో నా ప్ర‌యాణం కొన‌సాగింది. ఆయ‌న వ‌ల్ల సాహిత్యం పై మంచి ప‌ట్టు వ‌చ్చింది. ఈ సినిమాలో సింగ‌ర్ గా..లిరిక్ రైట‌ర్ గా..సంగీత ద‌ర్శకు ‌ డిగామూడు పాత్ర‌లు పోషించాను. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌, నిర్మాతల ‌ ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా` అని అన్నారు. ర్శ‌కుడు రాధాకృష్ణ మాట్లాడుతూ, ` ముర‌ళీ మోహ‌న్ గారు క‌థ విని బాగుంద‌ని ప్ర‌శంసించారు. అదే సినిమాకు తొలి స‌క్సెస్. ఆయ‌న చేతుల మీదుగా మా సినిమా ఆడియో వేడుక జ‌ర‌గడం ఆనందంగా ఉంది. నిర్మాత‌లు ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుడా నిర్మించారు. సినిమా బాగా వ‌చ్చింది. పాట‌లు, సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు. త్ర స‌హ నిర్మాత సురేష్ కుమార్ మాట్లాడుతూ, ` చ‌క్క‌టి క‌థ , క‌థ‌నాల‌తో సినిమా తెర‌కెక్కుతోంది. మంచి ఆర్టిస్టులు కుదిరారు. పాట‌ల‌న్నీ సంద‌ర్భాను సారంగా ఉంటాయి. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులంతా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు. వేడుక‌లో మ‌ల్కాపురం శివ‌కుమార్, రాజ్ కందుకూరి, చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో రాజీవ్ క‌న‌కాల‌, ర‌ఘుబాబు, చ‌త్ర ప‌తి శేఖ‌ర్, వైవా హ‌ర్ష‌, రాగిణి, మ‌ధుమ‌ణి, ప్రీతి నిగ‌మ్ , క‌ళ్ళ కృష్ణారావు, సుర‌భీ దీప్తి, మాధ‌వి న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు: చం‌ద్రబోస్, కాస‌ర్ల శ్యామ్, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కొరియోగ్ర‌ఫీ: కృష్ణారెడ్డి, ఎడిటింగ్ఐ కృష్ణపు ‌ త్ర‌, నేప‌థ్య సంగీతం: వంళదేమాత‌రం శ్రీనివాస్, కెమెరా: శ్రా వ‌ణ్ కుమార్, స‌హ నిర్మాత‌లు సురేష్ కుమార్.

ద‌

`మా

చి

సం

 

టాలీవుడ్ P 25




యా

క్షన్ కింగ్ అర్జున్ చిత్ర పరిశ్రమకు పరిచయమై అప్పుడే 36ఏళ్ళు అవుతోంది . ఈ 36 ఏళ్లలో అర్జున్ 150 సినిమాల్లో నటించాడు . తాజాగా కురుక్షేత్రం లో నటించాడు అర్జున్, ఈ సినిమా అతడికి 150వది కావడం విశేషం . సైకో థ్రిల్లర్ కథాంశం తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు . హీరోయిన్ స్నేహ భర్త నటుడు ప్రసన్న మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు . రుణ్ వైద్యనాధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ పతాకంపై ఉమేష్ , సుధాన్ ,జయరాం , అరుణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు . ఇదే నెల లో రిలీజ్ కానున్న ఈ చిత్రం పై అర్జున్ నమ్మకంగా ఉన్నాడు . 150వ సినిమా కావడం, గతకొంత కాలంగా అర్జున్ కు సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు

26 P టాలీవుడ్




రెం

డు ద‌శాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌. ఎన్నో బ్లాక్‌బ‌సర్‌ ్ట‌ సినిమాల సంగీతాన్ని విడుద‌ల చేసి మ్యూజిక‌ల్ వ‌రల్డ్ లో త‌న‌కంటూ స‌ముచిత స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సంస్థ అధినేత ఉమేశ్ గుప్తా . ఆయ‌న‌కు తెలుగు ప‌రిశ్ర‌మతో ‌ విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. సినీ ప్ర‌ముఖులు అంద‌రితోనూ స‌త్సంబంధాలున్నాయి. రెండు ప‌దుల ఏళ్లు సినిమా రంగాన్ని అతి ద‌గర‌ ్గ‌ గా ప‌రిశీలించిన అనుభ‌వంతో ఆయ‌న తొలిసారి ప్రొడ‌క్ష‌న్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. అందులో భాగంగా త‌మిళ్‌లో రూపొందుతున్న ఓ చిత్రాన్ని ప్ర‌ప్ర‌థ‌మంగా తెలుగులో డ‌బ్ చేస్తున్నారు. కార్తి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ కాంబినేష‌న్‌లో త‌మిళంలో తెర‌కెక్కుతున్న `ధీర‌న్ అధిగార‌మ్ ఒండ్రు` అనే చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ ```చ‌తురంగ వేట్టై` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన హెచ్‌.వినోద్ ద‌ర్శక‌ ‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ధీర‌న్ అదిగార‌మ్ ఒండ్రు`. ఆ చిత్రానికి తెలుగులో `ఖాకి` అనే టైటిల్ పెట్టాం. ద ప‌వర్ ‌

ఆఫ్ పోలీస్ అనేది శీర్షిక‌. ఒక పాట‌, వారం రోజుల టాకీ పార్టు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఆగ‌స్టు నెలాఖ‌రున‌గానీ, సెప్టెంబ‌ర్‌లోగానీ సినిమాను విడుద‌ల చేస్తాం. జిబ్రాన్ విన‌సొంపైన‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 2005లో ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన రియ‌ల్ ఇన్సిడెంట్‌ని ఆధారంగా చేసుకుని ఈ కథ తయారు చేసారు . ఎక్స్ ట్రార్డిన‌రీ కాన్సెప్ట్. క‌థ విన‌గానే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ క‌థ‌ను అందించాల‌ని ఈ సినిమా రైట్స్ తీసుకున్నాను. కార్తి ప‌వ‌ర్‌ఫుల్ కేర‌క్ట‌ర్లో క‌నిపిస్తారు. మ‌న ద‌గర ్గ‌ టాప్ హీరోలంద‌రూ పోలీస్ డ్ర‌స్సుల్లో మెప్పించిన వారే. కార్తీ కూడా మ‌న `విక్ర‌మార్కుడు` త‌మిళ వెర్ష‌న్‌లో పోలీస్ గెట‌ప్‌లో చేసి స‌క్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకుని చేస్తున్నారు`` అని అన్నారు. అభిమ‌న్యు సింగ్‌, బోస్ వెంక‌ట్‌, స్కార్లెట్ మెల్లిష్ విల్స‌న్ ఇత‌ర పాత్ర‌ధారులు. చిత్రానికి కెమెరా: స‌త్యన్ సూర్య‌న్, ఆర్ట్: కె.ఖ‌దీర్‌, ఎడిట‌ర్‌: శివ‌నందీశ్వ‌ర‌న్‌, ఫైట్స్: దిలీప్ సుబ్బ‌రాయ‌న్,‌ డ్యాన్స్: బృంద‌, నిర్మాతలు : ఉమేశ్ గుప్తా,సుభాష్ గుప్తా.

టాలీవుడ్ P 27




సు

ప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. . ఇప్ప‌టికే టాకీ పార్టు పూర్తిచేసుకుని షూటింగ్ చివరి షెడ్యూల్ కి సిద్దమ ‌ ‌వుతుంది. విడుద‌ల చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్ కి, మెద‌టి లుక్ పోస్ట‌ర్ కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జ‌వాన్ అంటే అస‌లు ఏలాంటి క‌థ అనే చర్చ అటు అభిమానుల్లోను, ఇటు ప్రేక్ష‌కుల్లో ను ఆశ‌క్తి నెల‌కొంది. హీరో సెల్‌ఫోన్ ప‌ట్టుకుని ఎమెష‌న‌ల్ గా వుండ‌టం, మోబైల్ లో ఓ ఫ్యామిలి ఫోటో వుండ‌టం చూస్తే ఇది పక్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ అనిపించేలా వుంద‌ని కొంత‌మంది అంటుంటే.. రో హ్యండ్‌స‌మ్ గా హ‌కీ స్టిక్ ప‌ట్టుకుని కాలేజ్ గేట్ ద‌గ్గ‌ర బైక్ మీద స్టైలిష్ గా నిల్చున్న స్టిల్ చూసి ఇది ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని కొంత‌మంది అంటున్నారు. అయితే ఇది ప‌క్కాఫ్యామిలి స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపోందుతుందని యూనిట్ స‌బ్యులు చెబుతున్నారు. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబ‌ర్ 1న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ర్మాత కృష్ణ మాట్లాడుతూ.... ద‌ర్శ‌కుడు బివిఎస్ రవి చెప్పిన కథ చెప్పిన‌ట్టే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెర‌కెక్కించాడు. మా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్

హీ

ని

28 P టాలీవుడ్

హీరోయిన్ మెహ‌రిన్ లు స్రీన్ మీద చాలా అందంగా వుంటారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. చిత్రానికి సంభందించి మిగిలిని షూటింగ్ పార్ట్ ని జులైలో, అన్నికార్య‌క్రమా ‌ లు అగ‌ష్టులో కంప్లీట్‌చేసి సెప్టెంబ‌ర్ 1న చిత్రాన్ని విడుదల చేస్తాము. ర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ... జ‌వాన్ చిత్రం కాన్సెప్ట్ ఎంట‌ని అంద‌రూ అడుగుతున్నారు. మా మెద‌టిలుక్ అంద‌రిలో ఆ క్యూరియాసిటి తెచ్చింది. మాస్ క‌మ‌ర్షియ‌ల్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ని ఎలా చూపించ‌బోతున్నారు అని అటు ఫ్యాన్స్‌, ఇటు ఇండ‌స్ట్రి ఫ్రెండ్స్ చాలా ఇంట్ర‌స్ట్ గా అడుగుతున్నారు. చాలా మంచి కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతుంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్ప‌టివ‌ర‌కూ చెయ్య‌ని ఓ మంచి పాత్ర‌లో చేస్తున్నాడ‌నేది మాత్రం చెప్ప‌గ‌లను ‌ . దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని మ‌నోదైర్యంతో త‌న బుద్దిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే మా కాన్సెప్ట్. ఇది పక్కా ఫ్యామీలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రసన్న మెయిన్ విలన్ గా నటించారు. చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.




టసింహం నందమూరి బాలకృష్ణ ని టార్గెట్ చేశారు మహేష్ బాబు, ఎన్టీఆర్ లు. బాలయ్య సినిమా పైసా వసూల్ ప్రారంభం రోజునే సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసి కూడా బాలయ్య తో పోటీపడుతున్నారు మహేష్ , ఎన్టీఆర్ లు. హేష్ తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ జై లవకుశ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 21న రిలీజ్ చేస్తున్నారు. అంటే బాలయ్య సినిమాకు సరిగ్గా వారం రోజుల ముందు ఒకరు , రెండు రోజుల ముందు ఒకరు వస్తున్నారు. దాంతో బాలయ్య సినిమాకు కష్టాలు రావడం ఖాయం .

టాలీవుడ్ P 29




 సా

యిరోన‌క్‌, శ్రావ్య, శిరీష వంక హీరో హీరోయిన్లుగా డు గుడ్ ఫాలో రైట్ ప్రొడ‌క్షన్ ‌ స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం `మ‌సక‌ ్క‌లి`.న‌బి ఏనుగుబ‌ల(‌మ‌ల్యాల‌) ద‌ర్శ‌కత ‌ ్వంలో సుమిత్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. ఈ సంద‌ర్భంగా.. త్ర నిర్మాత సుమిత్ సింగ్ మాట్లాడుతూ - ``మ‌సక్క‌లి చిత్రం ఒక స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కథ ‌ ‌. మా బ్యాన‌ర్‌లో రూపొందుతున్న తొలి చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు న‌బి ఏనుగుబ‌ల సినిమాను చాలా చక్క‌గా తెర‌కెక్కించారు. ప్ర‌తి స‌న్నివేశం విజువ‌ల్‌గా ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. మిహిరామ్స్ సంగీతం, సుభాష్ దొంతి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది. మ్యూజికల్‌గా సినిమా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. అలాగే అద్భుతమై ‌ న‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరింది. సాయిరోన‌క్‌, శ్రావ్య, శిరీష వంక‌ తెర‌పై చూడ చ‌క్క‌గా ఉంటుంది. సినిమాలో ప్ర‌తి పాత్ర‌కు చాలా ముఖ్య‌త్వం ఉంటుంది. సినిమాను చూసే ఆడియెన్స్ మంచి అనుభూతికి లోన‌వుతారు. ఈ నెల‌లో ఆడియో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అని తెలిపారు. యిరోనక్‌, శ్రావ్య‌, శిరీష వంక‌, కాశీ విశ్వ‌నాథ్‌, న‌వీన్ నేని, చ‌మ్మ‌క్ చంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ః శివ శ‌ర్వాణ‌, సంగీతంః మిహిరామ్స్,‌ సినిమాటోగ్ర‌ఫీః సుభాష్ దొంతి, నిర్మాతః సుమిత్ సింగ్‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః న‌బి ఏనుగుబ‌ల(‌మ‌ల్యాల‌).

చి

సా 30 P టాలీవుడ్


రాం

చరణ్ తేజ్ చేయాల్సిన సినిమా ఇప్పుడు నాని చేతుల్లోకి వచ్చిందట . చరణ్ సినిమా చేయడం ఆలస్యం చేయడంతో ఎక్కువ రోజులు ఎదురు చూడటం ఇష్టం లేక నాని దగ్గరకు వెళ్ళాడట దర్శకులు మేర్లపాక గాంధీ . నాని కి కథ చెప్పడం వెంటనే ఓకే చేయడం చక చకా జరిగిపోయాయట అంతే సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అయ్యింది ఆ కథ . వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ , ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో వరుసగా రెండు హిట్ లను కొట్టాడు మేర్లపాక గాంధీ . క నాని కూడా గత కొంతకాలంగా వరుస విజయాలు సాధిస్తున్నాడు . ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు ట్రిపుల్ హ్యాట్రిక్ కి నిన్ను కోరి తో శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాడు . ధృవ వంటి సూపర్ హిట్ తర్వాత చరణ్ ఈ సినిమా చేయాలి కానీ నాని కి రాసి పెట్టి ఉంది కాబట్టి చరణ్ ని మిస్ అయ్యింది .



టాలీవుడ్ P 31






భా

రతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది అమీర్ ఖాన్ దంగల్ చిత్రం . ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్ల కు పైగా వసూళ్ల ని సాధించి మొట్ట మొదటి భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది దంగల్ . మొదట భారత్ లో ఈ చిత్రం 750 కోట్ల వసూళ్ల ని సాధించింది అయితే ఇటీవల చైనాలో భారీ ఎత్తున 6500 స్క్రీన్ లలో రిలీజ్ అయ్యింది . మొత్తం ఎనిమిది వారాల్లో 1255 కోట్ల ని వసూల్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది . శీయ మార్కెట్ లో ఒకలా చైనాలో రెచ్చిపోయి 1255 కోట్ల కలెక్షన్ల ని సాధించడంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోతున్నారు . చైనాలో క్రీడా స్ఫూర్తి ఎక్కువ కావడం ఈ చిత్రం మహిళా సాధికారత తో పాటు క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి బాక్సాఫీస్ ని బద్దలు కొడుతోంది

దే

32 P టాలీవుడ్


    హీ

రో విశాల్ వదిన మాజీ హీరోయిన్ అయిన శ్రేయా రెడ్డి మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది . తెలుగు , తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శ్రేయా రెడ్డి అయితే అనుకున్న రేంజ్ లో మాత్రం విజయం సాధించలేక పోయింది అయితే అదే సమయంలో విశాల్ సరసన నటిస్తున్న సమయంలో విశాల్ అన్న విక్రమ్ కృష్ణ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది 2008 లో . ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది . యితే గతకొద్ది రోజులుగా మళ్ళీ సినిమాల్లో నటించాలనే ఉత్సాహం మొదలయ్యింది శ్రేయా రెడ్డి లో సరిగ్గా అదే సమయంలో రాజ్ కుమార్ - సతీష్ కుమార్ లు నిర్మించే '' అండవ కానోమ్ '' చిత్రంలో శ్రేయా రెడ్డి ని వరించింది అదృష్టం . ఇంకేముంది వెంటనే ఒప్పేసుకుంది . చిత్రీకరణ కూడా పూర్తయిన ఈ చిత్రాన్ని ఆగస్టు లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

టాలీవుడ్ P 33




కా

వలసినంత డబ్బు ఉంది దాంతో ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా సరే హీరోగానే నటిస్తున్నాడు సచిన్ జోషి . అపుడెపుడో పదిహేనేళ్ల క్రితం హీరోగా నటించాడు ఆ సినిమా డిజాస్టర్ ఆ తర్వాత కూడా తెలుగు , హిందీ లలో పలు చిత్రాల్లో నటించాడు , నిర్మించాడు కానీ ఒక్క సక్సెస్ అంటే ఒక్కటి కూడా లభించలేదు దాంతో కొంతకాలం ఆగి మళ్ళీ హీరోగా వస్తున్నాడు సచిన్ జోషి . గుట్కా వ్యాపారి అయిన సచిన్ కు టన్నుల కొద్దీ డబ్బులు ఉన్నాయి దాంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు . జాగా తెలుగు , తమిళ భాషలలో మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు ఇతగాడు . సినిమా సక్సెస్ కాకపోయినా సినిమా చేయాలనీ మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు సచిన్ . అందుకే వదల బొమ్మాలి అంటూ సినిమాలు చేస్తూనే ఉన్నాడు .

తా

34 P టాలీవుడ్


 రె

బల్ స్టార్ ప్రభాస్ తమన్నా కోసం ఏం చేస్తున్నాడో తెలుసా ....... బాలీవుడ్ సినిమాలో కేవలం చిన్న పాత్ర పోషిస్తున్నాడు . బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే సినిమా ఎలా ఉండాలి అసలు ........ కానీ ప్రభాస్ మాత్రం తనకు బాగా ఇష్టమైన తమన్నా అడగడంతో కాదనలేక పోయాడట ! అందుకే గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడానికి ఓకే చెప్పాడని అంటున్నారు . తమిళంలో ఘనవిజయం సాధించిన '' కొలై యుధిర్ కాలం '' చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు .

టాలీవుడ్ P 35


సూ

 



36 P టాలీవుడ్

పర్ స్టార్ మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో '' భరత్ అనే నేను '' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . సంక్రాంతి కానుకగా 2018 లో రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్ భామని దించారు దర్శక నిర్మాతలు . ఇంతకీ మహేష్ సరసన నటించే అందమైన భామ ఎవరో తెలుసా ....... కైరా అద్వానీ . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ '' ఎం ఎస్ ధోని '' ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో తనదైన ముద్ర వేసింది . తో ఈ భామని మహేష్ సరసన సెలెక్ట్ చేసారు దర్శక నిర్మాతలు . ప్రస్తుతం మహేష్ - కైరా అద్వానీ ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు కొరటాల . మహేష్ ముఖ్యమంత్రి గా నటిస్తున్న ఈ చిత్రం పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి ఎందుకంటే శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్ కొరటాల శివ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి .

దాం




సూ

పర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం తో అమెరికా వెళ్ళాడు . ఇప్పుడు తమిళనాట వినిపిస్తున్న గుసగుసలు ఇవి . రజనీకాంత్ అమెరికా వెళ్ళింది నిజమే ! అలాగే ఆరోగ్య పరీక్షల కోసమే అమెరికా వెళ్ళాడు కూడా అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం లేదు ఎందుకంటే నార్మల్ చెకప్ కోసం రజనీ యు ఎస్ వెళ్ళాడు . తన కూతురు ఐశ్వర్య ని తీసుకొని మరీ వెళ్ళాడు . క్కడ హెల్త్ చెకప్ అయ్యాక కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళ్లీ చెన్నై రానున్నాడు , ఇక్కడికి వచ్చాక కాలా షూటింగ్ లో పాల్గొననున్నాడు . పా . రంజిత్ దర్శకత్వంలో కాలా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే .

టాలీవుడ్ P 37




 అ

భిరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో రామ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై త‌రుణ్‌, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్‌గోపి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వి.ప్ర‌కాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా ల‌వ్‌స్టోరీ`. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సంద‌ర్భంగా.. రో త‌రుణ్ మాట్లాడుతూ - ``టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రేక్ష‌కల ‌ హృద‌యాల‌ను హ‌త్తుకునేలా ఈ బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీని ర‌మేష్‌గోపి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. శ్రీనాథ్ విజ‌య్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. ఆయ‌న అందించిన సాంగ్‌ను రేడియో సిటీలో విడుద‌ల చేశాం. పాట‌లు బాగా వ‌చ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రా ‌ ర్డిన‌రీగా కుదిరింది. సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మా ప్ర‌య‌త్నాన్ని ఆడియెన్స్ ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం`` అన్నారు. ర్శ‌కుడు ర‌మేష్‌గోపి మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌రుణ్‌గారు న‌ట‌న గురించి మేం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాలో ఆయ‌న న‌ట‌న‌లోని మ‌రో కోణాన్ని చూస్తారు. సినిమాకు శ్రీనాథ్ విజ‌య్ అందించిన సంగీతం, ఆర్‌.ఆర్‌ సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్ళింది. నిర్మాత ప్ర‌కాష్‌గారు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. సినిమా అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉంటుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం`` అన్నారు. జిక్ డైరెక్ట‌ర్ శ్రీనాథ్ విజ‌య్ మాట్లాడుతూ - ``ఒక మంచి ప్రేమ‌క‌థా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కావ‌డం ఆనందంగా ఉంది. అవ‌కాశం ఇచ్చిన హీరో త‌రుణ్‌, ద‌ర్శ‌కుడు ర‌మేష్‌గోపి, నిర్మాత ప్ర‌కాష్ గారికి థాంక్స్‌. పాట‌ల‌న్నీ చ‌క్క‌గా వ‌చ్చాయి. అంద‌రికీ న‌చ్చేలా ఉంటాయి`` అన్నారు.

హీ

ద‌

మ్యూ 38 P టాలీవుడ్




Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.