Tollywood Magazine Telugu December - 2017

Page 1

DECEMBER 2017 VOL 14 ISSUE 12

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET

            








ప్ర

ముఖ పారిశ్రామిక వేత్త , రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ క్లాప్ తో ప్రారంభమైంది '' రాయలసీమ లవ్ స్టోరీ ''. కర్నూల్ లోని మౌర్యా ఇన్ హోటల్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది . హీరో వెంకట్ , హీరోయిన్ లు హృశాలి , పావని లపై టీజీ వెంకటేష్ క్లాప్ నివ్వగా నర్వా రాజశేఖర్ రెడ్డి స్విచాన్ చేసారు , టీజీ వెంకటేష్ తనయుడు యువ నాయకుడు టీజీ భరత్ ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించారు . అనంతరం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ '' ఇన్నాళ్లు రాయలసీమ కథ లతో వచ్చిన సినిమాలన్నీ పగ , ప్రతీకారం అంటూ ఫ్యాక్షన్ ని మరింతగా రెచ్చగొట్టేలా సినిమాలు వచ్చాయి కానీ రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు నిండైన మనసున్న వాళ్ళు అని చాటి చెప్పడానికి ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలను నేను అభినందిస్తున్నాను . ఈ రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చిత్ర పరిశ్రమకి చెందిన వాళ్ళు ఎవరైనా కర్నూల్ లో స్టూడియో లు కడతామని ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహకరించడానికి మేమెప్పుడూ ముందుంటాం . పైగా అన్నిటికి అనువైన ప్రాంతం మా కర్నూల్ అంటూ దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు

అందజేశాడు . ర్మాతలు నాగరాజు , హుస్సేన్ , ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ '' రామ్ రణధీర్ చెప్పిన కథ మాకు నచ్చడంతో వెంటనే సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం , అలాగే రామ్ రణధీర్ లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ రాయలసీమ లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం . టీజీ వెంకటేష్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరింత సంతోషంగా ఉందన్నారు . ర్శకుడు రామ్ రణధీర్ మాట్లాడుతూ '' రాయలసీమ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి అయితే అవన్నీ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు కానీ మా ఈ చిత్రంలో మాత్రం పూర్తిగా విభిన్నమైన కోణంలో ఉంటుంది . ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం . ఇటీవల టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా మా సినిమా ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది . కర్నూల్ నగరంలో పది రోజుల పాటు మొదటి షెద్యూల్ జరుగుతుంది . నన్ను నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు రుణపడి ఉంటాను , తప్పకుండా మా సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు

ని


“BE MINDFUL WHEN IT COMES TO YOUR WORDS. A STRING OF SOME THAT DON’T MEAN MUCH TO YOU, MAY STICK WITH SOMEONE ELSE FOR A LIFETIME.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By

: : : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 DECEMBER 2017

టాలీవుడ్ P 3




 

యు

వ కథానాయకుడు శర్వానంద్, కాజల్, నిత్యామీనన్ ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం ఇటీవల హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో వైభవంగా ప్రారంభమయింది. థానాయకుడు శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్ని వేశానికి ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య అక్కినేని క్లాప్ నివ్వగా, కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. చిత్రం స్క్రిప్ట్ ను హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ చిత్ర దర్శక

4 P టాలీవుడ్

నిర్మాతలకు అందజేశారు.ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్. ఎన్.ప్రసాద్, జెమిని కిరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. చిత్రానికి సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్. నిర్మాత: సూర్యదేవర నాగవంశీ కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ


  

   `పం

చ‌మి` చిత్రంతో తొలి హిట్ అందుకున్న ఐడియా మూవీ క్రియేష‌న్స్ తాజాగా నిర్మిస్తోన్న చిత్రం `జ‌బ్బర ‌ ్థ‌స్త్ గ‌బ్బర్ ‌ సింగ్`. హ‌ర్ష హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. `స్వాతి చినుకులు` ఫేం ప్రియాంక నాయుడు, క‌న్న‌డ చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించిన అతిధి రాయ్ హీరోయిన్ల‌గా న‌టిస్తున్నారు. సుజాతా బౌరియా ద‌ర్శ‌కత ‌ ్వం వ‌హిస్తున్నారు. న‌రేంద‌ర్ గౌడ్, హ‌బీబీబ్ పాషా నిర్మిస్తున్నారు. శ్రీకోటి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌క నిర్మాతలు ‌ సినిమా అప్ డేట్ ను తెలిపారు. త్ర ద‌ర్శ‌కురాలు సుజాతా బౌర్య మాట్లాడుతూ,` నా తొలి సినిమా ఇదే బ్యాన‌ర్ లో తెర‌కెక్కించి హిట్ అందుకున్నాను. ద‌ర్శ‌కురాలిగా నాకు ఆ చిత్రంతో మంచి పేరు వ‌చ్చింది. రెండ‌వ ప్ర‌య‌త్నంగా జ‌బ్బ‌ర్థ్ ద‌స్త్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను కామెడీ హార‌ర్ నేప‌థ్యంతో తెర‌కెక్కిస్తాను. ఇప్ప‌టికే 75 శాతం చిత్రీక‌ర‌ణ క‌డ‌ప, క‌ర్నూల్ ప్రాంతాల్లో పూర్తిచేసాం. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. న‌టీన‌టులంతా చ‌క్క‌గా న‌టిస్తున్నారు. నిర్మాతలు ‌ బడ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా స‌హక‌ ‌రిస్తున్నారు. అందువ‌ల్లే సినిమా నేను అనుకున్న విధంగా చేయ‌గల్గుతున్నా. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. మిగ‌తా ప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం` అని అన్నారు. త్ర నిర్మా న‌రేంద‌ర్ గౌడ్ మాట్లాడుతూ,` కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా ఇది. కామెడీ

చి

చి

  స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. హార‌ర్ స‌న్నివేశాలు కొత్త అనుభూతినిస్తాయి. సుజాత గారు సినిమా త‌న‌దైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు కోటి మంచి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. అన్ని పాట‌లు హైలైట్ గా ఉంటాయి. ప్ర‌స్తుతం షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తాం. తెలుగు ప్రేక్ష‌కులంతా మా చిత్రాన్ని ఆదరిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు. గీత ద‌ర్శ‌కుడు శ్రీ కోటి మాట్లాడుతూ, `ఇప్ప‌టివ‌ర‌కూ 14 సినిమాల‌కు సంగీతం అందిచాను. అన్ని చిత్రాలు సంగీత ద‌ర్శ‌కుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. `పంచ‌మి` త‌ర్వాత మ‌ళ్లీ మూడు సంవ‌త్స‌రాల గ్యాప్ అనంత‌రం ఓ కొత్త కాన్సెప్ట్ తో మీ ముంద‌కు వ‌స్తున్నాం. హార‌ర్ కామెడీలో కొత్తద ‌ ‌న్నాన్ని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం. పాట‌ల‌న్నీ బాగా వ‌చ్చాయి. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి ఓ పాట‌ను రిమిక్స్ చేస్తున్నాం. మెగా ప్రేక్ష‌కాభిమానుల‌ను ఆ సాంగ్ విప‌రీతంగా ఆకట్టుకుంటుంది. వీలైనంత త‌ర్వ‌గా షూటింగ్..మిగ‌తా ప‌నులు పూర్తిచేసి సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు. త‌ర పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, త‌నికెళ్ల భ‌ర‌ణి, గౌతం రాజు, తాగుబోతు ర‌మ‌ష్, నాగ‌బాబు, చ‌మ్మ‌క్ చంద్ర‌, న‌రేష్, అశోక్ కుమార్, గుండు సుద‌ర్శ‌న్, గ‌బ్బర్ ‌ సింగ్ గ్యాంగ్, ఖాద‌ర్ గోరీ శాంతి మ‌హారాజ్, స‌జాయ్, చిత్రం శ్రీను, పూల‌రంగ‌డు బాలు,ఎగ్బాల్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు: కాస‌ర్ల శ్యామ్, మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్, మ‌ధు ప‌ల‌, కెమెరా: ర‌ఘు బార్లారి, ఎడిటింగ్: మ‌ల్లి, పీఆర్ఓ: శ‌్రీధ‌ర్

సం

టాలీవుడ్ P 5






యు

వ కథానాయకుడు నాగ శౌర్య నూతన చిత్రం నేడు (29-11-17) ఉదయం 10 గంటల 34 నిమిషాలకు సంస్థ కార్యాలయం లో ప్రారంభ మయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. అలాగే దర్శకుడు మారుతి , రచయిత కోన వెంకట్ లు చిత్రం స్క్రిప్ట్ ను చిత్ర దర్శక, నిర్మాతలకు అందచేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్,ఉపేంద్ర లు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ మన్యం ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నం గా నాగ శౌర్య కథానాయకుడు గా, ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రం ను నిర్మిస్తోంది. 'మేం వయసుకు వచ్చాం, ఆలా ఎలా, సుప్రీం, పిల్ల జమిందార్,

6 P టాలీవుడ్

ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రస్తుతం నాగ శౌర్య 'ఛలో ' చిత్రాలకు శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. దర్శకుడు సాయి శ్రీరామ్ చెప్పిన కధలోని నవ్యత, చిత్ర కధనం ఎంతగానో నచ్చి ఈ చిత్రం ను నిర్మిస్తున్నట్లు నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు. నాగ శౌర్య నటించిన చిత్రాలలో ఈ ప్రేమ కదా చిత్రం నిస్సందేహంగా వైవిధ్యాన్ని సంతరించు కుని ఉంటుందని తెలిపారాయన. చిత్ర నాయిక ఎవరన్నదానితోపాటు ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు. 2018, జనవరి నెల ప్రథమార్ధం లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని తెలిపారు. చిత్రానికి సంగీతం: రధన్, కధ : విద్యాసాగర్ రాజు మాటలు: విశ్వ నేత్ర, డి.ఓ.పి: హరిప్రసాద్ జాస్తి, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటర్: ప్రవీణ్ పూడి నిర్మాత: యం.విజయకుమార్ దర్శకత్వం: సాయి శ్రీరామ్




టు అభిమానులు..ఇటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న‌ 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` ఇటీవల అధికారికంగా సెట్స్ కు వెళ్లింది. హైద‌రాబాద్ లోనే నేటి నుంచి డిసెంబ‌ర్ 22 వ‌ర‌కూ సినిమా కోసం ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్స్ లో ఏక‌ధాటిగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. క్రేజీ చిత్రానికి స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌ ‌త్వం వ‌హిస్తున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫైట్ మాస్ట‌ర్ లీ విట్టేక‌ర్ సార‌థ్యంలో కీల‌క యాక్ష‌న్ సన్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నారు.ఈ హిస్టారిక‌ల్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీపై నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ P 7






ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల స‌క్సెస్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాతగా ‌ ..త‌న సెల‌క్ష‌న్ ఆఫ్ మూవీస్ గురించి చెప్ప‌క‌నే చెప్పిన దిల్‌రాజు..ఇదే ఏడాది విడుద‌ల కానున్న `ఎం.సి.ఎ` చిత్రంతో డ‌బుల్ హ్యాట్రిక్‌ను సాధించ‌నున్నారు. ఇదే ఊపులో వ‌చ్చే ఏడాది ఎన‌ర్టిటిక్ హీరో రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ 2017 ప్రారంభంలో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించిన `నేను లోక‌ల్‌` సినిమా ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు. రామ్ ఎన‌ర్జీకి, త్రినాథ‌రావు న‌క్కిన టేకింగ్‌, శ్రీ వెంకటేశ్వర

8 P టాలీవుడ్

క్రియేషన్స్ మేకింగ్ వాల్యూస్ తోడు కావ‌డం సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుందన‌డంలో సందేహం లేదు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ ప్రారంభం కానుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో చాలా కీలకమైన పాత్ర ఒకటి పోషిస్తున్నారు. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రం లో నటిస్తారు. ఈ చిత్రానికి కధ ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. సాయి కృష్ణ రచనా సహకారం అందిస్తారు. ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఇతర టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని నిర్మాణ సంస్థ తెలియ‌జేసింది




ప్ర

‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శక‌ ‌త్వంలో డా.శ్రీధ‌ర్ థ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టిపిఆర్ తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం `మేరా భార‌త్ మ‌హాన్‌`. అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ దర్శ‌కుడు బి.గోపాల్ క్లాప్ నివ్వ‌గా పాట‌ల ర‌చ‌యిత చంద్రబోస్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి మ‌రో ప్ర‌ముఖ దర్శ‌కుడు సాగ‌ర్ గౌర‌వ ద‌ర్శక‌ ‌త్వం వ‌హించారు. నంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర మాట్లాడుతూ...``స‌మ‌కాలీన అంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి ఓ సందేశాత్మ‌క చిత్రంగా `మేరా భార‌త్ మ‌హాన్‌` చిత్రాన్ని ముగ్గురు మిత్రులం క‌లిసి నిర్మిస్తున్నాం. గ‌తంలో ప‌లు సామాజిక అంశాల‌తో కూడిన చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భ‌ర‌త్ గారు ఈ చిత్రానికి ద‌ర్శక‌ ‌త్వం వ‌హిస్తున్నారు`` అన్నారు. ర్మాత‌ల్లో ఒక‌రైన‌ డా.తాళ్ల ర‌వి మాట్లాడుతూ...``దేశం బాగుప‌డాలంటే యువ‌త సంక‌ల్పించాలి. స‌మాజంలోని స‌మ‌స్య‌లను ‌ అరిక‌ట్టే బాధ్య‌త వారిదే కాబ‌ట్టి నేటి యువ‌త‌ను చైత‌న్య ప‌రిచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అలాగే అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చే అంశాల‌ను మా సినిమాలో పొందుప‌రిచాము`` అన్నారు. రో నిర్మాత డా.టిపిఆర్ మాట్లాడుతూ...``సందేశంతో పాటు మా చిత్రంలోని మంచి వినోదం కూడా ఉంటుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇలాంటి చిత్రాలు చాలా అవ‌స‌రం. ముఖ్యంగా యువ‌త‌కు మంచి సందేశం ఇస్తూ.. ల‌వ్ స్టోరిని కూడా మిక్స్ చేశాం. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్‌ాకులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం`` అన్నారు. రో అఖిల్ కార్తిక్ మాట్లాడుతూ...``దేశానికి ఉప‌యోగ‌పడే క‌థాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇలాంటి చిత్రంలో నటించే అవ‌కాశం

అ ని

మ‌ హీ

క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాతల ‌ ‌కు ధ‌న్య‌వాదాలు`` అన్నారు. రోయిన్ ప్రియాంక‌శ‌ర్మ మాట్లాడుతూ...``విభిన్న‌మైన చిత్రంలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు ఇందులో మంచి సందేశం ఉంద‌న్నారు. ట‌ల ర‌చ‌యిత య‌ర్రంశెట్టి సాయి మాట్లాడుతూ...`` ప్ర‌జా స‌మస ‌ ్య‌ల‌పై ఈ చిత్రం వ‌స్తోంది. స‌మ‌కాలీన అంశాల గురించి చ‌ర్చించే ప్ర‌యత ‌ ్నం చేస్తున్నాం. ఇందులో క‌మర్షియ‌ల్ హంగులు కూడా మెండుగా ఉంటాయి`` అన్నారు. ర్శ‌కుడు భ‌ర‌త్ మాట్లాడుతూ...`` సైక్రియాటిస్ట్ అయిన డా.శ్రీధ‌ర్ మంచి క‌థ‌ని సిద్ధం చేసుకుని మ‌రో ఇద్దరు ‌ మిత్రుల‌తో క‌లిసి `ప్ర‌థ ప్రొడ‌క్షన్ ‌ స్` అనే బ్యాన‌ర్ ని స్థాపించి ఓ మంచి సందేశాత్మ‌క చిత్రాన్ని నిర్మించాల‌ని ఆలోచిస్తున్న త‌రుణంలో నా మిత్రుడైన సాంబేష్ వారికి న‌న్ను ప‌రిచ‌యం చేశారు. ఫ‌స్ట్ సిటింగ్ లోనే వారు న‌న్ను డైరక్ట‌ర్ గా క‌న్ ఫ‌ర్మ్ చేశారు. ఒక భార‌తీయుడు, అప‌రిచితుడు, ఠాగూర్ చిత్రాల త‌ర‌హాలో ఉండే క‌థ ఇది. నిజంగా దీన్ని డైర‌క్ట్ చేయ‌డం ఒక ఛాలెంజింగ్ అని చెప్పాలి. మా ముగ్గురు నిర్మాతలు ‌ కూడా డాక్ట‌ర్లు కావ‌డంతో వారికి సొసైటీ మీద మంచి అవ‌గాహన ఉంది. బ్యాన‌ర్ ద‌గర ్గ‌ నుంచి టైటిల్, క్యాప్షన్ ‌ ఇలా ప్ర‌తి విష‌యంలో కేర్ తీసుకుంటూ కొత్తగా ‌ ఉండేలా ప్ర‌య‌త్నం చేస్తున్నాం. య‌ర్రంశెట్టి సాయి గారు డైలాగ్స్ అద్భుతంగా రాసారు. ఇందులో ఓ స్టార్ హీరో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో ఎవ‌ర‌నేది ప్ర‌క‌టిస్తాం. సామాన్యుల‌కు విద్య , వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే స‌మాజం బాగుంటుంద‌నేది మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఏ ప్ర‌భుత్వానికి వ్య‌తికేఖంగా మేము సినిమా తీయ‌డం లేదు. సిస్ట‌మ్ లో ఉన్న కొన్ని లోటు పాట్ల‌ను ఎత్తి చూపుతూ వాటిని ప‌రిష్క‌రించ‌మంటున్నాం. కేర‌ళ‌లో రెండు పాట‌లు చిత్రీక‌రించి ఆ త‌ర్వాత వ‌రంగ‌ల్ లో 25 రోజుల పాటు షూటింగ్ చేస్తాం. మిగిలిన భాగం హైద‌రాబాద్ లో పూర్తి చేసి ఏప్రిల్ లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

హీ

మా

ద‌

టాలీవుడ్ P 9


సూ

పర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ‌ , హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలియజేశారు. పర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే,

సూ

ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్ప్ ‌ లే, దర్శకత్వం: శంకర్‌.

                  

10 P టాలీవుడ్






లు ఆంగ్ల మరియు హిందీ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ ను దశదిసలా వ్యాపిస్తున్న మోస్ట్ పాపులర్ హాలీవుడ్ లేడీ సన్నీలియోన్ మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్ గా ఒక సినిమా సైన్ చేసింది. కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరైన వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్ఛర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందున్న ఈ చారిత్రాత్మక యుద్ధ నేపధ్య చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా నటించనుంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. దుకోసం సన్నీలియోన్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ మరియు కొన్ని యుద్ధ కళలను నేర్చుకొనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ ట్రైనర్ ఈ కళలను ముంబైలో సన్నీలియోన్ కు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం సన్నీలియోన్ ఏకంగా 150 రోజుల కాల్షీట్స్ ను దర్శకనిర్మాతలకు ఇవ్వడం బట్టి సినిమాపై ఆమెకున్న నమ్మకం తెలుస్తోంది. "బాహుబలి, 2.0" చిత్రాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు.

ఇం

సినిమాలో దాదాపు 70 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు. సినిమా గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ.. "ఇప్పటివరకూ నాకున్న ఇమేజ్ ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లలో యాక్ట్ చేయాలన్నది నా కల, అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్నాను. దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పట్నుంచో ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకొంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది" అన్నారు. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవ్వనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సెట్ వర్క్ ప్రస్తుతం వాయివేగంతో జరుగుతున్నాయి.

2018

టాలీవుడ్ P 11


       

`మా

` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఈ ఏడాదితో 25వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించేలా `మా` నూత‌న కార్య‌వ‌ర్గం ప్లాన్ చేసిన విష‌యం విధిత‌మే. దీనిలో భాగంగా ఇటీవల ఎఫ్ .ఎన్ .సి.సి క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వేడుక‌లు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేశారు. ఇదే వేదిక‌పై సీనియ‌ర్ న‌టుడు రాళ్ల‌ప‌ల్లి, సీనియ‌ర్ పాత్రికేయ‌లు గుడిపూడి శ్రీహ‌రి, న‌టుడు శివ బాలాజీల‌ ను `మా` త‌రుపున `మా` అధ్య‌క్ష‌లు శివాజీ రాజా, జ‌న‌రల్ ‌ సెక్ర‌టరీ ‌ , ఘ‌నంగా స‌న్మానించారు. సంద‌ర్భంగా `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ,` `24 ఏళ్ల క్రింద‌ట చిరంజీవిగారు స్థాపించిన `మా` దిగ్విజ‌యంగా 25 సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా `ఐయామ్ విత్ మా` నినాదంతో సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను ఘ‌నంగా చేస్తున్నాం. అందుకు టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా క‌లిసి వ‌స్తున్నారు. చిరంజీవి , బాల‌కృష్ణ‌ నాగార్జున‌, వెంక‌టేష్,గార్ల‌ను అండ‌గగానే ఏక్క‌డికైనా రావ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని భ‌రోసా ఇచ్చారు. మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లు కూడా స‌పోర్ట్ ఇస్తామ‌న్నారు. వాళ్లందరి స‌హ‌కారం ఉండ‌టం వ‌ల‌నే ఈరోజు `మా` ఈ స్థాయిలో ఉంది. ఈ రెండేళ్ల పాటు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేశాం. ఈ

12 P టాలీవుడ్

వేడుక‌ల‌కు శుభ సూచికంగా `గోల్డేజ్ హోమ్` ను ఏర్పాటు చేయ‌బోతున్నాం. వ‌య‌సు మ‌ళ్లిన పేద కళాకారుల‌కు ఇది ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది. అలాగే మ‌రెన్నోసంక్షేమ కార్య‌క్ర‌మాలు త‌ల‌పెట్టాం. తెలంగాణ రాష్ర్టంలో జ‌రిగే తెలుగు మ‌హాభ‌ల‌కు `మా` త‌రుపున పూర్తిగా మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నాం. మీడియా స‌హ‌కారం `మా` టీమ్ కు ఎప్ప‌టిక‌ప్పుడు అందుతూనే ఉంది. అందుకు `మా` త‌రుపున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాం` అని అన్నారు. న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ ` చిరంజీవిగారు అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన `మా` ర‌జ‌తోత్స‌వాల‌ను ఈ ఏడాది మా చేతుల మీదుగా జ‌ర‌ప‌డం `మా` నూత‌న కార్య‌వ‌ర్గం అంతా అదృష్టంగా భావిస్తున్నాం. వెల్పేర్, ఎంట‌ర్ టైన్ మెంట్ కార్య‌క్ర‌మాలు ఎంజెండాగానే మా ముందుకు వెళ్తుంది. గోల్డేజ్ హోం ఏర్పాటు, మా కు సొంత భ‌వ‌నం ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తున్నాం. అలాగే ఈనెల 10వ తేదిన క‌ర్టైన్ రైజ‌ర్ ఫంక్ష‌న్ పార్క్ హ‌యత్ ‌ లో గ్రాండ్ గా చేస్తున్నాం. సూప‌ర్ స్టార్ కృష్ణ,‌ కృష్ణం రాజు గారు చేతుల మీదుగా ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. అనంత‌రం ప్ర‌పంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్ర‌జ‌ల ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు ఘ‌నంగా జ‌రగు ‌ న్నాయి. దీనిలో భాగంగా సీనియ‌ర్ న‌టీమ‌ణులు జ‌య‌సుధ‌, రొజా ర‌మ‌ణి త‌దిత‌రులు ఘ‌నంగా స‌న్మానించ‌నున్నాం` అని అన్నారు. గ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ` `మా` లో ఈరోజు ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ అద్య‌క్ష ప‌దవిలో ఉన్న

జ‌


వారంతా మంచి సంక్షేమ కార్యక్ర‌మాలు చేప‌ట్టారు. అందువ‌ల్లే `మా`కు మంచి పేరు వ‌చ్చింది. శివాజీ రాజా అధ్య‌క్షత ‌ ‌న ఏర్పాటైన నూత‌న కార్య‌వ‌ర్గంలో మ‌రిన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఫండ్ రెయిజింగ్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి` అని అన్నారు. శాధికారి ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరా ‌ వు మాట్లాడుతూ,` రాళ్ల‌ప‌ల్లి..శ్రీహ‌రి గారితా నాకు మంచి అనుబంధం ఉంది. అటు సినిమా....ఇటు జ‌ర్న‌లిజం కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను స‌న్మానించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మ‌రింత మంది గొప్ప వ్య‌క్తుల‌ను `మా` స‌త్క‌రించేలా ప్లాన్ చేస్తున్నాం` అని అన్నారు. నియ‌ర్ న‌టుడు రాళ్లప‌ల్లి మాట్లాడుతూ,` ప్ర‌స్తుతం పోటీ ప్ర‌పంచంలో నాకు అవ‌కాశాలు త‌గ్గాయి. అయినా సంతోషం. ప‌రిశ్ర‌మ‌కు కొత్త నీరు వ‌స్తోంది. ప్ర‌తిభ ఉన్న క‌ళాకారులు వెలుగులోకి వ‌స్తున్నారు. క‌ళాకారుడంటే నిత్య విద్యార్ధి. అలా క‌ష్ట‌ప‌డితేనే ఇక్క‌డ రాణించ‌గల ‌ ం. అలాగే `మా` లో 25 ఏళ్ల‌గా మెంబ‌ర్ గా ఉన్నాను. ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. గోల్డేజ్ హోమ్ ఏర్పాటు చేయ‌డం అనేది మంచి నిర్ణయ ‌ ం. తోడు..నీడ లేని వాళ్ల‌కు అది ఎంతో ఆశ్ర‌యాన్ని ఇస్తుంది. ఈ మంచి కార్య‌క్రమా ‌ నికి

కో సీ

నా వంతు కూడా చేత‌నైన స‌హాయం చేస్తాను` అని అన్నారు. నియ‌ర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహ‌రి మాట్లాడుతూ, `అంద‌రు క‌లిసి క‌ట్టుగా ఒకే తాటిపై ఉండటం అనేది అసోసియేష‌న్ కు ప్ర‌ధాన‌మైన బ‌లం. అది `మా` లో ఉంది. మంచి సంక్షేమ కార్య‌క్రమా ‌ ల‌తో కొత్త టీమ్ ముందుకు వెళ్తోంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను జర్న‌లిస్ట్ అయినా `మాకు స్వాతంత్ర్యం కావాలి` సినిమాకు సినిమాకు క‌థ రాశాను. అలాంటి సినిమాలు ఇప్పుడు రావ‌డం లేదు. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే విధంగా మంచి క‌థ‌లున్న సినిమాలు తీయాల‌ని కోరుకుంటున్నా` అన్నారు. గ్ బాస్` విన్న‌ర్ శివ బాలాజీ మాట్లాడుతూ,` `మా` నేను స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు ఆదుకుంది. అలాగే ఈరోజు న‌న్ను గుర్తించి స‌త్క‌రించ‌డం అనేది జీవితాంతం మ‌ర్చిపోలేనిది. ఇదొక అవార్డుగా...పెద్ద గౌర‌వంగా భావిస్తున్నాను` అని అన్నారు. కార్య‌క్ర‌మంలో వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, జాయింట్ సెక్ర‌ట‌రీలు ఏడిద శ్రీరామ్, హేమ `మా` క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, కార్య‌వ‌ర్గ స‌భ్యు లు సురేష్‌, ఉత్తేజ్, అనితాచౌద‌రి, గీతా సింగ్ తదిత‌రులు పాల్గున్నారు.

సీ

`బి

టాలీవుడ్ P 13


కో

న వెంకట్ సమర్పణలో "గీతాంజలి" చిత్రాన్ని నిర్మించిన ఎం.వి.వి సినిమా మరియు కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న నూతన చిత్రం డిసెంబర్ 21న ప్రారంభంకానుంది. "సరైనోడు, నిన్నుకోరి" లాంటి చిత్రాల్లో వెర్సటైల్ రోల్స్ ప్లే చేసి, ఇప్పుడు "రంగస్థలం, అజ్ణాతవాసి" చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషిస్తున్న ఆది పినిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా తాప్సీ నటించనుండగా మరో ప్రముఖ కథానాయిక కూడా ఈ చిత్రంలో నటించనుంది.

ది పినిశెట్టి-తాప్సీ వైవిధ్యమైన పాత్రల్లో నటించనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ హైద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడల నేపధ్యంలో రూపొందనుంది. న్నెల కిషోర్, శివాజీరాజా, తులసి, సాయిచంద్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి "లవర్స్" ఫేమ్ హరి దర్శకత్వం వహించనున్నారు. చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: అనిల్-భాను, పి.ఆర్.ఓ: వంశీ కాక, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కెమెరా: తోట రాజు (అర్జున్ రెడ్డి ఫేమ్), కళ: చిన్న, సంగీతం: గోపీసుందర్, కూర్పు: ప్రవీణ్ పూడి, కో-డైరెక్టర్: భాస్కర్, మాటలు: కోన వెంకట్-భవానీ ప్రసాద్, నిర్మాత: ఎం.వి. వి.సత్యనారాయణ, కథ-దర్శకత్వం: హరి.

వె ఈ





14 P టాలీవుడ్






కొ

త్త న‌టుడు శ్రీకాంత్ హీరోగా, హేమ‌ల‌త (బుజ్జి) హీరోయిన్ గా వీర‌భద్ర ‌ క్రియేష‌న్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది హేమ‌ల‌తా రెడ్డి నిర్మాత.‌ కె.గోవ‌ర్ధ‌న్‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ హైదరాబాద్ మరియు అమలాపురం పరిసరప్రాంతాల్లో శరవేగం గా జరుపుకుంటుంది. సీనియర్ హీరోయిన్ సుహాసిని గారితో కొని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సుహాసినిగారు ఈ చిత్రం కథ విని చాల అద్భుతంగా ఉంది సినిమా. యితే ఈ చిత్రానికి ' నిన్నే చూస్తు ' టైటిల్ ను నామకరణం చేసారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ హేమలత రెడ్డి మాట్లాడుతూ "మా ఈ చిత్రానికి నిన్నే చూస్తు అనే టైటిల్ ఫిక్స్ చేసాము. ఈ చిత్రానికి నిన్నే చూస్తు టైటిల్ చాల చక్కగా సరిపోతుంది. మొదటి షెడ్యూల్ లో సీనియర్ హీరోయిన్ సుహాసిని గారితో కొని కీలక సన్నివేశాలు చిత్రకరించాము. సుహాసినిగారు సినిమా కథ విన్నీ చాల బాగుంది మంచి హిట్ అవుతుంది అని అన్నారు. ఒక్క లేడీ ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాల గర్వం గా ఉంది అన్ని అన్నారు సుహాసిని గారు. దర్శకులు

కె.గోవ‌ర్ధ‌న్‌రావు కథ అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం" అని అన్నారు. ను చందర్, సుమన్ , సన , కాశీ విశ్వనాధ్ , రజిత , విద్య లతా , నిహాల్ , వేణు , మహేష్ , ఫణి , రమణ్ , వెన్నెల కిశోర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె గోవర్ధన్ రావు, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), సెకండ్ కెమెరా మాన్ శంకర్ , ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్.

భా

టాలీవుడ్ P 15






స్టా

ర్ హీరో సూర్యకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగాచెప్పక్కర్లేదు. సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అంతే భారీగా విడుదలౌతాయి. తాజాగా జ్ఞానవేళ్ రాజా నిర్మాతగా సూర్య కథానాయకుడిగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందించిన "తాన సెరంధ కూటమ్" అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మక యు. వి. క్రియేషన్స్ బ్యానర్లో "గ్యాంగ్" పేరుతో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొద్దిగంటల్లోనే... సూపర్బ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. అనిరుథ్ సంగీతమందించారు. జనవరి 12, 2018న ఈ

16 P టాలీవుడ్

చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశి ప్రకటించారు. సందర్భంగా నిర్మాతలు ప్రమోద్, వంశి మాట్లాడుతూ.... సూర్యకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన తమిళంలో విగ్నేష్ దర్శకత్వంలో నటించిన చిత్రాన్ని తెలుగులో గ్యాంగ్ పేరుతో మా యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీగా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. అనిరుధ్ సంగీతమందించిన పాటలు చాలా బాగా వచ్చాయి. కీర్తి సురేష్ నటన హైలైట్ గా నిలుస్తుంది. కార్తిక్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపిస్తారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.






శ్రీ

రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీపతి కర్రి దర్శకత్వంలో గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. రద్రాక్ష్ ఉత్కమ్, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో హల్ చల్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. టైటిల్ ఎంత క్యాచీగా ఉందో ఆడియెన్స్ ను అదే స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తుందని దర్శకుడు శ్రీపతి కర్రి అంటున్నారు. ల్ చల్ ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.... హల్ చల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేస్ అంశాలతో పాటు.. అన్ని రకాల కమర్షియల్ యాంగిల్స్ ని టచ్ చేశాం. అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా స్క్రిప్ట్ కుదిరింది. నా తొలి చిత్రమైనప్పటికీ నిర్మాత గణేష్ కొల్లూరి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సపోర్ట్ తో నేను అనుకున్న దానికంటే కూడా బాగా షూటింగ్

చేయగలుగుతున్నాం. రుద్రాక్ష ఉత్కమ్, ధన్యా బాలకృష్ణ క్యారెక్టరైజేషన్స్ అబ్బురపరుస్తాయి. ఇద్దరూ జోష్ ఫుల్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే... నా మీద మరింత బాధ్యత పెరిగింది. ఆడియెన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా... ఎంటర్ టైన్ చేసే విధంగా సినిమా ఉంటుంది. అని అన్నారు. ర్మాత గణేష్ మాట్లాడుతూ... శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీపతి దర్శకత్వంలో మేం నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాం. సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మంచి క్యాచీ టైటిల్ పెట్టారనే ప్రశంసలు దక్కాయి. దర్శకుడు శ్రీపతి చాలా క్లారిటీగా ఉన్నాడు. తప్పకుండా సూపర్ హిట్ ఫిల్మ్ మా బ్యానర్ నుంచి వస్తుందని ఆశిస్తున్నాం. రుద్రాక్ష్, ధన్యా పెర్ ఫార్మెన్స్ హైలెట్ గా ఉంటుంది. అటు ఆర్టిస్టులు... ఇటు టెక్నీషియన్స్ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

ని

టాలీవుడ్ P 17




నవరి 25, 2018న విడుదలకి సిద్దమవుతున్న 'రాజారథం' చిత్రంలో రానా దగ్గుబాటి కూడా భాగమైనట్టు తెలుస్తోంది. 'బాహుబలి'లో 'భళ్లాలదేవుని'గా మెప్పించిన రానా పార్టిసిపేషన్‌ ఎలాంటిది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఆకట్టుకునే ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌తో 'రాజరథం'పై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు రానా కూడా ఈ టీమ్‌తో కలవడం వల్ల సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రంతో హీరో, హీరోయిన్లుగా నిరూప్‌భండారి, అవంతిక షెట్టి తెలుగు తెరకు పరిచయం అవనున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తమిళ స్టార్‌ హీరో ఆర్య, పి.రవిశంకర్‌కనిపిస్తారు. ఇప్పుడు ర్శకుడు అనూప్‌భండారి ఈ చిత్రానికి కథ, పాటలు, సంగీతం అందించటం తో పాటు కొన్ని పాటలు కూడా పాడటం విశేషం. నిరూప్‌ భండారి హీరోగా అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన 'రంగి తరంగ' చిత్రాన్ని యు.ఎస్‌, యూరప్‌ దేశాలలో పంపిణీ చేసిన 'జాలీ హిట్స్‌' సంస్థ తమ తొలి ప్రయత్నంగా 'రాజారథం' చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. నిర్మాత అజయ్‌రెడ్డి ఉత్తమ ప్రమాణాలతో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులకి అందించాలనే తపనతో టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ వరకు ఉన్న అత్యున్నత సాంకేతిక నిపుణులతో ఈ 'రాజారథం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

18 P టాలీవుడ్

టాప్‌టెక్నికల్‌టీమ్‌: రజత్‌ పొద్దార్‌ (ప్రొడక్షన్‌ డిజైనర్‌) : జుద్వా 2 , బర్ఫీ, జగ్గా జాసూస్‌ జానీ మాస్టర్‌ (డాన్స్‌ కొరియోగ్రాఫర్‌) : రాజకుమార, బాహుబలి-2, సరైనోడు, సన్నాఫ్‌సత్యమూర్తి, ధృవ బోస్కో, సీజర్‌ (డాన్స్‌ కొరియోగ్రాఫర్‌) : బాంగ్‌ బాంగ్‌, శ్రీమంతుడు, ధృవ, బద్రీనాథ్‌కి దుల్హనియా, షాందార్‌, తమాషా శివకుమార్‌ (కలర్‌ గ్రేడింగ్‌) : బాహుబలి 1, బాహుబలి 2 , రంగితరంగా, మగధీర, ద శ్యం అజనీష్‌ లోకనాథ్‌ (బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌) : కిరిక్‌ పార్టీ, ఉలిదవారు కందంతే, రిచీ, రంగితరంగా దీపేష్‌వర్మ (రిథమ్‌అరెంజర్‌) : పద్మావతి, ట్యూబ్‌లైట్‌, చెఫ్‌, గోల్‌మాల్‌అగైన్‌ అబ్బూరి రవి (మాటలు) : హైపర్‌, ఊపిరి, ఎవడు, బొమ్మరిల్లు రామజోగయ్య శాస్త్రి (పాటలు) : జనతా గ్యారేజ్‌, అత్తారింటికి దారేది, ఈగ, బాహుబలి కొత్త కధల్ని, టాలెంట్‌ని, ప్రేక్షకులు, పరిశ్రమ ఆదరిస్తూనే వచ్చారు. అలాంటి వినూత్న ప్రయత్నంతో జనవరి 25, 2018న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న 'రాజారథం' ఎలాంటి సంచలనాలు స ష్టిస్తుందో చూడాలి...!


   




   




మె

గా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థా నాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్ థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌ మ‌వుతున్న చిత్రానికి `తొలి ప్రే మ‌` అనే టైటిల్‌ను నిర్ణ‌యించా రు. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడువెంకీ అట్లూరి ద‌ర్శకు ‌ డు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత.‌ ఈ సి నిమాను ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చే స్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను ఇటీవల విడుద‌ల చేశారు. సంద‌ర్భంగా... నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ మా ట్లాడుతూ - ``ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంఇ. ద‌ ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఓ క్యూట్ అండ్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించారు.వ‌రుణ్ తేజ్‌ను స‌రికొత్త క్యారెక్ట‌ర్‌లోప్రే క్ష‌కులు చూడటం ఖాయం. `తొలిప్రేమ‌` అనే టైటిల్‌తో తెర‌

కెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకునే బ్యూ టీఫుల్ ల‌వ్ ఎంట‌ర్టై ‌ న‌ర్‌. ఈ డిసెంబ‌ర్ నెల‌లో షూటింగ్ పూర్ త‌వుతుంది. జ‌న‌వ‌రిలో పోస్ట్ ప్ రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌నుపూ ర్తి చేస్తాం. ఫిబ్ర‌వరి 9న సిని మాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నా హాలు చేస్తున్నాం`` అన్నారు. చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిం చ‌గా, జార్జ్ సి.విలియ‌మ్స్ సి నిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.





టాలీవుడ్ P 23


 



24 P టాలీవుడ్

 


  

  

 

టాలీవుడ్ P 25


 

      RRR-  

26 P టాలీవుడ్


Btech 

 

  టాలీవుడ్ P 27


   

   28 P టాలీవుడ్


 

 S 

టాలీవుడ్ P 29


 TFJA



TFJA

30 P టాలీవుడ్

  


  TFJA

  TFJA

టాలీవుడ్ P 31


 TFJA

 TFJA

TFJA

32 P టాలీవుడ్


       TFJA

FDC



TFJA

TFJA



టాలీవుడ్ P 33


 TFJA

TRS

TFJA TRS

 TFJA

34 P టాలీవుడ్




 TFJA



TFJA ID

FDC టాలీవుడ్ P 35


  TFJA

TFJA





36 P టాలీవుడ్


TFJA

TFJA

    

TUWJ

టాలీవుడ్ P 37


TFJA

TFJA 38 P టాలీవుడ్




Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.